కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జూన్ 2 ; రెబ్బెన; మండల కేంద్రంలో తెలంగాణ 4వ ఆవిర్భావ వేడుకలు ప్రజలు, ప్రభుత్వాధికారులు అత్యంత వైభంగా జరుపుకున్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్టం కోసం ఎన్నో బలిదానాలు,ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్టంగా ఏర్పడి నేటితో 4 సంవత్సరాలు ఐన సందర్బంగా శెనివారం మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయంలో సాయన్న, ఎంపిడిఓ కార్యాలయంలో సత్యనారాయణ సింగ్,గ్రామపంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ పేసరి వెంకటమ్మ, సీఐ కార్యాలయంలో పురుషోత్తం చారి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ శివకుమార్,టీబీజీకేఎస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేశారు.అన్ని గ్రామ పంచాయితీల్లో కూడా సర్పంచులు మరియు ప్రభుత్వ,ప్రయివేటు పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జెండాను ఎగురవేసి తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా ఆవిర్భావ వేడుకలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమాలలో ప్రభుత్వాధికారులు, సిబ్బంది,ఉపాధ్యాయులు,విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment