Tuesday, 28 February 2017

కొమురంభీం జిల్లా అధికార ప్రతినిధిగా సంజీవకుమార్


కొమురంభీం జిల్లా అధికార ప్రతినిధిగా సంజీవకుమార్ 


కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 28 ; ప్రభుత్వ ఆమోదిత ప్రయివేటు పాఠశాలల సంఘం కూమురంభీం జిల్లా అధికార ప్రతినిధిగా రెబ్బెనలోని ఎస్ వి ఇంగ్లీష్ మీడియంపాఠశాల నుండి ఢీకొండ సంజీవకుమార్ ను  ఎన్ను కోవడం  జగిందని రాష్ట్ర ట్రస్మా ప్రధాన కార్యదర్శి వై శేఖర్ రావు , ట్రెజరర్ భూపాల్ రావు, వర్కింగ్ ప్రసిడెంట్ శేఖర్ రెడ్డి లు తెలిపారు. ఆసిఫాబాద్ లోని రోజా గార్డెన్ లో జరిగిన ప్రభుత్వ  ప్రైవేటు పాఠశాల సంఘం (ట్రస్మా) జెనరల్ బాడీ సమావేశములో జిల్లా నూతన కార్య వర్గాన్ని ఎన్ను కున్నట్లు వారు పేర్కొన్నారు . జిల్లా కార్యవర్గము ఏర్పాటు కోసం ఎంతో కృషి చేసిన ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి వొడ్నాల శ్రీనివాస్ కి సహకరించినందులకు పదవి బాధ్యతలు అప్పజెప్పినట్లు పేర్కొన్నారు . జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నికైన సంజీవ్ కుమార్ ను జిల్లా అధ్యక్షుడు ప్ కిషన్ రావు , ప్రధాన కార్యదర్శి ప్ దేవా భూషణం, గౌరవ అధ్యక్షుడు లక్ష్మణ చర్య , ట్రెజరర్ సుజయట్ ఆలీ ితో జిల్లా ఉపాధ్యక్షులు , సహాయ కార్యదర్శులు అభినందించారు .

వాడి వేడిగా రెబ్బెన మండల సర్వసభ్య సమావేశం

వాడి వేడిగా రెబ్బెన మండల సర్వసభ్య సమావేశం 


కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 28 ;   రెబ్బన మండల సర్వసభ్యసమావేశం మంగళవారంనాడు ఎంపిపి కార్నాథం సంజీవకుమార్ అధ్యక్షతన  జరిగింది. ఈ సమావేశం లో పలువురు ప్రజాప్రతినిధులు సమస్యల ఫై అధికారులను ప్రశ్నించారు.ఎంపీడీఓ సత్యనారాయణసింగ్  మాట్లాడుతూ గ్రామా కార్యదర్శులు ఎవరు కూడా సహకరించడం లేదని,గ్రామా స్థాయి అధికారులు సరిగ్గా పని చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు.సక్రమంగా విధులు నిర్వహించకుంటే గ్రామా కార్యదర్శులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పలువురు  సర్పంచులు,ఎంపీటీసీ సభ్యులు మాట్లాడుతూ గ్రామా కార్యదర్శులు ఎంపీడీఓ మాటనే వినడం లేదంటే ఇంకా వారు ప్రజలకు ఏ విధంగా పనులు చేస్తారని ప్రశ్నించారు.సమయానికి నిధులు రాక గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు.మండలంలో కొంతమంది ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని వారి ఫై చర్యలు తీసుకోవాలని,ఉపాధ్యాయులు సమయపాలన పాటించే విదంగా చర్యలు చేపట్టాలని కోరారు.అధికారులు ఎవరు అందుబాటు లో ఉండడం లేదని, అందరూ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండాలని అన్నారు.తహసీల్ధార్ బండారి రమేష్ గౌడ్ మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణా ను అరికట్టాలని అన్నారు. ఏవో మంజుల మాట్లాడుతూ సబ్సిడీ పథకాలకు దరఖాస్తూలు వచ్చే వాటిని పరిశీలిస్తున్నామని అన్నారు.ఎపిఓ కల్పన మాట్లాడుతూ 300000  టేకు మొక్కలు నాటేందుకు గాను సిదంగా ఉన్నాయని అన్నారు. 50 శాతం సబ్సిడీపై గడ్డి విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని పశు వైద్యాధికారి సాగర్ తెలిపారు. ఈ సమావేశం లో ఈఓ.పిఆర్డి.కిరణ్,ఏపీఎం లు వెంకటరమణ,రాజ్ కుమార్,ఆర్ డబ్ల్యు ఎస్ జెఇ , పిఆర్.జెఇ.మండల అధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మేరు కులస్థుల సమస్యలు పరిష్కరించాలని తహసీల్ధార్ కు వినతి

