“ చేయూత “ తో జిల్లా హోం గార్డ్స్ కు సహయత ; జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 21 (వుదయం ప్రతినిధి); “చేయూత” కార్యక్రమము ద్వారా జిల్లా లోని హోo గార్డ్స్ కు లబ్ది ను పొందుతున్నారని, వారి యొక్క సేవల గుర్తించి వారికీ సముచిత స్థానం ను కలిస్తామని , వారి జీవన ప్రమాణాలను పెంచేలా మున్ముందు అబివృద్ది కార్యక్రమాలు వారికోసం చేపడతాము అని ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. బుధవారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కార్యాలయంలో హోంగార్డ్ “చేయూత” కార్యక్రమమును ఏర్పాటు చేసరు. ప్రమాదవశతూ మరణించిన హోంగార్డ్ కుమ్రం బీకాజి యొక్క కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం క్రింద 68,800/- రూపాయల చెక్కును అందచేశారు మరియు కుటుంబం లో అర్హతలు కలిగిన వారికీ ఉద్యోగం కలిపించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పి హామీఇచ్చారు. అంతేకాక జిల్లా పోలీసులు సమాజం లొ నెలకొని వుండే రుగ్మత ల పైన కూడా పోలీసులు ద్రుష్టి కేంద్రికరించేలా ప్రణాలికలను సిద్దం చేసి కార్యోన్ముకులను చేస్తామని ప్రజాసంబంధ కార్యక్రమాలు ద్వారా పోలిసుల యొక్క ఆత్మస్థైర్యం పెరగుతుందని సమాజం లో నూతన ఉత్సాహం తో పోలీసులు విధులు నిర్వర్తిస్తారని తెలిపారు ,తద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమము లో ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు ,ఎస్బి ఎసై లు శివకుమార్,శ్యాం సుందర్, ఎస్పిసీసీ శ్రినివాస్, హోం గార్డ్ ఆర్.ఐ అనిల్ కుమార్, హోo గార్డ్ డ్యూటీ మేజర్ వాజిద్అహ్మద్ ఖాన్ ,అవినాష్, హోం గార్డ్స్ లు దుర్గ ప్రసాద్ ,దీపక్ ,విష్ణువర్ధన్ ,జ్ఞానేశ్వర్ , క్యాంపు కార్యాలయ సిబ్బంది జి.కిరణ్ కుమార్ , వామన్ ,పి.ఆర్.ఓ మనోహర్ లు పాల్గొన్నారు .
హోం గార్డ్ ఆర్.ఐ ..కోట్ – J.అనిల్ కుమార్.
జిల్లా లోని ప్రధాన పోలీసు అధికారి సన్ ప్రీత్ సింగ్ గారు హోంగార్డ్ సిబ్బంది సంక్షేమము కై ప్రారంబించిన " చేయూత " హోం గార్డ్ లకు వరం లాంటిది , ఇటువంటి ఆర్థిక సహకారం వల్ల హోం గార్డ్ లకు ,వారి కుటుంబాలకు స్వాంతన చేకూరుతుంది
హోం గార్డ్ – కోట్ – దీపక్.
జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ దయ వల్ల ఏ జిల్లా లొ కూడా లేని విదముగా హోం గార్డ్ సంక్షేమ కార్యక్రమాలు కుమరం భీమ్ జిల్లా లొ అమలు అవుతున్నాయి,మా యొక్క సమస్యలను జిల్లా ఎస్పి గారి తో నేరు గా చెప్పుకునే సౌకర్యం కలిపించిన జిల్లా ఎస్పి గారికి మా యొక్క దన్యవాదములు.