కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జూన్ 14 ; ప్రభుత్వం ప్రకటించిన పోలీసు కొలువును సాధించేందుకు కొమురంభీం జిల్లా పోలీసులు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణకు అర్హులైన జిల్లా అభ్యర్థులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ కల్మేశ్వర్ సింగనవార్ కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రేమళ గార్డెన్లో నిర్వహించిన ప్రీ సెలక్షన్ టెస్ట్ ను జిల్లా ఎస్పీ పర్యవేక్షించారు.ఈ సందర్బంగా హాజరైన అభ్యర్థుల యొక్క ధ్రువపత్రాలను పరిశీలించి ఎత్తును నమోదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎన్నో వ్యయ ప్రాసలతో కూడుకున్నదని అందుకొరకే జిల్లాలో ఉన్న అభ్యర్థుల కొరకు ఉచిత శిక్షణను ప్రారంభించడం జరిగిందన్నారు. అంతేకాక ఉచిత శిక్షణకు జిల్లాలోని అభ్యర్థుల నుండి అనూహ్య స్పందన లభించిందని అన్నారు గురువారం మండలాల వారీగా ప్రారంభించిన ప్రీ సెలక్షన్ టెస్టులకు రెబ్బెన మండలం నుండి 39 మంది మహిళా అభ్యర్థులు,153 మంది పురుష అభ్యర్థులు,ఆసిఫాబాద్ నుండి 22 మంది మహిళా అభ్యర్థులు 114 మంది పురుష అభ్యర్థులు, వాంకిడి మండలం నుండి 17 మంది మహిళా అభ్యర్థులు 75 మంది పురుష అభ్యర్థులు తిర్యాని మండలం నుంచి 24 మంది మహిళా అభ్యర్థులు ,69 మంది పురుష అభ్యర్థులు పాల్గొన్నారని అన్నారు. సమయానుసారం ప్రకారం పాల్గొనలేకపోయిన అభ్యర్థులు 18-06-2018 సోమవారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు జిల్లా పోలీసు హెడ్ క్వాటర్స్ నందు హాజరు కావచ్చునని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలిపారు. శిక్షణకు ఎంపిక కాబడిన అభ్యర్థులకు ఉచితంగా భోజన వసతి సదుపాయాలను జిల్లాలోని కాగజ్నగర్ ఆసిపాబాద్ మరియు జైనూర్ లలో ఏర్పాటు చేయడంజరుగుతున్నదని వీటితో పాటుగా ఫిజికల్ ఇవెంట్స్ కొరకు ఒక జత షూ మరియు రెండు జతల స్పోర్ట్స్ దుస్తులను అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు శ్రీనివాస్, బాలాజీ వరప్రసాద్, ఆర్ఐలు సంతోష్,శేఖర్ బాబు, చంద్రశేఖర్, వాంకిడి ఎస్ఐ ముస్క రాజు, డిపిఓ సుపరిడెంట్ సతీష్, సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్, పిడిలు ఊషన్న, హేమంత్, శెంకర్ తదితరు పాల్గొన్నారు.
No comments:
Post a Comment