మేరు కులస్థుల సమస్యలు పరిష్కరించాలని తహసీల్ధార్ కు వినతి 

కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 28 ;  మేరు కులస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారంనాడు  రెబ్బన  తహసిల్ధార్   బండారి రమేష్ గౌడ్ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సంధర్బంగా  మేర సంఘం మండల అధ్యక్షులు  బొమ్మోనేని శ్రీధర్ కుమార్,ప్రధాన కార్యదర్శి రాయిల్లా నర్సయ్యలు  మాట్లాడుతూ రెబ్బన మండలంలో సుమారు 60 కుటుంబాలు ఉన్నాయని,వారికీ జీవనం కష్టతరంగ మారిందని రెక్క అడితేనే డొక్కా ఆడే పరిస్థితి ఉందని,ప్రభుత్వం తరుపు నుంచి మేర కుల ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలని,అలాగే 50 సంవత్సరాలు దాటినా ప్రతి ఒక్కరికి పింఛన్ ఇవ్వాలని అన్నారు.కుల వృత్తి చేసుకొని జీవనం గడిపేవారికి ఉచితంగా కుట్టుమిషిన్ లు పంపిణి చెయ్యాలని డిమాండ్ చేశారు.ప్రతి కుటుంబానికి 10 లక్షల వడ్డీ లేని రుణాలను ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో నరేష్,కీర్తిమోహన్.బొమ్మినేని గిరిబాబు.రామకృష్ణ,రాపర్తి అశోక్,తదితరులు పాల్గొన్నారు.

Monday, 27 February 2017

సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు ఎంతో అవసరం

సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు ఎంతో అవసరం 
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 27 ;  సాంకేతిక పరిజ్ఞానం ఈ ఆధునిక యుగంలో విద్యార్థులకు ఏంతో  అవసరం అని తహసిల్ధార్ రమేష్ గౌడ్ అన్నారు.సోమావారంనాడు రెబ్బెన జడ్పీ స్కూల్ విద్యార్థులు ఏర్పాటు చేసిన  సైన్స్ ఫెర్ ను ఆయన సందర్శించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే మంచి లక్షణాలు  ఏర్పడే విధంగా ,ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు.విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆయన  అన్నారు.ఈ సైన్స్ ఫేర్ లో ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత,ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి
                ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కే.వెంకటేశ్వర్  



కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 27 ;  రెబ్బెన మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారంనాడు  వీడ్కోలు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్తులు శ్రద్ధతో చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించి,ఉన్నత శికరాలకు ఎదగాలని అన్నారు.విద్యార్థులు అధ్యాపకుల  సూచనలు,వారి సలహాలను విద్యార్థులు  తూచా  తప్పకుండ పాటించాలని అన్నారు.ప్రభుత్వ జూనియర్ కళాశాల 2001వ సంవత్సరంలో ప్రారంభమైందని అప్పుడు అరకొరగా వస్తహుల మధ్య కాలేజీ నడిచిందని,25మంది విద్యార్థులతో మొదలు అయినా సరైన ఫలితాలు లేనప్పటికీ,అధ్యాపక బృందం కృషి వల్ల ఫలితాలు మెరుగు పడ్డాయని అభిప్రాయపడ్డారు.ఈ విద్య సంవత్సరంలో 770 మంది విద్యార్థులు ఉండగా 670మంది పరీక్షా ఫీజును చెల్లించారని ఏది కొమురంభీం జిల్లాలోనే  పెద్ద సంఖ్య అని అన్నారు.వచ్చే విధ్య సంవత్సరం కల్లా కళాశాలను పక్క భవనంలోకి తరలించి మరింత  నాణ్యమైన విద్యను అందజేస్తామని పేర్కొన్నారు.అదే విధంగా రెబ్బెన తహశీల్ధార్ రమేష్ గౌడ్ విద్యార్థులను ఆదేశించి ప్రసంగించారు.కొందరు సీనియర్ మరియు జూనియర్ విద్యార్థులకు కూడా మాట్లాడారు.ఈ సందర్బంగా విద్యార్థిని, విద్యార్థులు  సాంస్కృతిక నృత్యాలతో అలరింపజెసారు.జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులకు  వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమంలో సిర్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ సుమన్,రెబ్బెన జడ్పీ స్కూల్ ప్రాధానోపాధ్యాయురాలు స్వర్ణలత,కళాశాల అధ్యాపక బృందం ప్రకాష్, శ్రీనివాస్,రామారావు,అమరేందర్,గంగాధర్,ప్రవీణ్,శాంతకూమారి,అతీయ ఖానామ్,మల్లేశ్వరి,మంజుల,సుమలత,నిర్మల,సంధ్య,వరలక్ష్మి,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కంపుకొడుతున్నా సింగరేణి కార్మికవాడలు

కంపుకొడుతున్నా సింగరేణి  కార్మికవాడలు
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 27 ;  గోలేటి సింగరేణి కార్మికుల కాలనీలు దుర్ఘంధం వెదజల్లుతుండంతో కార్మికులు,వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.సింగరేణి కాలనీలోని క్వార్టర్స్ కు ఆనుకోని సెప్టిక్ కుండీలు ఉండడం వలన,వందకు పైగా సెప్టిక్ కుండీలకు పై కప్పు లేనందున తీవ్ర దుర్గంధం వెదజల్లుతుండడంతో అనారోగ్యాలకు గురి అయ్యే ప్రమాదం ఉందని కార్మికులు వాపోతున్నారు.కొన్ని కుండీలు శిథిలావస్తుకు చేరి కూలి పొయ్యాయని,సెప్టిక్ కుండీలా పైపులు లీకేజీ ఏర్పడ్డాయని కార్మికులు.ఏరియా జనరల్  మేనేజర్ రవి శంకర్ స్వచ్ఛ గోలేటి,స్వచ్ఛ గనులు వంటి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ,కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం,పట్టింపులేని తనంతో సమస్య జటిలం అవుతుంది.సెప్టిక్ కుండీల మరమత్తులు చేపట్టి పై కప్పులు ఏర్పాటు చేయాలనీ కార్మికులు కోరుతున్నారు.      

Sunday, 26 February 2017

కాంట్రాక్టు కార్మికులా సమస్యలు పరిష్కారించక పోతే సమ్మెకు సిద్ధం ; ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్

కాంట్రాక్టు కార్మికులా సమస్యలు పరిష్కారించక పోతే సమ్మెకు సిద్ధం 
                                                     ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్

కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 26 ; సింగరేణి మరియు ఓపెన్ కాస్ట్ ఓబీ లలో  ఒప్పంద పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఒప్పంద కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని,లేక పోతే మార్చి రెండువ తేదీ తర్వాత సమ్మెకు సిద్ధం అవుతామని  ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. ఆదివారం నాడు ఒప్పంద కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ మండలంలోని చిర్రకుంట గ్రామంలో నిర్వహించిన ఓబీ కాంట్రాక్టు వర్కర్స్ మరియు సింగరేణి ఒప్పంద కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.సింగరేణి లో అస్సలు ఒప్పంద కార్మికులే లేరని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ అనడం చాల బాధాకరం అని ఆయన  అన్నారు.అదే విధంగా హైపవర్ కమిట వేతనాలు అమలు చేయాలనీ,బోనస్ చట్టం ప్రకారమా ఒప్పంద కార్మికులకు 8.33శాతం బోనస్ చెల్లించాలని,కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ కార్మికుల వెంటనే క్రమబద్దీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.ఓపెన్ కాస్ట్ లలో స్థానిక నిరుద్యోగ యువతకు  అధిక ప్రాధాన్యం ఇవ్వాలని,ఒప్పంద కార్మికులకు సింగరేణి యూనియన్ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాలని కోరారు.ఈ సమావేశం లో జేఏసీ  నాయకులూ అల్లూరి లోకేష్,శ్రీనివాస్,అషాక్,తిరుపతి,నాగయ్య,ఏషయ్య,శేఖర్,ఒప్పంద కార్మికులు,తదితరులు పాల్గొన్నారు. 

మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతాలలో పోలిసులు అప్రమత్తంగా ఉండాలి ; కుమురంబీమ్ ఎస్పీ సన్ ప్రీత్ సింగ్


  • మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతాలలో  పోలిసులు అప్రమత్తంగా ఉండాలి ;                                                    కుమురంబీమ్ ఎస్పీ సన్ ప్రీత్ సింగ్


కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 26 ; మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతాలలో పోలిసులు అప్రమత్తంగా ఉండాలని కుమురంభీమ్ జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్  అన్నారు.ఆదివారం జిల్లాలోని మండలాల సబ్ ఇన్స్పెక్టర్ లతో  టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించి  జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  చూడాలని ఆదేశించారు. సోమవారంనాడు తెలంగాణ బందుకు మావోయిస్టులు  పిలుపునిచ్చిన సందర్బంగా జిల్లాలోని పోలిసులు అప్రమత్తంగా ఉండాలని అదేశించారు.పలు ప్రాంతాలలో బాంబ్ స్క్వాడ్ తో బస్ స్టాండ్ రైల్వే స్టేషను లలో మరియు అనుమానిత ప్రదేశాలలో  కల్వర్ట్ లను తనిఖీ చెశారు.ఈ సందర్బముగా జిల్లా ఎస్పీ మాట్లడుతూ మవోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో నిఘా పెంచామని , సానుభూతిపరులను ముందుస్తుగా విచారిస్తున్నామని, మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు  తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.గత రెండు రొజుల క్రితం ఛత్తిస్ ఘర్ లో మావోయిస్టులు ఒక ప్రైవేటు బస్సు ను కాల్చి వేశారని, దానిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఏటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ అన్ని  విధాలుగా ముందస్తు చర్యలూ తీసుకుంటున్నామని అయన తెలిపారు.ప్రాణహిత పరివాహక ప్రాంతాలతో ముందస్తు తనిఖీలు నిర్వహిస్తున్నమని ప్రజలు కుడా పోలిసులకు సహకరించాలని అయన కొరారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు వారిని అన్నీ విధాలుగా ఆదుకుంటామని,దీనిలో భాగంగానే మారుమూల ప్రాంతాలలో పోలీసులు,ప్రజలతొ మమేకమై జనమైత్రి వంటి అనేక కార్యక్రమలు చేస్తున్నామని అయన చెప్పారు.

Saturday, 25 February 2017

వేతనాల పెంపు ఫై విఆర్ ఏ ల హర్షం

వేతనాల పెంపు ఫై విఆర్ ఏ ల హర్షం 
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 25 ;  వి ర్ ఏ ల వేతనాలు పెంచినందుకు ముఖ్యమంత్రి  కెసిఆర్ చిత్ర పటానికి గ్రామా రెవెన్యూ సహాయ సేవకులు  రెబ్బెన తహసీల్దారు కార్యాలయం లో శనివారం రోజున వేతనాలు పెంచినందుకు మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు.అనంతరం ఈ కార్యకర్మంలో గ్రామా రెవెన్యూ సంఘం అధ్యక్షులు కాటా పల్లి వెంకటేశం ఉపాధ్యాక్షులు గణపతి, సలహాదారులు, ముంజమ్ బుద్ధులు,ఎం శ్రీనివాస్, రాజేశ్వరి, తిరుమల,పోషమళ్లు,మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 

మంచినీటి కి ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు

మంచినీటి కి ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు 
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 25 ;  రెబ్బెన మండలంలోని గోలేటి దుబ్బాగూడా గ్రామస్తులు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందికి గురౌతున్నమ్ అని శనివారం సింగరేణి రోడ్ ఫై ఖాలీ బిందెలతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు . గత పది రోజుల నుండి మంచి నీటి కి ఇబ్బందికి గురౌతున్నాం అని అన్నారు.  ఐన నాయకులు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆన్నారు. గత మూడు రోజుల క్రితం ఇలానే రోడ్ ఫై బైఠాయించి ధర్నా చేస్తే స్థానిక సర్పంచ్ తోట లక్ష్మణ్ సంఘటన స్థలనికి వచ్చి ఒక్కరోజులు నీరు అందిస్తాం అన్న హమీ తో ధర్నా ని విరమించాము కానీ మూడు రోజులు గడిచిన ఇప్పటికి మోటర్లు పనిచేయడం లేదన్నారని మహిళలు వ్యక్తం చేసారు. ఒక్క గాను ఒక్క బోరింగ్ వద్ద మహిళలు గంటల తరబడి వీచి ఉండాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత నాయకులు అధికారులు చొరవ తీసుకొని నీరానందించాలని మహిళలు కోరారు. ఈ ధర్నా ఆది లక్ష్మి ,రజిత, సాయి,రమ్య,లక్ష్మి ,నిత్మలా,రమేష్,రచన తదితరులు పాల్గోన్నారు.

అభివృద్ధికి ముందడుగులో తెరాస ప్రభుత్వం ; ఎం ఎల్ సి పురాణం సతీష్

అభివృద్ధికి  ముందడుగులో తెరాస ప్రభుత్వం ; ఎం ఎల్ సి పురాణం సతీష్ 


కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 25 ;  తెలంగాణ రాష్ట్ర గ్రామీణ  అభివృద్ధి  పథకాల ను ప్రవేశ పెట్టి   వివిధ  సంక్షేమలను అమలు చేస్తుందని పల్లె ప్రగతి కోసం తెరాస ప్రభుత్వం తోనే సాధ్యం అని ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ అన్నారు . శనివారం   రెబ్బెన మండలములో పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు చేశారు . గోలేటిలోని పెద్ద బావి నుండి సేవాలాల్ మందిర్ వరకు, భగత్సింగ్ నగర్, ఖైర్గుడా, ఇందిరానగర్, నక్కలగూడ సీసీ రోడ్ ల నిర్మాణం కొరకు భూమిపూజ చేసారు. అనంతరం రెబ్బెన లోని అతిధి గృహం ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఇతర పార్టీ లో నుంచి నాయకులు కార్యకర్తలు తెలుగు యువ మండల అధ్యక్షుడు మడ్డి  శ్రీనివాస్ గౌడ్, తెలుగు రైతు మండల  అధ్యక్షుడు రావు జి, నాయని బ్రాహ్మణా సంఘం , మండల ప్రధాన కార్యదర్శి తిరుపతి, నేర సంఘ నాయకులూ రాయల కృష్ణ, తెలుగు మహిళా నాయకురాలు రాజేశ్వరి లు పార్టీ లో చేరి తెరాస  ఖండువాలు కప్పుకున్నారు   ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పతకాలను చూసి ఇతర పార్టీ కార్యకర్తలు తెరాస లో చేరారన్నారు.  ఉమ్మడి రాష్ట్ర పాలనలో గత ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడం తో ఎంతో వెనకపడి పోయిన ఏరియా ని మన తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకొని మన ముఖ్య మంత్రి కెసిఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం రెండు వందల రూ  ఉన్న వృద్ధాప్య పింఛన్లు రెండు వేలకు గాను పెంచారు అలాగే వికలాంగులు  పింఛన్లు 500రూ నుండి 1500గాను , రేషన్ నాలుగు కిలోల నుండి ఆరు కిలోల వరకు పెంచిన ఘనత కెసిఆర్దే  అని అన్నారు. కల్యాణ లక్ష్మి పతాకం కింద ఎస్ సి , ఎస్ టి లేక్ పరిమితం కాకుండా బీసీ ఓసి లకు కూడా వర్తించేలా వారిలో కూడా నిరుపేదలు ఉన్నారని గుర్తించి తెరాస ప్రభుత్వం పతకాలను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చెరువులను ఎంతో అభివృద్ధి చేశామని, పేర్కొన్నారు . రక్షిత మంచి నీటి పథకము  పనులు వేగవంతముగా జరుగుతున్నాయని , ప్రతి ఒక్కరికి త్రాగు నీరు అందిస్తామని , .  ఈ కార్య క్రమములో జెడ్ పి  టి సి అజ్మీర బాబు రావు, ఎంపిపి కార్నాథం సంజీవ్ కుమార్, జిమ్ రవి శంకర్, ఏ ఎం సి  కుందారపు శంకరామ్మా, వైస్ ఎంపిపి రేణుక ,  సర్పంచ్ వెంకటమ్మ, తోట లక్ష్మన్,    సుశీల, జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ జైస్వాల్, ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి,   ప్రధాన కార్య దర్శి చెన్న సోమ శేకర్,  మోడెమ్ సుదర్శన్ గౌడ్, రాజేశ్వర్ రావు ఆశోక్, చిరంజీవి గౌడ్, చిట్టిబాబు, మల్రాజ్ శ్రీనివాస్ రావు,కోఆప్షన్ సభ్యుడు జాకీర్ ఉస్మాని, సింగల్ విండో డైరెక్టర్లు మధునయ్య, సత్యనారాయణ, గుడిసెల వెంకన్న గౌడ్, రమేష్ తధీతరులు ఉన్నారు.

Friday, 24 February 2017

శంభో శంకర నాదముతో శైవ క్షేత్రాలు

              శంభో శంకర నాదముతో శైవ క్షేత్రాలు


కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 24 ;  రెబ్బెన:   మహా శివరాత్రి సందర్భంగా రెబ్బెన మండలము లోని శైవ క్షేత్రాలు శంభో శంకర నాదముతో శుక్రవారము మరు మ్రోగాయి . మండలము లోని నంబల లో గల ప్రసన్నా పరమేశ్వర ఆలయము  జాతర రంగ రంగ వైభవంగా సాగింది . ఉదయము పూట నుండే భక్తులు తండోప తండాలుగా మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఎడ్ల బండలపై , మోటారు సైకిల్ల పై , వచ్చారు . కోరిన కోరికలను తీర్చాలని మొక్కుకున్నారు . ముందుగా శివ పార్వతుల కళ్యాణం ఆలయ కమిటి ఆధ్వర్యములో నిర్వహించారు . కళ్యాణం ఎంతో కనుల పండుగగా సాగింది .


 ఈ కల్యానములో భక్తులు కుంకుమ పూజలు భక్తి శ్రద్దలతో చేశారు . ఈ పూజలలో  దంపతులు  స్వామి కళ్యాణం లో కూర్చున్నారు . స్వామివారికి   ప్రత్యక  పూజలు నిర్వహించారు .



ఈ జాతర లో వచ్చిన భక్తుల కు   అన్నదానం  నిర్వహించారు . భక్తుల కు ఎలాంటి అసౌ కార్యాలు  కలగకుండా ఆలయ కమిటి సిబ్బంది అన్ని చర్యలు చేపట్టారు . అర్ టి సి సంస్థ భక్తుల రవాన కొరకు  ప్రత్యక బస్సులు నడిపారు .


ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగ కుండ  సి ఐ మదన్ లాల్    ఆధ్వర్యములో భారి బందోభాస్తూ ఏర్పాటు చేశారు .

కనుల పండగగా రాతోత్స్వావము


రెబ్బెన: (వుదయం ప్రతినిధి):   ప్రసన్న పరమేశ్వర ఆలయము లో శుక్ర వారము సాయంత్రము  శివ పర్వతుల రాధస్త్సవం ఎంతో కనుల పండగగా జరిగింది . ఈ రాతోత్స్వావము లో భక్తులు తనదో తండాలుగా పాల్గొన్నారు . ఆలయము చుట్టూ స్వామి వారి రథాన్ని భక్తులు శంభో శంకర అంటూ రథాన్ని లాగారు . శివాలయ ప్రాంగణము శివ నాదము తో మరు మ్రోగింది . అనతరము భక్తులు శివ పార్వతుల కు నైవేద్యము సమర్పించారు . సాయంత్రము శివాలయము లో భక్తులు భజనలు , కీర్తనలు పాడుతూ భక్తి పారవశ్యములో మునిగారు .


రాత్రి ఏర్పాటు చేసిన స్వామి వారి దీపాలంకరణ భక్తులను  మంత్రా ముగ్దులను చేసింది . అనంతరము భక్తులు శివాలయం వద్ద జాగారణ చేస్తూ శివ నాదముతో ఆనందములలో గడిపారు.

Thursday, 23 February 2017

సింగరేణి భూనిర్వాసితులకు అండగా ఉంటాం -కిషన్ రెడ్డి


సింగరేణి భూనిర్వాసితులకు అండగా ఉంటాం -కిషన్ రెడ్డి


కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 23 ; సింగరేణి లో ని భూనిర్వాసితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భారతీయ జనతా పార్టీ శాసన పక్షనేత కిషన్ రెడ్డి అన్నారు . గురు వారము బెల్లం పల్లి   గనులపై పర్యటించి మాట్లాడారు . ముందుగా ఖిరిగూడ ద్వారా సమావేశములో కార్మికులతో మాట్లాడారు . వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసు కున్నారు . సింగరేణి ప్రభావిత ప్రాంతమైన అబ్బాపూర్ సోనాపూర్ గ్రస్తులతో కలిశారు . స్సింగరేణి కార్మికులు తమ జీవితాలను అంకితం చేస్తూ ప్రపంచానికే వెలుగులు నింపుతున్నారని   తెలిపారు . కార్మికులకు ఆండగా ఉంటామని చెప్పారు , సింగరేణి రాష్ట్రములో చాలా పెద్ద పరిశ్రమ అని , దానిని రక్షించుకోవాల్సిన భాద్యత మన అందరిపై ఉందని అన్నారు . సింగరేణి కార్మికులకు ఎన్నో సమస్యలున్నాయని తెలిపారు .  తెలంగాణా రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర ఎంతో ఘణనీయం అన్ని అన్నారు . సింగరేణి సమ్మె  తో కేంద్ర ప్రభుత్వాన్ని గదా గడలాడించారని అన్నారు .  కోల్ ఇండియా లో మాదిరిగా అలవెన్సులు లేవని తెలిపారు . కార్మికులకు మెరుగైన సేవలు అందడము లేదని పేర్కొన్నారు . సింగరేణి యాజమాన్యము , ప్రభుత్వము కార్మికులకు వైద్యము అందించడములో విఫలమైందని తెలిపారు . సింగరేణి కార్మికుల సమస్యలపై నివేదికతో ముఖ్యమంత్రి , కేంద్రమంత్రి , ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిస్కారానికి కృషి చేస్తానని అన్నారు . కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకే బొగ్గు బాయి  యాత్ర చేపట్టామని అన్నారు .ఈ కార్యక్రములో రాష్ట్ర నాయకులు గొనె శ్యామ్ సుందర్ , జిల్లా అధ్యక్షుడు జె బి పౌడెల్ , నాయకులూ బోనగిరి సతీష్ , మాజీ ఎం ఎల్ ఏ గుజ్జల రామ కృష్ణ రెడ్డి సునీల్ చోదరి ఆంజనేయులు గౌడ్ , కిషన్ గౌగ్, రాంబాబు తైతరులు ఉన్నారు .

