కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జూన్ 7 రెబ్బెన : బెల్లంపల్లి ఏరియా గోలేటి సింగరేణిలో పని చేసి ఇతర ఏరియా కు బదిలీపై వెళ్తున్న అధికారులను ఎస్సి, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జియం కార్యాలయంలో వారిని సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డిజిఎం పర్సనల్ జె కిరణ్ కుమార్ సన్మాన గ్రహీతలు కమలాకర్ బొషన్ డిజిఎం ఏరియా వర్కుషాప్,కిరణ్ ఎస్ఈ ఐఈడి,చంద్రమౌళి ఎస్ఈ ఘనంగా సన్మానించారు.అనంతరం వారు మాట్లాడుతు బదిలీ పై వెళుతున్న అధికారులు వెళ్లిన ఏరియాలో దళితులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకొని కమ్యూనిటీ అభివృద్ధికి కృషి చేయాలనీ కోరారు.చేస్తున్న పనిలో కూడా కంపెనీ పురోభివృద్ధికి కృషి చేయాలనీ ఈ సందర్బంగా వారికీ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సి లైజన్ ఆఫీసర్ పరమేశ్వర్, ఎస్టీ అసోషన్ నాయకులు బోడ బద్రు,సంజేష్,ఏరియా ఆసుపత్రి డాక్టర్లు అరవింద్,చిన్నయ్య,ఐటి మేనేజర్ నారాయణ,రవికుమార్,సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment