Saturday, 30 June 2018

రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 30 ;  రెబ్బన ; రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి  వేతన సదుపాయం కలిపించాలని రేషన్ డీలర్ల సంగం మండలాధ్యక్షుడు ఎస్  రామయ్య అన్నారు.  మండల కేంద్రం లో తహశీల్దార్ కార్యాలయం ముందు శెనివారం  రేషన్ డీలర్లు ఒక్క రోజు దీక్ష కార్యాచరణ చేపట్టారు .ఈ సందర్బంగా  మాట్లాడుతు చాలి చాలని కమిషన్లతో కాలాన్ని వెళ్లదీస్తున్నామని , రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా డీలర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ  ప్రభుత్వాము పట్టించుకోవడం లేదన్నారు. డీలర్ల న్యాయమైన  సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.  రేషన్ డీలర్లకు వేతన సదుపాయం కలిపించాలని అన్నారు. పలు పార్టీల నాయకులు రేషన్ డీలర్ల దీక్ష శిబిరానికి చేరుకొని మద్దతు తెలిపారు.అనంతరం రేషన్ డీలర్లు తహశీల్దార్ సిబ్బందికి వినతిపత్రాన్ని అందజేశారు.ఈ ధీక్షలో జి  బాపు,జె శెంకర్ లాల్,వి రాజమణి,ఎల్ గోపాల్,వి నిర్మల,కె శెంకర్, జి జానకి రామ్,జి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.     

తొంబై ఆరు శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన బెల్లంపల్లి ఏరియా ఘనులు


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 30 ;  రెబ్బన ; బెల్లంపల్లి ఏరియాలో ఈ ఆర్థిక సంవత్సర  జూన్  నెలకు గాను తొంభై ఆరు శాతం ఉత్పత్తిని సాధించినట్టు ఏరియా  జనరల్ మేనేజర్ కె రవి శెంకర్ తెలిపారు. శెనివారం  రెబ్బెన మండలం  గోలేటి  జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అయన ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. జూన్  నెలకు గాను. ఏరియాకు నిర్దేశించినిన 580000  టన్నుల బొగ్గు  ఉత్పత్తికి గాను 554313  టన్నుల ఉత్పత్తి తో 96 % శాతం సాధించినట్టు తెలిపారు.ఘనుల ఉత్పత్తి పరంగా  చూసుకున్నట్లయతే  ఖైరిగూడ ఓసిపి 310000 టన్నులు గాను 228743 (74 %) ఉత్పత్తి జరిగినట్టు తెలిపారు, బెల్లంపల్లి ఒసిపి 2 ఎక్స్టెన్షన్ 80000 టన్నులకు గాను 87106 (109 %) టన్నులు  ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు, అదేవిదంగా  డోర్లి -1ఓసిపి 190000 టన్నులకు గాను 238464 (126 %) టన్నుల  ఉత్పత్తి సాధించినట్లు పేర్కొన్నారు. గడిచిన నెలలో ఏర్పడిన ఉత్పత్తి లోటును వచ్చే నెలలో అధిగమిస్తామన్నారు.  అదేవిదంగా కార్మికులకు ఉత్పత్తి ఉత్పాదనతో పాటు కార్మికులకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నాల్గవ విడత హరిత హారంలో భాగంగా బెల్లంపల్లి ఏరియాలో 6.80 లక్షల మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.కొత్తగా నిర్మించిన సిఎస్పి వద్ద పొల్యూశషన్ నివారణలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా మూడు సంవత్సరాల నుండి పెంచిన నాలుగువందల పెద్ద మొక్కలను నాటుతామన్నారు.ఏరియా లో నీటి ఎద్దడి సమస్యను గమనించామన్నారు ఆ సమస్యను నివారించేందుకు 30 కొత్త బోర్లను వేసేందుకు ప్రణాలికను సిద్ధం చేస్తున్నామన్నారు.మాదారం లో రోడ్లు సరిగ్గా లేనందున వాటిని తొందర్లోనే  మరమత్తులు చేపడతామన్నారు దానితో పాటు ఏరియా లో సివిఆర్ క్లబ్ లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.అదేవిదంగా అంతర్జాతీయ  యోగ దినోత్సవం నాడు 1.26 లక్షల మంది యోగాలో పాల్గొని జాతీయ స్థాయిలో  బహుమతి సాధించిందని అన్నారు. యోగా చేయడం వలన కార్మికులు సుఖ సంతోషం ఆరోగ్యం తో ఉంటారన్నారు.గోలేటి లో బుద్దుడి విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు బుద్దుడి మార్గంలో అందరు నడ్చుకొని ఆయనను ఆదర్శశంగా తీసుకోవాలన్నారు.ఈ  సమావేశంలో ఎస్వోటూ జీఎం వీరాస్వామి, డిజిఎం పర్సనల్ కిరణ్ ,డీవైపీఎం రాజేశ్వర్,సుదర్శన్, ఐఈడీ ఎస్ ఈ యోహాన్,కమ్మునికెషన్ సెల్ కుమార స్వామి తదితులు పాల్గొన్నారు.

Friday, 29 June 2018

ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం

కుమురమ్ భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: 29: విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ అన్నారు. రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా శుక్రవారం రోజున కుమురమ్ భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పాలనాధికారి కార్యాలయం ముందు బైఠాయించి విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు నెలకొన్న ప్రభుత్వం, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. పెండింగులో ఉన్న ఉపకారవేతనాలు, ఫీజు రేయింబర్స్మెంట్ లను వెంటనే విడుదల చేయాలని, పెరుగుతున్న ప్రైవేటు పాటశాలల దోపిడీని అరికట్టి కార్పొరేట్ విద్యా సంస్థలను రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. అదే విధంగా జిల్లాలో అనేక విద్యా వనరులు కల్పించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కల్పించడంలో పూర్తిగా జిల్లా యంత్రాంగం విఫలం చెందిదని ఆరోపించారు. అసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రారంభించాలని, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలను మంజూరు చెయ్యాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షుడు బావునే వికాస్, కార్యదర్శి పూదరి సాయికిరణ్, డివిజన్ ఉపాధ్యక్షుడు పర్వతి సాయి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి చిరంజీవి, నాయకులు జాడి సాయి, మహేందర్, అరుణ్ సాయి, అనుదీప్, వంశీ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఏబివిపి జిల్లా హాస్టల్స్ కన్వీనర్ గా జుమ్మిడి అరుణ్ కుమార్


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 29 ;  రెబ్బెన: ఏబివిపి హాస్టల్స్ జిల్లా కన్వీనర్ గా జుమ్మిడి అరుణ్ కుమార్ ను ఎన్నుకున్నట్లు ఈ నెల 27 మరియు 28 వ తేదీలలో లక్షిట్ పేటలో జరిగిన  ఏబివిపి ఆదిలాబాద్ విభాగ సమీక్షా యోజన సమావేశంలో ఏబివిపి తెలంగాణ  ప్రాంత సహా సంఘటన కార్యదర్శి చిరిగే శివకుమార్ తెలిపారు.ఈ సందర్బంగా అరుణ్ కుమార్ మాట్లాడుతు నమ్మకంతో ఏబివిపి కొమురంభీం జిల్లా హాస్టల్స్ జిల్లా కన్వీనర్ పదవి అప్పజెప్పినందుకు నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత బాధ్యత యుతంగా హాస్టల్స్ సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. 

గ్రామ పంచాయతీ కార్మికుల హక్కుల సాధన కోసమే సమ్మె

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ;  రెబ్బెన; జూన్ 29 ; తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికుల హక్కుల సాధన కోసమే జులై 5వ తేదీ తరువాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తామని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఉపేందర్ మరియు టిఆర్ఎస్ కెవి జిల్లా కార్యదర్శి ఎన్  సుధాకర్ అన్నారు శుక్రవారం సమ్మెకు సంబంధించిన కరపత్రాలు రెబ్బెనలోని ఆర్&బి గెస్ట్ హౌస్ ఆవరణ లో విడుదల చేసారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత 40 సవంత్సరాల నుండి చాలి చాలని వేతనాలు తీసుకుంటూ, పస్తులు ఉంటు,గ్రామము అభివృద్ధి చెందడం లో కార్మికుల పాత్ర కీలకంగా పోసిస్తున్నారని అయినప్పటికీ వారికి నెల నెల  జీతాలు ఇవ్వడం లేదని, దీంతో వారు  అత్యంత  దుర్భరమైన స్థితిలో ఉన్నారని గతంలో సమ్మె చేసినప్పుడు రాష్ట్ర మంత్రువర్యులు కేటీఆర్  కార్మికుల సమస్యలు పరిష్కరిస్థానాన్ని హామీ ఇచ్చారని నేటివరకు దాన్ని అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు, దేశంలో వివిధ రాష్ట్రాలో ఇస్తున్నట్లు వారికి నెలకు కనీస వేతనాలు18 వేలు ఇవ్వాలని,అలాగే రాష్ట్ర బడ్జెట్లో  కేటాయించాలని డిమాండ్ చేశారు,సీనియర్ కారొబార్లను  పంచాయతీ కార్యదర్శి గా  నియమించాలని కోరారు కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రతి నెల జీతాలు బ్యాంక్  ద్వారా చెల్లించాలని తదితర హక్కుల సాధన కోసం జులై 3 మరియు 4వ  తేదీ లలో రెబ్బన మండల కెద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా ఉంటుందని జులై 9వ  తేదీ న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా ఉంటుందని అయిన్నప్పటికి ప్రభుత్వం స్పందించకుంటే నిరవధిక సమ్మె ఉంటుందని అన్నారు, ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి నర్సయ్య నాయకులు శెంకర్  కారోబార్లు్ ఎస్. తిరుపతి ప్రకాష్ దేవాజి  లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

హత్య కేసు లో నిందితుడి అరెస్ట్, రిమాండ్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 29 ;  రెబ్బన ; రెబ్బెన మండలం ధర్మారం గ్రామంలో ఈ నెల 27న హత్య చేసి  పరారీలో ఉన్న  నిందితుడు వెంకటేష్ ను అరెస్ట్ చేసి  రిమాండ్ కు తరలించినట్లు రెబ్బెన సర్కిల్ ఇన్స్పెక్టర్ పురుషోత్తమచారి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలిపారు.  అన్నదమ్ముల మధ్య చోటు చేసుకున్న భూ  వివాదంలో   తమ్ముడు  లచ్చయ్య (35) ను హత్య చేసి పరారీలో ఉన్న  నిందితుడు వెంకటేష్ ను అదుపులోకి తీసుకోవడానికి సర్కిల్ ఇన్సపెక్టర్ పర్యవేక్షణలో ఎస్సై శివకుమార్  ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారు.  గురువారం రాత్రి  పోలీసు బృందం వలపన్ని అతడి ఇంటివద్ద   అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.  నిందితుడిని ఆసిఫాబాద్ జిల్లా కోర్ట్ కు రిమాండ్ చేసినట్లు తెలిపారు.  చాకచక్యంగా వ్యవహరించి  48 గంటలలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీస్ బృందానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ అభినందనలు తెలిపారు. 

జిల్లా నుండి సింగరేణి అసిస్టెంట్ మేనేజర్ గా సాయితేజ



కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 29 ;  రెబ్బన ; కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుండి సింగరేణి సంస్థలో అసిస్టెంట్ మేనేజర్ గా రెబ్బెన కు చెందిన దీకొండ  సాయితేజ ఉద్యోగం సాధించారు . ఏప్రిల్ 15 న ఉద్యోగం కోసం పరీక్ష రాశారు. అదే రోజు తెలంగాణా రాష్ట్రములో 18 వ ర్యాంక్  వచ్చింది . కొత్తగూడెం కార్పొరేటు కార్యాలయములో  అధికారులు ఈ నెల 27 న మందమర్రి ఏరియా కు ఆర్డరు పత్రాన్ని ఇచ్చారు . గురు  వారము సాయితేజ మందమర్రి జీఎం కు రిపోర్ట్ చేసి ఉద్యోగములో చేరారు. జిల్లా నుండి ఒక్కడే ఈ ఉద్యోగం సాదించడము తో బెల్లంపల్లి సింగరేణి అధికారులు , జిల్లా అధికారులు , మండలవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు .దీకొండ సాయితేజ విజయ కుమారి సంజీవ్ కుమార్  దంపతుల  ఏకైక కుమారుడు. తండ్రి సంజీవ్ కుమార్ ప్రైవేట్ పాఠశాల ను నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. కుమారుడు సాయితేజ 1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు స్వంత పాఠశాల సాయి విద్యాలయం హై స్కూల్ గోలేటిలోనే విద్యాభ్యాసం చేశారు .10 వ తరగతి లో 600 మార్కులకు గాను 508 మార్కుల తో 84.6 % సాధించారు  అనంతరం కరీంనగరులోని ట్రినిటీ కళాశాలలో పూర్తి చేశారు. ఇంటర్ మెడియటే చదువు ను పూర్తి చేశారు. ఇంటర్లో 1000 మార్కులకు గాను 939 మార్కులతో 94  %, బి టెక్ మైనింగ్ లో 6363 మార్కులకు గాను 4869 మార్కుల తో 77 % సాధించారు.  ఎమ్సెట్ ద్వారా కె ఎస్ ఎం (కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్) కాకతీయ యూనివర్సిటీలో   క్యాంపస్ సీటు సాధించారు.4 సంవత్సరాలు మైనింగ్ కోర్సు 2017 మే లో పూర్తి చేశారు.  అదే విదంగా 10 వ తరగతి లో సాక్షి దిన పత్రిక వై ఎస్ ఆర్ ఫౌండేషన్ వారు నిర్వహించిన మండల స్థాయి పోటీల లో 2 వ బహుమతి సాధించారు. థైక్వండో కరాటే పోటీల లో ఎపి ఇంటర్ డిస్టిక్ ఛాంపియన్ షిప్2006 లో ప్రథమ బహుమతి సాధించారు . ది భారత్ స్కౌట్ ఓ 2010 లో సింగరేణి ఆద్వర్యములో నిర్వహించిన పోటీలలో మంచి ప్రతిభ ను కనబర్చారు . 2010-11 లో 13వ సుబ జూనియర్ నేషనల్ సెపక్ తక్రా ఛాంపియన్ షిప్ పాల్గొన్నారు. తల్లి తండ్రుల సహాకారం తో రిటడ్ స్వచ్చంద సంస్థకు ఆర్ధిక సహాయము చేశారు. అసిస్టెంట్ మేనేజర్ గా ఎంపికైన దీకొండ సాయితేజ మాట్లాడుతూ సింగరేణి సంస్థ పురోగాబివృద్ధికి తోడ్పడుతూ సంస్థకు పేరు ప్రతిష్టలు తెస్తానని అన్నారు.

Thursday, 28 June 2018

టాస్క్ ఫోర్స్ టీం తనిఖీలలో గుడుంబా పట్టివేత


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 28 ;  రెబ్బన ;  మండలం లోని గోలేటి టౌన్ షిప్ లో గుడుంబా అమ్ముతున్నారని ఖచ్చితమైన నిఘా సమాచారంతో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కల్మేశ్వర్ సింగన్ వార్ గారి ఆదేశాల మేరకు  గురువారం టాస్క్ ఫోర్స్ సి.ఐ. అల్లం రాంబాబు నేతృత్వంలోని టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్, సునీతలు తనిఖీలు చేయగా గ్రామంలోని భగత్ సింగ్ నగర్ లో నేపాల్ నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన గూర్కా లక్ష్మి యొక్క ఇంట్లో 25 లీటర్ల గుడుంబా, తదుపరి అదే గ్రామంలోని ఓర్సు సాయి ఇంట్లో 2లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకోవడం జరిగినది. ఈ అమ్మకంధారులు ఇద్దర్ని విచారించగా తమకు ఖైరిగూఢ కి చెందిన బాపురావు అనే వ్యక్తి సరఫరా చేసినట్టు తెలిపినారు. నిందితులను మరియు పట్టుకున్న గుడుంబాను తదుపరి విచారణ నిమిత్తం రెబ్బెన పోలీస్ వారికి అప్పగించరు.



Wednesday, 27 June 2018

సమయానికి రాని బస్సు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 27 ;  రెబ్బన ;  బస్సు సమయానికి రాక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని ఎఐఎస్ఎఫ్ డివిజన్ ఉపాధ్యక్షుడు పర్వతి సాయి బుధవారం  అన్నారు. రెబ్బెన మండలంలోని  నంబాల పాఠశాలలో చదువుతున్న  నారాయణపూర్, కిష్టాపూర్, జక్కుల పల్లి గ్రామాలకు చెందిన  విద్యార్థులు వస్తున్నారని పాఠశాల ముగిసిన తర్వాత వారి ఇళ్లలోకి వెళ్లడానికి ఆర్టీసీ బస్సు సమయానికి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బస్సు నాలుగు ముప్పైకి రావాల్సిన బస్సు రాత్రి ఎనిమిది గంటల తర్వాత వస్తున్నట్లు గమ్యం చేరడానికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా తొమ్మిది గంటల వరకు బస్సు రాకపోవడంతో మధ్యాహ్న భోజనం పాఠశాలల్లో చేసిన విద్యార్థులు రాత్రి తొమ్మిది గంటల వరకు తిండి తిప్పలు లేక ఇబ్బందులు పడుతున్నారని వారు చేయవలసిన హోంవర్కులు కూడా సరిగా చేయలేక చదువులో వెనక పడుతున్నారని, ప్రభుత్వం పిల్లలందరూ గవర్నమెంటు పాఠశాలల్లో చదవాలని అంటుండగా రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు.  అధికారులు స్పందించి సమయానికి బస్సు నడిపే విధంగా చేయాలని సుమారు ఎనభై మంది విద్యార్థులు బస్సులో వస్తారు ఒకవేళ బస్సు రాకపోతే ఆ విద్యార్థులు చదువుకు దూరమవడం తప్ప వేరే మార్గం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు పూదరి అరుణ, సాయి, రవి తదితరులు పాల్గొన్నారు. 




భూవివాదంలో తమ్ముడి హత్య


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 27 ;  రెబ్బన ;  అన్నదమ్ముల మధ్య చోటు చేసుకున్న భూ  వివాదం తమ్ముడి హత్యకు దారితీసింది.  బుధవారం ఈ ఘటన రెబ్బెన మండలం ధర్మారం గ్రామంలో  చోటుచేసుకుంది.  సర్కిల్ ఇన్సపెక్టర్ పురుషోత్తమచారి తెలిపిన వివరాల పకారం  రెబ్బెన మండలం ధర్మారం గ్రామానికి చెందిన  నాయని ల్లచయ్య, వెంకటేష్ లు అన్నదమ్ములు.   గత కొద్దిరోజులుగా వారి మధ్య భూమికోసం గొడవలు జరుగుతున్నట్లు తెలిపారు. బుధవారం వారి మధ్య చోటు చేసుకున్న వివాదం ముదిరి లచ్చయ్య (35) ను వెంకటేష్ గొడ్డలితో మెడమీద అతి కిరాతకంగా నరికిచంపినట్లు తెలిపారు.   ఘటన స్థలానికి చేరుకున్న రెబ్బెన సర్కిల్ ఇన్సపెక్టర్ పురుషోత్తమచారి, ఎస్సై శివ కుమార్ లు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించరు. మృతునికి  భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  మృతుని భార్య ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tuesday, 26 June 2018

పల్లికాయల విత్తనాల కోసం లొల్లి


రైతులు పల్లికాయల విత్తనాల కోసం ఆందోళన
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 26 ;  రెబ్బన ; కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ పథకంలో  రైతులకు పట్టాపాస్  పుస్తకాలపై  20 కిలోల పల్లికాయల పంపిణిని  సోమవారం రెబ్బెన మండల వ్యవసాయ కేంద్రంలో పంపిణి చేసారు. మంగళవారం మండలం లోని రైతులు సహకార సంఘానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో రైతులు చేరుకోగా పంపిణీకి సరిపడా విత్తనాల సరుకు లేదని సంబంధిత అధికారులు రైతులకు తెలపగా ఆందోళనకు దిగరు.  ఎం పి  డి ఓ సత్యనారాయణ సింగ్, సహకార సంఘం చైర్మన్ గాజుల రవి,  రెబ్బెన ఎస్సై శివకుమార్ లు  సర్ది చేప్పిరు. మండలంలో వేల  సంఖ్యలో రైతులు ఉండగా కేవలం 350 బ్యాగులు పంపడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ఏవో మంజుల ను వివరణ కోరగా నిరుపేద రైతులకోసం కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ పథకంలో  రైతులకు పట్టాపాస్  పుస్తకాలపై  20 కిలోల పల్లికాయల విత్తనాలను  రెబ్బెన మండలానికి 350 బ్యాగుల పల్లికాయ విత్తనాలు వచ్చాయని, వీటిని సోమవారము  సుమారు 40 బస్తాలు రైతులుకు పంపిణి చేశామని, మిగతా వాటిని గ్రామసభలు ఏర్పాటు చేసి లబ్ది దారులకు పంపిణి చేయనున్నట్లు తెలిపారు. ఒకేసారి మండలంలోని రైతులందరూ రావడంతో లబ్దిదారులను ఎంపిక చేయటంలో ఇబ్బంది ఉందని కావున పల్లికాయల విత్తన పంపిణీని నిలిపివేసినట్లు తెలిపారు.

కారు ఆటో ఢీ పలువురికి గాయాలు


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 26;  రెబ్బన ; రెబ్బెన మండలం లోని ఇందిరానగర్ ప్రధాన రహదారిపై మంగళవారం ఆటో కారు ఢీకొని పలువురికి  గాయాలయ్యాయి స్థానికుల సమాచారం  ప్రకారం రోడ్డుపై ట్రాక్టర్  టయారు  పగిలి ట్రాక్టర్ వెళ్తున్న తీరుని చూసి కంగారులో కన్ఫూజన్ తో ఎదురెదురుగా వస్తున్న ఆటో కారు ఢీ కొన్నట్లు పేర్కొన్నారు.  రెబ్బెన నుంచి కాగజ్నగర్ కి  వెల్లే టాటా కారు ఏపీ15ఏటీ 7318    ఆసిఫాబాద్ నుంచి రెబ్బెన వేపు  వచ్చే టి ఎస్ 20   టి 1816  ఎదురెదురుగా వచ్చి ఢీకొని పలువురికి  గాయాలయ్యాయిని తెలిపారు. గాయాలయ్యాన వారిని  కాగజ్నగర్ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు పూర్తిసమాచారం తెలియరాలేదు. 

Monday, 25 June 2018

సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటాలు ఇవ్వాలి ; భోగే ఉపేందర్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 25;  రెబ్బన ; సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు   సంస్థ లాభాలలో వాటా ఇవ్వాలని ఎస్ సి డబ్ల్యూ యు  ఏఐటీయూసీ బ్రాంచ్ అధ్యక్షులు భోగే ఉపేందర్ అన్నారు. సోమవారం గోలేటి ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోనే సింగరేణి అతి పెద్ద సంస్థ అని సుమారు 25000  మంది కాంట్రాక్టు  కార్మికులుగా చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్నారని వారికీ కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.సంస్థ అభివృద్ధికి వారి కృషి ఎంతో ఉందని, వారికీ సంస్థ లాభాలలో వాటా ఇవ్వాలని అన్నారు. హై పవర్ కమిటీ సిఫార్సుల మేరకు వారికీ వేతనాలు ఇవ్వాలని, 33 శాతం బోనస్ కాంట్రాక్టు  కార్మికులకు  చెల్లించాలని అన్నారు. ఈ సమావేశంలో కార్యదర్శి అశోక్, సహాయ కార్యదర్శి సాగర్ గౌడ్, కోశాధికారి వెంకటేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. 

Saturday, 23 June 2018

సింగరే ణి కాంట్రాక్టు కార్మికుల రాష్ట్రస్థాయి సదస్సు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 23;  రెబ్బన ;  సింగరే ణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై నెడు మంచిర్యాలలో జరిగే  రాష్ట్రస్థాయి సదస్సును విజయవంతం చేయాలనీ ఐ ఎఫ్ టి యు సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు కార్మికుల సంఘం అధ్యక్ష్యులు బి. తిరుపతి శనివారం పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోనున్నట్లు తెలిపారు.బెల్లంపల్లి ఏరియా లో పనిచేస్తున్న సింగరేణి కాంట్రాక్టు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు.

డాక్టర్ శ్యామ్ ప్రకాస్ ముఖర్జీ 63వ వర్ధంతి

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 23    రెబ్బన ; మండల కేంద్రంలో శనివారం బీజేపీ శాఖ ఆధ్వర్యంలో  డాక్టరు శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ   63వ వర్ధంతి సందర్బంగా చిత్ర పటానికి మండల  బీజేపీ  అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ  పుల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ  అయన చేసిన ప్రజా సేవను కొని ఆడారు జనసంఘ్ వ్యవస్థాపకుడని భారత దేశ సమగ్రత కోసం ప్రజలను అవగాహన  కల్పిస్తూ ఎన్నో ఉద్యమాలు చేపట్టి భారతదేశ సమగ్రతకు  ఎంతో కృషి చేసారని అన్నారు.   అయన అడుగుజాడల్లో అందరూ నడవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో  బీజేవైయం రెబ్బెన మండల అధ్యక్షులు ఇగురపు సంజీవ్,    ,బీజేవైయం ప్రధాన కార్యదర్శిలు. వడయి కాంతారావు, చెన్న సతీష్ కార్యదర్శి ఏల్పుల వెంకటేష్  తదితరులు పాల్గొన్నారు.

Friday, 22 June 2018

తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగు మందుల డబ్బాతో నిరసన

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 22 రెబ్బన ;; రెబ్బెన మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం కిష్టాపూర్ గ్రామానికి చెందిన   దుర్గం సాంబయ్య, దుర్గం లక్ష్మి దంపతులు తమ పిల్లలైన  దుర్గం జమున, దుర్గం పోచయ్య, దుర్గం శ్రీనివాస్ లతో కలసి   పురుగు మందుల డబ్బాలతో నిరసన తెలిపారు. తమకు వారసత్వంగా రావలసిన జక్కుల పల్లి లో 18 ఎకరాలు, కిష్టాపూర్లో 10 ఎకరాలు, గుడిపల్లిలో 3 ఎకరాల భూమిని తమ పాలొల్లయిన  దుర్గం మల్లయ్య, దుర్గం ప్రభాకర్ లు తమ పేరిట బదలాయించుకున్నారని ఆరోపించారు. రెవిన్యూ అధికారులకు ఎన్నోమార్లు మొరపెట్టుకున్నా న్యాయం జరగలేదని చివరికి గత్యంతరం లేక ఈ విధంగా నిరసనను తెలిపినట్లు తెలిపారు.  అధికారులు కల్పించుకొని న్యాయం చేయాలనీ కోరారు.  విషయం తెలుసుకున్న రెబ్బెన ఎస్సై శివకుమార్, తహసీల్దార్   సాయన్న బాధితుల  సమస్యను తెలుసుకొని మంగళవారం పూర్తి పత్రాలను పరిశీలించి   పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసనను విరమించారు.

విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 22 రెబ్బన ;; రెబ్బెన మండల పులికుంట ప్రాధమికోన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు స్వావలంబన  సొసైటీ వారు నోట్ పుస్తకాలూ, పెన్నులు, పెన్సిళ్లు  అందించారు. రెబ్బెన మండలకేంద్రానికి చెందిన హరీష్ ఖోడిఆర్, మీఠా ఖోడిఆర్ దంపతులు ఈ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎం సి చైర్మన్ టి పోచన్న, వి టి డి ఏ  చైర్మన్ బి లక్ష్మి, ఏ  డబ్ల్యూ డబ్ల్యూ  టీచర్  స్వప్న ,ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్,  ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Thursday, 21 June 2018

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం





కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 21 రెబ్బన;; అంతర్జాతీయ యోగా దినోత్సవము సందర్భంగా   రెబ్బెన మండలంలో గోలేటిలో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో   యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ముందుగా యోగ రన్ సింగరేణి జీఎం  కార్యాలయం నుండి పాఠశాల మైదానం వరకు నిర్వహించారు. అనంతరం పాఠశాల మైదానంలో విద్యార్థిని, విద్యార్థులు యోగ లోని పలు ఆసనాలను  ప్రదర్శించారు. అనంతరం         ఏరియా జనరల్  మేనేజర్ కె రవిశంకర్, సేవ అధ్యక్షురాలు అనురాధ రవిశంకర్ లు   మత్లాడుతూ  ప్రతిరోజూ యోగ చేయడంవలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. యోగతో  ఆరోగ్యము మెరుగు పరచుకోవచ్చని, ఆరోగ్యవంతమైన సమాజం దేశ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు. రోగాలను దూరంచేసి ఏకైక మార్గం యోగ అని దీనిని ఉచితంగా నేర్చుకొని బాల , బాలికలు ఆరోగ్యాన్ని పొందాలని ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు. ఈ  కార్యక్రమంలో డిజిఎం  పర్సనల్ కిరణ్, డిజిఎం  సివిల్ ప్రసాదరావు, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ కృష్ణ చారి,   డి వై. పి.ఎం.రాజేశ్వర్, రామ శాస్త్రి, సేవ సభ్యులు సొల్లు లక్ష్మి, కుందారపు శంకరమ్మ, సేవ యోగ సభ్యులు,  జి.ఎం.  కార్యాలయ సిబ్భంది  యోగ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జయశంకర్ వర్ధంతి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 21 రెబ్బన;; రెబ్బనలో తెలంగాణ జన సమితి మరియు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రో. జయశంకర్ సర్ 7వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా కో-ఆర్డినేషన్ కమిటీ సమన్వయ కర్త L. ప్రేమ్ కుమార్,  జాయింట్ కమిటీ జిల్లా కో-కన్వీనర్ మిట్ట దేవేందర్ , తెలంగాణ జన సమితి మండల యూత్ అధ్యక్షుడు అవిడపు గోపి, మండల కో-ఆర్డినేటర్ కమిటీ ఇంచార్జి గోగర్ల రాజేష్, రాపాల రాజశేఖర్, మడిశెట్టి శంకర్, సొగల రవి మరియు తెలంగాణ జన సమితి సభ్యులు వెంకటేష్,సతీష్, జె. సురేష్, ఏ. నవీన్, తిరుపతి,మనోజ్ జైస్వాల్, తిరుపతిలు  పాల్గొన్నారు.

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చట్టాన్ని కాపాడుకోవాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 21 రెబ్బన;;  ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చట్టం  ను నీరుకార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం,  బిజెపి నాయకులు కుట్రపన్నారని అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకునే భాద్యత  మనందరి మీద ఉందని ,  ఎమ్మార్పీఎస్  ర్రాష్ట్ర  కార్యదర్శి నారాయణ మాదిగ అన్నారు .గురువారం  రెబ్బన  అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జులై   17 న  చలోఢిల్లీ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అట్రాసిటీ చట్టాన్ని ఎస్సీ ఎస్టీలు ఏకమై చట్టాన్ని  కాపాడుకోవాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు లింగంపల్లి ప్రభాకర్ మాదిగ జిల్లా కార్యదర్శి నాగరాజు మాదిగ ఎం ఆర్ పి  ఎస్  నాయకులు  బొంగు నర సింగ్ రావు తదతరులు పాల్గొన్నారు

Wednesday, 20 June 2018

కొనసాగిన యోగ శిక్షణ తరగతులు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 20 రెబ్బెన ;: బెల్లంపల్లి ఏరియా గోలేటి సింగరేణి అన్ని ఘనులు,డిపార్టుమెంట్ల యందు  యోగ  శిక్షణ తరగతులు బుధవారం 3వ రోజున కొనసాగుతున్నాయి.21 వ తేదీన అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్బంగా యోగ శిక్షణ తరగతులు అన్ని ఘనులు డిపార్టుమెంట్ల మరియు కార్మిక వాడల్లో యోగ తరగతులు ఉత్సహంగా కొనసాగుతున్నట్లు ఏరియా ఏరియా డిజిఎం పర్సనల్ జె కిరణ్ కుమార్ తెలిపారు. నేడు గురువారం అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్బంగా మధ్యాహ్నం 3.30 గం నుండి జియం కార్యాలయం నుండి యోగ రన్ మొదలై 4 గ కు సింగరేణి పాఠశాల మైదానం వరకు సాగుతుంది అన్నారు అనంతరం సామూహిక యోగ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

గ్రామ పంచాయితీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలి

 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 20 రెబ్బెన ; తెలంగాణ రాష్ట్రం లో గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారి డిమాండ్లను నెరవేర్చాలని   ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ రెబ్బెన స్థానిక ఎంపీడీవో సత్యనారాయణ సింగ్ కి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడుతు గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ఎన్నో ఏండ్లుగా చాలి చాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తూ పంచాయితీల అభివృద్ధికి పాటుపడుతున్నా కార్మికులకు  వారి కష్టాన్ని ఇప్పడికైనా గుర్తించి వారిని మున్సిపాలిటీ ఉద్యోగుల గుర్తించి  వేతనాలు చెల్లించాలని కోరారు, కరోబర్ లను పంచాయతీ కార్యదర్శిలుగా గుర్తించాలని,గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  కార్మికుల సమస్యలను పరిష్కరించడం లో విఫలమవుతున్నందున కార్మికుల హక్కుల సాధనకై తప్పని సరి పరిస్థులల్లో సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. జులై 20వ తేదీ లోగ ప్రభుత్వం స్పందించని యెడల నిరవధిక సమ్మె చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు రాయిల్ల నర్సయ్య,శెంకర్,         పంచాయితీ కార్మికులు  నాగవల్లి సుధాకర్,పి వీరయ్య,ఆర్ రమేష్,దేవమ్మ,దేవాజి,రాజమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Tuesday, 19 June 2018

చిన్నారి స్పందనను చిదిమేసిన రాక్షసులను కఠినంగా శిక్షించాలి

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 19 రెబ్బెన ; చిన్నారి స్పందనను చిదిమేసిన రాక్షసులను కఠినంగా శిక్షిస్తేనే అప్పుడే  స్పందన ఆత్మకు శాంతి చేకూరుతుందని దానితో పాటు వారి కుటుంబానికి న్యాయం జరగాలని.ఈ సందర్బంగా బెటర్ యూత్ బెటర్ సొసైటీ  స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ బస్స్టాండ్     మౌనం పాటించి కొవ్వొత్తులతో ర్యాలీ  నుండి అంబేద్కర్ విగ్రహం వరకు  నిర్వహించరు. అనంతరం సంస్థ అధ్యక్షుడు ఓరగంటి రంజిత్ కుమార్ మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కి దగ్గరలో    సొన్ మండలం కేంద్రంలో స్పందన అనే పది సంవత్సరాల పునరావృతమవుతూనే ఉన్నాయి. చిన్నారి స్పందన కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మరియు చిన్నారి హత్యకు కారణమైన వారిని తక్షణమే శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకసారి మరెవరికైనా ఇలాంటి చిన్న పిల్లలపై లైంగిక దాడులు చేయాలనే ఆలోచన రావాలంటే భయపడే విధంగా ఈ మానవ మృగంలా ప్రవర్తించిన ఈ  యువకుడిని  శిక్షించాలని మేం కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు నామాల రాజశేఖర్, ఓరగంటి రవీందర్, ప్రధాన కార్యదర్శి జనగామ అజయ్ , సహాయ కార్యదర్శి జనగామ విజయ్ కోశాధికారులు ఎగ్గ తిరుపతి, బలుగూరి తిరుపతి సభ్యులు విజయ్,కొట్రంగి శ్రీను, సురేష్ ,శ్రీను, సాయి,రాజశేఖర్, రాజు,కుమార్, వంశీ,అజయ్, గోపాల్ ,అరవింద్,రాజు, లావుడ్యా గోపాల్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

పని చేసిన పైసల కోసం ఉపాధి హామీ కూలీలా తిప్పలు ; వితంతు,వృద్ధాప్య పెన్షన్ లబ్ధిదారులకు తప్పని అగచాట్లు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 19 రెబ్బెన ; రెబ్బెన మండల పరిధిలోని వివిధ  గ్రామాలనుంచి తమ ఉపాధి కూలి డబ్బులు తీసుకోవడానికి వచ్చిన కూలీలు తమను గత 10 రోజులుగా కూలి డబ్బులు ఇవ్వకుండా తిప్పిస్తున్నారని మంగళవారం రెబ్బెన పోస్ట్ ఆఫీస్ ఎదుట సుమారు 100 మంది ఉపాధి హామీ కూలీలు  ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా.వృద్ధాప్య  ఫింఛనులు, వితంతు ఫింఛనులు కూడా సరిగా అందడం లేదని వృద్దులు, వితంతువులు ఆరోపించారు. ఈ విషయంపై అందుబాటులో ఉన్న సిబ్బందిని వివరణ కోరగా  తమ అధికారి పైసలు తీసుకోని రావడానికి వెళ్లారని చెప్పారు. కానీ లబ్ది దారులు మాత్రం ప్రతి రోజు ఇదేవిధంగా చెప్తున్నారని తమను రోజులపాటు తిప్పుకుంటూ చివరికి పొద్దంతా ఉంచి సాయంత్రం బిబిఎం లు  ఇంటి వద్ద వంద రెండు వందలు తీసుకుంటు కూలి పైసలు,పింఛన్లు  చెల్లిస్తున్నట్లు ఆరోపించారు.

సబ్సిడీపై గొర్రెల దాణా పంపిణి




కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 19 రెబ్బెన ; రెబ్బెన  మండల కేంద్రంలో మంగళవారం సబ్సిడీపై గొర్రెలకు దాణా   పంపిణి ప్రారంభించినట్లు మండల పసు వైద్యాధికారి డాక్టర్ సాగర్ తెలిపారు. పంపిణి చేసిన దాణా  ను గొర్రెల పెంపకందారులు సద్వినియోగ పర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అజమీర బాబు రావు, రెబెన సర్పంచ్ పెసర వంకటమ్మ , ఉప సర్పంచ్ బొమ్మినేని  శ్రీధర్, ఏ  ఎం సి  వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ,గొర్రెల పెంపకం దారులు తదితరులు పాల్గొన్నారు. 

సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడమే కెసిఆర్ సేవాదళ్ లక్ష్యం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 19 రెబ్బెన ; సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడమే కెసిఆర్ సేవాదళ్ లక్ష్యం అని కెసిఆర్ సేవాదళ్ అధ్యక్షులు మహమ్మద్ షోయాన్ అన్నారు. ఏప్రిల్ 15 న హైదరాబాద్ లో సైకిల్ యాత్ర ప్రారంభించి 11 రాష్ట్రాలలో సుమారు 5500 కిలోమీటర్లు ప్రయాణించి మంగళవారం రెబ్బెన చేరుకున్నరు. ఈ  సందర్భంగా  స్థానిక ఆతిధీ గృహ ఆవరణలో విలేఖరులతో మాట్లాడుతూ కెసిఆర్ ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల అమలు, వాటిని ప్రజలలోకి తీసుకువెళ్లే క్రమంలో తెరాస నాయకుల కృష్ణి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడమే సేవాదళ్ ముఖోయద్దేశమని అన్నారు. రాబోయే కాలంలో  కెసిఆర్ దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించనున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాఅధ్యక్షులు ఉబేద్ బిన్ యాహియా, జిల్లా ఉపాధ్యక్షులు కొట్నాక  కిషన్ రావు, నియోజకవర్గ అధ్యక్షులు భూక్యారాజు, రెబ్బెన స్థానిక నాయకులూ  జడ్పీటీసీ బాబు రావు,రెబ్బెన ఉపసర్పంచ్ బొమ్మినేని  శ్రీధర్  తదితరులు పాల్గొన్నారు. 

Monday, 18 June 2018

టాస్క్ ఫోర్స్ టీం తనిఖీలలో బెల్ట్ షాపుకి తరలించటానికి సిద్దంగా ఉన్న మద్యం పట్టివేత

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 18 ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  *శ్రీ దుర్గ వైన్స్* నుండి బెల్ట్ షాపులకు మద్యం అక్రమ రవాణా అవుతుందనే ఖచ్చితమైన నిఘా సమాచారంతో టాస్క్ ఫోర్స్  *సి.ఐ. అల్లం రాంబాబు* నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్,వెంకటేష్ లు సోమవారం  తనిఖీలు నిర్వహించరు.  ఆసిఫాబాద్ లోని గుండి రోడ్డులో గల *శ్రీ దుర్గ వైన్స్* నుండి చిలాటిగూడ కి చెందిన *బోయిరే తిరుపతి* అనే వ్యక్తి సుమారు 16,200/- విలువగల మద్యం తీసుకొని చిలాటిగూడలోని తన బెల్ట్ షాపుకు తరలించటానికి సిద్దంగా ఉండగా ఖచ్చితమైన నిఘా సమాచారంతో మద్యంతో సహా అతనిని అదుపులోకి తీసుకుని  తదుపరి విచారణ నిమిత్తం ఆసిఫాబాద్ పొలీస్ వారికి  అప్పగించడం జరిగిందని తెలిపారు.

తెరాస ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి ఏఐవైఎఫ్ నాయకులకు లేదు

   
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 18 రెబ్బెన ; తెలంగాణ ప్రభుత్వాన్ని మరియు  సిఎం కేసీఆర్ ని  విమర్శించే స్థాయి ఎఐవైఎఫ్ నాయకులకు లేదని  టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మస్క  రమేష్ అన్నారు. సోమవారం గోలేటిలోని  తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు కెసిఆర్ను విమర్శించే స్థాయి ఎఐవైఎఫ్ నాయకులకు లేదని ముఖ్యమంత్రి కెసిఆర్  బంగారంగా తెలంగాణలో భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను,పథకాలు  చేపడుతు అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో ఉండే విధంగా అనేక  కార్యక్రమాలను చేస్తున్నారని అన్నారు.అవే సంక్షేమ పథకాలు కెసిఆర్ ప్రవేశ పెట్టడం జరిగిందని అందులో భాగంగా ఇంటింటికి స్వచ్ఛమైన శుద్ధజలాన్ని అందించాలన్న ఉద్దేశ్యంతో మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు.  ప్రతి ఒక్క రైతు భూమికి  చివరి ఆయకట్టు వరకు నీరు అందించే ఉద్దేశంతో మిషన్ కాకతీయ ద్వారా నీటిని అందించి ప్రతి రైతు పంటను పండించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు నిరుద్యోగులకు టిఎస్ పిఎస్ ద్వారా  యాభై ఆరు వేల పైచిలుకు ఉద్యోగాలు నోటిఫికేషన్ జారీచేయడం  జరిగిందన్నారు అందులో భాగంగా ఇప్పటివరకు సుమారు ముప్పై అయిదు వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందని మిగిలిన ఉద్యోగాలను నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నదని అన్నారు.అందులో భాగంగా ఇప్పటి వరకు కొన్ని ఉద్యోగాలు చిల్లర రాజకీయ నాయకులు కోర్టుకు వెళ్లడం ద్వారా కోర్టులో పెండింగ్లో ఉండటం జరిగిందని ఘాటు గా  విమర్శించారు.ఐనప్పటికీ  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను  దృష్టిలో ఉంచుకుని టీఎస్ ఐపాస్ ద్వారా అనేక పరిశ్రమలను ఏర్పాటు చేసి కొన్ని వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నతరుణంలో ఓర్వలేక ఇలా మాట్లాడుతున్నారని దేశం మొత్తంలో తమ ఉనికిని  కోల్పోతున్నామని భయంతో  స్వార్థ రాజకీయాల కోసం పని కట్టుగొని  తెలంగాణ ప్రభుత్వం మరియు కేసిఆర్ పై  బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.  అంతేకాకుండా మరోసారి కేసీఆర్ ని  విమర్శిస్తే సహించేది లేదని మరోసారి ఈ విదంగా చేస్తే ఊరుకునేది లేదని  ఏఐవైఎఫ్ నాయకులను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నట్లు తెలిపారు.  ఈ సమావేశంలో టీఆర్ఎస్వీ జిల్లా నాయకులు పర్వతి అశోక్, డివిజన్ నాయకులు ఓరుగంటి రంజిత్,  మండల నాయకులు యనమల శ్రీకాంత్, పరి పరికిపండ్ల సతీష్, పూదరి రాజ్కుమార్, నాయకులు ప్రశాంత్, పోతురాజుల వెంకటేష్, రవీందర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వపాఠశాలల్లో సమస్యలను పరిష్కరించాలి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 18 రెబ్బెన ;  ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరీక్షించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆద్వర్యలంలో డివిజన్ ఉపాధ్యక్షుడు పర్వతీ సాయి  సోమవారం మండల విద్యాధికారి కి వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ప్రభుత్వ పాఠశాలలో త్రాగు నీరు సదుపాయం త్రాగు నీటి సదుపాయం,పాఠశాలల్లో మరుగుదొడ్లు, కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో  మరుగుదొడ్లు ఉన్న కూడా వాటిని నిరుపయోగగంగా ఉంచడం వల్ల విద్యార్ధి,విద్యార్థినులు  ఇబ్బందులు పడుతున్నారని ఉన్న మరుగుదొడ్లు అందుబాటులోకి తెచ్చి లేని పాఠశాలల్లో  నిర్మించాలని అన్నారు. పిల్లల మధ్యాహ్న భోజనం నాణ్యతగా అందించాలని దానితోపాటు  ఉపాధ్యాయులు సమయపాలన పాటించే విదంగా చూడాలని అన్నారు. మండలంలోని కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయానికి  రాకపోవడంతో పిల్లలు సరిగ్గా చదవలేక పోతున్నారని ఈ సందర్బంగా తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిశీలించి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత కల్పించాలని కోరారు. ప్రైవేటు పాఠశాలల దోపిడీని అర అరికట్టాలని అలాగే కొన్ని  ప్రైవేటు పాఠశాలల దోపిడీకే పరిమితం అయ్యాయని అన్నారు. దోపిడీలను అరికట్టి  ప్రభుత్వ ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు  అవగాహన కల్పించి  పిల్లలను  ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చే విధంగా చేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో  మండల అధ్యక్షుడు జాడి సాయి, మండల ఉపాధ్యక్షుడు బెజ్జం అనుదీప్, రాజేష్, సాయి, హరీష్, తదితరులు  పాల్గొన్నారు    

పరిసరాలను పరిశుబ్రాంగా ఉంచుకోవాలి ; కె రవి శెంకర్


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 18 రెబ్బెన ; నిత్యం వాడే పరిసరాలను పరిశుబ్రాంగా ఉంచుకోవాలని బెల్లంపల్లి ఏరియా గోలేటి సింగరేణి జెనరల్ మేనేజర్ కె రవి శెంకర్ అన్నారు.సోమవారం గోలేటి టౌన్ షిప్ లో జియం కార్యాలయం నుండి  స్వచ్ఛ పక్వడా కార్యక్రమం లో భాగంగా విదులలలో ప్రజలకు  అవగాహనా కల్పిస్తు ర్యాలీని నిర్వహించారు.అనంతరం వారు పరిసరాలను శుభ్ర పరచి,అందరితో ప్రతిజ్ఞ చేయించారు  సీఎస్పీ వద్ద భారీగా మొక్కలను నాటారు.కార్యక్రమంలో భాగంగా జియం మాట్లాడుతు దేశ ప్రధాని తలపెట్టిన స్వచ్ఛ పక్వడా కార్యక్రమంలో  అందరు భాగస్వాములై పరిసరాల పరిశుభ్రతకు తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటుజియం వీరస్వామి,డిజిఎం పర్సనల్ కిరణ్,డిజిఎం సివిల్ ప్రసాద రావు,ఎస్టేట్ ఆఫీసర్ వరలక్ష్మి,డివైపియంలు సుదర్శన్,రాజేశ్వర్,కార్మిక నాయకులు టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు మల్రాజు శ్రీనివాస్ రావు,సింగరేణి సేవా సంస్థ సభ్యులు సొల్లు లక్ష్మి,కుందారపు శెంకరమ్మ,కుమార స్వామి, తదితరులు పాల్గొన్నారు. 

Sunday, 17 June 2018

నిరుద్యోగ యువతతో చెలగాటం ఆడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 17 రెబ్బెన ; నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు   చెలగాటం ఆడుతున్నాయని ఆత్మకూరి చిరంజీవి అన్నారు.ఆదివారం  కెఎల్ మహేంద్ర భవన్ లో వారు  ఏర్పాటు చేసుకున్న  ఏఐవై ఎఫ్ మండల అత్యవసర సమావేశంలో వారు  మాట్లాడుతు  కేంద్ర రస్తా ప్రభుత్వ సంస్థల్లో లక్షల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ నోటిఫికెషన్ జారీచేయకుండా కేవలం వారి స్వార్ధ రాజకీయాలను కొనసాగిస్తుందని అన్నారు. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ విధానమే ఉండదన్న తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తుందని విమర్శించారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషిన్ భగీరథ,మిషిన్ కాకతీయ పథకాలు కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి అని అన్నారు.యువత చైతన్యమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తిరుగుబాటు బావుట ఎగురవేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఏఐవై ఎఫ్ యువతను చైతన్య పరచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగు బుద్ది చెప్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్,ఏఐవై ఎఫ్ మండల కార్యదర్శి చునార్కర్ మహేందర్,మండల సహాయ కార్యదర్శి రహీం,ఉపాధ్యక్షులు గంధం శ్రీను,ఏఐఎస్ ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయి కిరణ్,గోలేటి ఏఐవై ఎఫ్ కార్యదర్శి దుర్గం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.                            

Saturday, 16 June 2018

యోగా శిక్ష‌కుల‌కు త‌ర‌గ‌తులు

18 వ తేదీ నుండి అన్ని  గ‌నులు, విభాగాల్లో యోగాభ్యాసం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 16 రెబ్బెన అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం నేప‌థ్యంలో బెల్లంప‌ల్లి ఏరియాలోని గోలేటి సింగరేణి వివిధ గ‌నులు, విభాగాల్లో ప‌నిచేస్తున్న అధికారులు, కార్మికులంద‌రికీ  ఈనెల 18వ తేదీ నుంచి యోగా శిక్ష‌ణ‌ను ఇచ్చే యోగా శిక్ష‌కుల‌కు శ‌నివారం గోలేటిలోని ఆఫీస‌ర్స్ క్ల‌బ్ లో శిక్ష‌ణ త‌ర‌గ‌తులు నిర్వ‌హించిన‌ట్లు బెల్లంప‌ల్లి ఏరియా అధికార ప్ర‌తినిధి జె.కిర‌ణ్ తెలిపారు. యోగా మాస్ట‌ర్లు రాజ‌లింగు, ఉమారాణి ఆధ్వ‌ర్యంలో యోగా శిక్ష‌కుల కోసం నిర్దేశిత ఆస‌నాల‌పై పున‌:శ‌్చ‌ర‌ణ త‌ర‌గ‌తులు నిర్వ‌హించార‌న్నారు. గ‌నుల్లో, వివిధ విభాగాల్లో ప‌నిచేస్తున్న కార్మికులంతా  దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకునేలా వారిలో ఆస‌క్తిని పెంచేలా శిక్ష‌ణ త‌ర‌గ‌తులను నిర్వ‌హించాల‌ని సూచించామ‌ని వెల్లడించారు.బెల్లంప‌ల్లి ఏరియాలో 11 కేంద్రాల్లో యోగా శిక్ష‌ణ కోసం శిక్ష‌కుల‌ను నియ‌మించిన‌ట్లు తెలిపారు.యోగా త‌ర‌గ‌తులు నాలుగు రోజుల పాటు  ఉంటాయ‌న్నారు. యోగా దినోత్స‌వ‌మైన జూన్ 21వ తేదీన గోలేటిలోని సింగ‌రేణి పాఠ‌శాల మైదానంలో  సామూహిక యోగాభ్యాసం ఉంటుంద‌ని వివ‌రించారు. యోగా త‌ర‌గ‌తుల‌ను అధికారులు, కార్మికులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఈ సందర్బంగా  సూచించారు  .

సింగరేణి ఏరియాలో ప్రారంభమైన స్వ‌చ్ఛ‌తా ప‌ఖ్వాడా


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 16 రెబ్బెన: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేర‌కు సింగ‌రేణిలో స్వచ్ఛత ప‌క్షోత్స‌వాల శ‌నివారం బెల్లంప‌ల్లి ఏరియా గోలేటి సింగరేణి జెనరల్ మేనేజర్ కె రవి శెంకర్ ప్రారంభించారు. ఏరియాలోని వివిధ గ‌నులు, విభాగాల్లో తొలి రోజున స్వ‌చ్ఛ‌త ప‌క్షోత్స‌వాల సంద‌ర్భంగా కార్మికుల మరియు అధికారులతో ప‌రిశుభ్ర‌త‌పై ప్ర‌తిజ్ఞ చేయ‌డ‌మే కాకుండా అధికారులు, కార్మికులంతా వారి వారి కార్యాలాయాలు, గ‌నుల ఆవ‌ర‌ణ‌లో చెత్త‌ను తొల‌గించారు.బెల్లంప‌ల్లి ఏరియాలోని  బీపీఏ ఓసీపీ-2 ఎక్స్ టెన్ష‌న్ లో ప్రాజెక్టు అధికారి చింత‌ల శ్రీ‌నివాస్ నేతృత్వంలో ఖైర‌గూడ‌లో ప్రాజెక్టు అధికారి మోహ‌న్‌రెడ్డి, మేనేజ‌ర్ శ్రీ‌ర‌మేశ్,  డోర్లీ ఓసీపీలో మేనేజ‌ర్ ఉమాకాంత్ నేతృత్వంలో,  ఎక్స్ ప్లోరేష‌న్ విభాగంలో అద‌న‌పు జీఎం సీతారామ‌రావు నాయ‌క‌త్వంలో, ఏరియా ఆసుప‌త్రిలో డీవైసీఎంవో అశోక్‌కుమార్ ఆధ్వ‌ర్యంలో, ఏరియా వ‌ర్కుషాప్‌లో ఇంజినీర్ ర‌ఘురాం,ఆధ్వ‌ర్యంలో స్వ‌చ్ఛతా ప‌క్షోత్స‌వాలు ఉత్సాహంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రూ ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త కోసం న‌డుం బిగించాల‌ని, గాంధీజీ క‌ల‌లు క‌న్న ప‌రిశుభ్ర భార‌తావ‌ని కోసం అంద‌రం పున‌రంకిత‌మై ప‌నిచేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. 15 రోజుల పాటు స్వ‌చ్ఛ‌తా ప‌క్షోత్స‌వాలు కొన‌సాగుతాయ‌ని వారు పేర్కొన్నారు. బొగ్గు ఉత్ప‌త్తిలో అగ్ర‌స్థానంలో ఉన్న సింగ‌రేణీ సంస్థ‌ను స్వ‌చ్ఛ‌త సూచీలోనూ జాతీయ స్థాయిలో మొద‌టి స్థానంలో నిల‌పాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.ఈ కార్య‌క్ర‌మాల్లో ఆయా గ‌నుల్లోని గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ పిట్ కార్య‌ద‌ర్శులు కూడా పాలుపంచుకున్నారు.

సంప్రదాయబద్ధంగా ఈద్ ఉల్ ఫితర్



కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ; జూన్ 16 రెబ్బెన: పవిత్ర రంజాన్ పండగ సందర్భంగా రెబ్బెన మండల కేంద్రం లో పండుగ వాతవరణం కనిపించింది.ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పవిత్ర ఈద్గా వద్దకు చేరుకొని విశ్వ మానవాళి క్షేమాన్ని కోరుతు  ప్రార్ధనలు ప్రత్యేక ప్రార్థనలు చేసారు. పవిత్ర రంజాన్‌  పర్వదినాన్ని పురస్కరించుకొని చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల రంజాన్ దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ' దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ ఏ సందర్బంగా ప్రార్ధనలకై తరలి వచ్చే ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈద్గా  వద్ద ప్రత్యేక  ఏర్పాట్లు చేసారు.ప్రార్థనల అనంతరం బంధువులను,స్నేహితులను మతాలకతీతంగా ముస్లిం సోదరులు ఆలింగనము చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు.ఈసందర్బంగా రెబ్బన ముస్లీం సోదరులకు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఈద్గా వద్దకు వెళ్లి రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా  రెబ్బెన ఎస్సైశివకుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తును ఏర్పాటు చేసి  పర్యవేక్షించారు.   

Friday, 15 June 2018

పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు తెరాస నాయకుడు నవీన్ జైశ్వాల్ ఇఫ్తార్ విందు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 15
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉపవాసం చేస్తున్న  ముస్లిం సోదరులకు శుక్రవారం రెబ్బెన మండలంలోని మసీదులొ  తెరాస నాయకుడు నవీన్ జైశ్వాల్ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. వారితో పాటు కలిసి భోజనం చేసి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. కులమతాలకు అతీతంగా అందరం కలిసి మెలిసి ఉంటే సంతోషంగా ఉండొచ్చని అన్నారు.అందులో భాగంగానే పవిత్ర మాసంలో     ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే పేద ముస్లిం పిల్లలకు స్వంత ఖర్చులతో రంజాన్ పండుగకు దుస్తులు అందజేశారు 

కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ దశలవారీగా పోరాటాలు ; వాసిరెడ్డి సీతారామయ్య

  • కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి 
  • కార్మిక సమస్యల అమలు చేయటంలో ప్రభుత్వం విఫలం


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 15  ; రెబ్బెన:  ఎన్నికల వాగ్దానాలు కార్మికులకు అమలు చేయటంలో ప్రభుత్వం విఫలం అయ్యాదని పెండింగ్లో ఉన్న కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దశలవారీ పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు.  రెబ్బెన మండలం లోని గోలేటి కేఎల్ మహేంద్ర భవనంలో శుక్రవారం ఏర్పాటు  చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కార్మిక సంఘాలను అవమాన పరిచిందన్నారు. పదో వేజ్బోర్డు ఏరియల్ చెల్లించే విషయంలో యాజమాన్యం కార్మిక సంఘాలతో చర్చించి చర్చించకుండా నిర్ణయాలు తీసుకున్నారన్నారు. కారుణ్య నియామకాల పేరిట అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తామన్న ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పించడంలో విఫలమైందన్నారు. మెడికల్ ఇన్వాలిడేషన్ విధానంతో పైరవీ కారి విధానాన్ని ప్రోత్సహించేలా కొంతమంది నాయకులు మెదులుతున్నారు. గతంలో కోల్ ఇండియాతో సంబంధం లేకుండా సింగరేణి 100 పర్సంట్ ఏరియర్స్ ఇప్పించామన్నారు. కార్మిక కష్ట ఫలితంగానే గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి  12 వేల కోట్ల  రూపాయలు లాభాలు గడించాయని అన్నారు. కార్మికుల ముప్పైశాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుడి సొంతింటి నిర్మాణానికి రూపాయలు పది లక్షల వడ్డీలేని రుణ బ్యాంకుల ద్వారా సింగరేణి యాజమాన్యమే ఇప్పించేందుకు కృషి చేయాలన్నారు. బదిలీల రికవరి మెంట్లలో కౌన్సిలింగ్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. కార్మిక సమస్యలను అధికారుల  దృష్టికి తీసుకెళ్లి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఔట్ సోర్సింగ్ కార్మికులకు  హైపవర్ కమిటీ వేతనాలు, సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18 న సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు డిపార్ట్మెంట్లో ధర్నాలు నిర్వహించి గనుల్లో ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే ఇరవై ఐదో తేదీన చలో కొత్తగూడెం పేరుతో కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టనట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో బ్రాంచ్ ఇంచార్జ్ ఈ నర్సయ్య,  బ్రాంచి  కార్యదర్శి ఎస్ తిరుపతి ఉపాధ్యక్షుడు బయ్య మొగిలి ఆర్గనైజింగ్ కార్యదర్శులు చంద్రశేఖర్, జగ్గయ్య, సారన్నా, సత్యనారాయణ, శ్రీనివాస్, ఫిట్ కార్యదర్శులు జూపాక రాజేష్, నరసింహరావు, ఓదేలు, ప్రభాకర్, కందుల మల్లేష్ తదితరులు ఉన్నారు.

గోలేటి సర్పంచ్ తెరాస నుంచి సస్పెండ్


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 15  ; రెబ్బెన మండలం లోని  గోలేటి గ్రామ  సర్పంచ్ తోట లక్ష్మణ్ ను తెరాస పార్టీ  నుంచి తొలగించినట్లు తెరాస పార్టీ  మండల అధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి  తెలిపారు. శుక్రవారం గోలేటిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.  గత కొద్దీ కాలంగా సదరు సర్పంచ్ పార్టీ వ్యతిరేక పనులకు పాల్పడుతుండటంతోఉమ్మడి  ఆదిలాబాద్ జిల్లా  ఎం ఎల్ సీ  పురాణం సతీష్, ఆసిఫాబాద్ ఎం ఎల్ ఏ  కోవలక్ష్మి ల ఆదేశాలతో పార్టీ  నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇక నుంచి ఆయనకు పార్టీ కి ఎలాంటి సంభందం ఉండదని అన్నారు.   ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అజమీర బాపు రావు, ఎంపీపీ కర్నాధం సంజీవ్ కుమార్, టిబిజికె ఎస్  గోలేటి  బ్రాంచ్   ఉప అధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు. 

Thursday, 14 June 2018

పోలీసు ఉద్యోగాలను సాధించేందుకు జిల్లా పోలీసులు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణను అనూహ్య స్పందన.

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 14  ;  ప్రభుత్వం ప్రకటించిన పోలీసు కొలువును సాధించేందుకు కొమురంభీం జిల్లా పోలీసులు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణకు అర్హులైన జిల్లా అభ్యర్థులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ కల్మేశ్వర్ సింగనవార్ కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రేమళ గార్డెన్లో  నిర్వహించిన ప్రీ సెలక్షన్ టెస్ట్ ను జిల్లా ఎస్పీ పర్యవేక్షించారు.ఈ సందర్బంగా  హాజరైన అభ్యర్థుల యొక్క ధ్రువపత్రాలను పరిశీలించి  ఎత్తును నమోదు చేశారు.  ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎన్నో వ్యయ ప్రాసలతో  కూడుకున్నదని అందుకొరకే జిల్లాలో ఉన్న అభ్యర్థుల కొరకు ఉచిత శిక్షణను ప్రారంభించడం జరిగిందన్నారు.  అంతేకాక ఉచిత శిక్షణకు జిల్లాలోని అభ్యర్థుల నుండి అనూహ్య  స్పందన లభించిందని అన్నారు గురువారం మండలాల వారీగా ప్రారంభించిన ప్రీ సెలక్షన్ టెస్టులకు రెబ్బెన మండలం నుండి 39 మంది మహిళా అభ్యర్థులు,153 మంది పురుష అభ్యర్థులు,ఆసిఫాబాద్ నుండి 22 మంది మహిళా అభ్యర్థులు 114 మంది పురుష అభ్యర్థులు, వాంకిడి మండలం నుండి 17 మంది మహిళా అభ్యర్థులు 75 మంది  పురుష అభ్యర్థులు తిర్యాని మండలం నుంచి 24 మంది మహిళా అభ్యర్థులు ,69  మంది పురుష అభ్యర్థులు పాల్గొన్నారని  అన్నారు.  సమయానుసారం  ప్రకారం పాల్గొనలేకపోయిన అభ్యర్థులు 18-06-2018 సోమవారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు జిల్లా పోలీసు హెడ్ క్వాటర్స్ నందు  హాజరు కావచ్చునని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలిపారు.  శిక్షణకు ఎంపిక కాబడిన అభ్యర్థులకు ఉచితంగా భోజన వసతి సదుపాయాలను జిల్లాలోని కాగజ్నగర్ ఆసిపాబాద్ మరియు జైనూర్ లలో  ఏర్పాటు చేయడంజరుగుతున్నదని వీటితో  పాటుగా ఫిజికల్ ఇవెంట్స్ కొరకు ఒక జత షూ  మరియు రెండు జతల  స్పోర్ట్స్ దుస్తులను అందించడం జరుగుతుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు శ్రీనివాస్, బాలాజీ వరప్రసాద్, ఆర్ఐలు సంతోష్,శేఖర్ బాబు, చంద్రశేఖర్, వాంకిడి ఎస్ఐ ముస్క రాజు, డిపిఓ సుపరిడెంట్  సతీష్, సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్, పిడిలు ఊషన్న, హేమంత్, శెంకర్ తదితరు పాల్గొన్నారు.

పోలీస్ కొలువు కోసం ఉచిత శిక్షణలో పాల్గొన్న అభ్యర్థులు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 14  ; రెబ్బెన:  ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ ఉద్యోగాలను సాదించేందుకు  కొమరం భీం జిల్లా పోలీసుల అధ్వర్యములో  ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణకు  రెబ్బెన మరియు తిర్యాణి మండలాల నుండి  అనూహ్యంగా 285 మంది  అభ్యర్థులు తమ  ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో  ఉదయము 5 గ: గంటలకు రెబ్బెనా ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్ వద్దకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ మరియు  ఫీజికల్ మేజర్ మెంట్స్  కై   హాజరు అయినట్లు  ఏఎస్పి గొద్రు,డిఎస్పి  సత్యనారాయణ తెలిపారు.అంతరం వారు మాట్లాడుతు పోలీస్ శిక్షణ కై హాజరైన అభ్యర్థుల యొక్క ధ్రువ పత్రాలు పరిశీలించి వారి యొక్క ఎత్తును నమోదు చేశామన్నారు.ఈ యొక్క ప్రీ సెలక్షన్ టెస్టులకు రెబ్బెన మండలం నుండి 39 మంది మహిళా అభ్యర్థులు,153 మంది పురుషులు మరియు తిర్యాణి మండల కేంద్రం నుండి 24 మంది మహిళలు,69 మంది పురుషులు పాల్గొన్నట్లు తెలిపారు ఈ ఫ్రీ సెలెక్స్టీన్ సందర్బంగా రెబ్బెన సీఐ పురుషోత్తమ చారి, రెబ్బెన ఎస్ఐ శివకుమార్ పాల్గొన్నారు
జిల్లా లో ౩౦ పోలీస్ ఆక్ట్ అమలు

కుమ్రం భీమ్ జిల్లా లో  శాంతి భద్రతల దృష్ట్యా  మరియు జిల్లా లో ప్రశాంతత ను పెంపొందించేందుకు జిల్లా అంతటా ఈ నెల  11-06-2018 నుంచి వచ్చే నెల 10-07-2018  వరకు జిల్లా అంతటా  ౩౦ పోలీస్ ఆక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగెనవార్ ఒక ప్రకటన లో తెలిపారు. ఈ  ౩౦ పోలీస్ ఆక్ట్ 1861 అమలులో ఉన్నందున జిల్లా లో   సబ్  డివిజనల్ పోలీస్  అధికారి  లేదా పోలీస్  ఉన్నత అధికారుల నుంచి అనుమతి లేకుండా  ఎటువంటి  పబ్లిక్ మీటింగ్ లు , ఊరేగింపులు, ధర్నాలు జరుపరాదు.

1)        నిషేదిత ఆయుధములు  అయిన కత్తులు ,చాకులు , కర్రలు , జెండా కర్రలు, దుడ్డుకర్రలు, తుపాకులు , ప్రేలుడు పదార్థములు , మరియు నేరమునకు పురిగోల్పే ఎటువంటి ఆయుదములను వాడరాదు.

2)       ప్రజలకు  ఇబ్బంది , చిరాకు కలిగించేందుకు దారితీసే పబ్లిక్ మీటింగ్ లను మరియు జనసమూహం ప్రోగు అవుట వంటివి నిషేధం .

3)       రాళ్ళను  జమ చేయుట  మరియు దరించి సంచరించుట వంటివి నిషేధం.

4)       లౌడ్ స్పీకర్ లు , DJ లు వంటివి కూడా ఈ సమయం లో  నిషేధము  మరియు  పబ్లిక్ అడ్రసింగ్ కోసం వాడు ప్రచార రథములు  మైకులు మరియు దాని యొక్క  అనుబంధ పరికరములు అన్ని కూడా నిషేధించబడినవి.



ఇందుమూలంగా జిల్లా ప్రజలకు తెలియపరిచడం ఏమనగా పైన తెలిపిన నియమాలు ఎవరైనా ఉల్లంగించిన ౩౦ పోలీస్ ఆక్ట్ 1861  కింద  శిక్షార్హులు అగుదురు.



పైన తెలిపిన నియమ నిబంధనలు ఈ క్రింది వారికి మినహాయింపు వర్తించును

1)        విధి నిర్వహణలో  పోలీస్ లకు

2)       మిలిటరీ అధికారులకు

3)       విధి నిర్వహణ లో వున్న హెం గార్డ్స్ కు

4)       అంత్య క్రియ ఊరేగింపులకు



 ౩౦ పోలీస్ ఆక్ట్ 1861 అమలులో  ఉన్నందున జిల్లా ప్రజలందరు  ప్రశాంతత ను పెంచేందుకు పోలీస్ అధికారులకు సహకరించగలరని జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగెనవార్ కోరారు.



          పోలీస్ కొలువు కోసం  ఉచిత శిక్షణలో పాల్గొన్న అభ్యర్థులు 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 14  ; రెబ్బెన:  ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ ఉద్యోగాలను సాదించేందుకు  కొమరం భీం జిల్లా పోలీసుల అధ్వర్యములో  ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణకు  రెబ్బెన మరియు తిర్యాణి మండలాల నుండి  అనూహ్యంగా 285 మంది  అభ్యర్థులు తమ  ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో  ఉదయము 5 గ: గంటలకు రెబ్బెనా ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్ వద్దకు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ మరియు  ఫీజికల్ మేజర్ మెంట్స్  కై   హాజరు అయినట్లు  ఏఎస్పి గొద్రు,డిఎస్పి  సత్యనారాయణ తెలిపారు.అంతరం వారు మాట్లాడుతు పోలీస్ శిక్షణ కై హాజరైన అభ్యర్థుల యొక్క ధ్రువ పత్రాలు పరిశీలించి వారి యొక్క ఎత్తును నమోదు చేశామన్నారు.ఈ యొక్క ప్రీ సెలక్షన్ టెస్టులకు రెబ్బెన మండలం నుండి 39 మంది మహిళా అభ్యర్థులు,153 మంది పురుషులు మరియు తిర్యాణి మండల కేంద్రం నుండి 24 మంది మహిళలు,69 మంది పురుషులు పాల్గొన్నట్లు తెలిపారు ఈ ఫ్రీ సెలెక్స్టీన్ సందర్బంగా రెబ్బెన సీఐ పురుషోత్తమ చారి, రెబ్బెన ఎస్ఐ శివకుమార్ పాల్గొన్నారు





పోలీసు ఉద్యోగాలను సాధించేందుకు జిల్లా పోలీసులు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణను అనూహ్య స్పందన.    


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  జూన్ 14  ;  ప్రభుత్వం ప్రకటించిన పోలీసు కొలువును సాధించేందుకు కొమురంభీం జిల్లా పోలీసులు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణకు అర్హులైన జిల్లా అభ్యర్థులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ కల్మేశ్వర్ సింగనవార్ కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రేమళ గార్డెన్లో  నిర్వహించిన ప్రీ సెలక్షన్ టెస్ట్ ను జిల్లా ఎస్పీ పర్యవేక్షించారు.ఈ సందర్బంగా  హాజరైన అభ్యర్థుల యొక్క ధ్రువపత్రాలను పరిశీలించి  ఎత్తును నమోదు చేశారు.  ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎన్నో వ్యయ ప్రాసలతో  కూడుకున్నదని అందుకొరకే జిల్లాలో ఉన్న అభ్యర్థుల కొరకు ఉచిత శిక్షణను ప్రారంభించడం జరిగిందన్నారు.  అంతేకాక ఉచిత శిక్షణకు జిల్లాలోని అభ్యర్థుల నుండి అనూహ్య  స్పందన లభించిందని అన్నారు గురువారం మండలాల వారీగా ప్రారంభించిన ప్రీ సెలక్షన్ టెస్టులకు రెబ్బెన మండలం నుండి 39 మంది మహిళా అభ్యర్థులు,153 మంది పురుష అభ్యర్థులు,ఆసిఫాబాద్ నుండి 22 మంది మహిళా అభ్యర్థులు 114 మంది పురుష అభ్యర్థులు, వాంకిడి మండలం నుండి 17 మంది మహిళా అభ్యర్థులు 75 మంది  పురుష అభ్యర్థులు తిర్యాని మండలం నుంచి 24 మంది మహిళా అభ్యర్థులు ,69  మంది పురుష అభ్యర్థులు పాల్గొన్నారని  అన్నారు.  సమయానుసారం  ప్రకారం పాల్గొనలేకపోయిన అభ్యర్థులు 18-06-2018 సోమవారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు జిల్లా పోలీసు హెడ్ క్వాటర్స్ నందు  హాజరు కావచ్చునని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలిపారు.  శిక్షణకు ఎంపిక కాబడిన అభ్యర్థులకు ఉచితంగా భోజన వసతి సదుపాయాలను జిల్లాలోని కాగజ్నగర్ ఆసిపాబాద్ మరియు జైనూర్ లలో  ఏర్పాటు చేయడంజరుగుతున్నదని వీటితో  పాటుగా ఫిజికల్ ఇవెంట్స్ కొరకు ఒక జత షూ  మరియు రెండు జతల  స్పోర్ట్స్ దుస్తులను అందించడం జరుగుతుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు శ్రీనివాస్, బాలాజీ వరప్రసాద్, ఆర్ఐలు సంతోష్,శేఖర్ బాబు, చంద్రశేఖర్, వాంకిడి ఎస్ఐ ముస్క రాజు, డిపిఓ సుపరిడెంట్  సతీష్, సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్, పిడిలు ఊషన్న, హేమంత్, శెంకర్ తదితరు పాల్గొన్నారు.