అసిఫాబాద్ రైల్వే రోడ్ స్టేషన్ లో ఫుట్టవర్ బ్రిడ్జి నిర్మించాలి

అసిఫాబాద్ రైల్వే రోడ్  స్టేషన్ లో ఫుట్టవర్ బ్రిడ్జి నిర్మించాలి

కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 23 ;  అసిఫాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని బెల్లంపల్లి లోని గనుల పర్యటన వచ్చిన కిషన్ రెడ్డికి బిజెపి మండల అధ్యక్షుడు బాల కృష్ణ అన్నారు. అసిఫాబాద్ రైల్వే స్టేషన్ నుండి నియోజక వర్గం లో గల పదిహేను అందలం లో నుండి ప్రతి రోజు ప్రయాణికులు వందలాది మంది ప్రయాణం చేస్తారని ప్రయాణికుల సౌకర్యం కోసం ఎక్సప్రెస్ రైళ్లను నిలుపుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి బి జె వై ఎం అధ్యక్షులు సంజీవ్ ప్రధాన కార్యదరహి రామ్ బాబు తో   పాటు తదితరులు ఉన్నారు.

కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి బోగే ఉపేందర్

కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి బోగే ఉపేందర్ 


కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 23 ;  సింగరేణిలో 15 సంవత్సరాలనుండి సింగరేణిలోపాని చేస్తున్నా కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని ఐటియూ సి జిల్లా సహాయ కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు . బెల్లంపల్లి ఏరియా కు బొగ్గు బాయిల పర్యటనకు వచ్చిన బిజెపి అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ కు వినతి పత్రాన్ని ఇచ్చ్చారు . అయన మాట్లాడుతూ సింగరేణిలో చాలీ చాలని జీతాలతో పబ్బం గడుపుతున్నామని అన్నారు . సింగరేణి కార్మికులతో పాటు పని చేస్తూ  సంస్థకు లాభాలు గడిస్తున్నామని తెలిపారు . మా సమస్యలను వెంటనే పరిస్కారానికి కృషి చేయాలని తెలిపారు . 
 శ్రీ కిషన్ రెడ్డి.MLA.BJP
పార్టి.వారి బొగ్గు బాయిపర్యటనలో బాగముగా గొల్లేటి నుండి బయలుదేరి కైరిగూడ ఓపన్ కస్టు వెళ్లి .అక్కడి. సింగరేణి
కార్మికుల  సమస్యల గురించి  మాట్లాడారు .అనంతరం అక్కడినుండి అబ్బాపూర్ గ్రామం చేరుకొని గ్రామస్తులతోమాట్లాడీనా‌‌రు.ఆతర్వాత బయలుదేరి గొల్లేటి జియం కార్యాలం చేరుకొని జియం గారితోమాట్లాడి  వెళ్లి పోయినారు..



సింగరేణి భూనిర్వాసితులకు అండగా ఉంటాం -కిషన్ రెడ్డి
సింగరేణి లో ని భూనిర్వాసితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భారతీయ జనతా పార్టీ శాసన పక్షనేత కిషన్ రెడ్డి అన్నారు . గురు వారము బెల్లం పల్లి   గనులపై పర్యటించి మాట్లాడారు . ముందుగా ఖిరిగూడ ద్వారా సమావేశములో కార్మికులతో మాట్లాడారు . వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసు కున్నారు . సింగరేణి ప్రభావిత ప్రాంతమైన అబ్బాపూర్ సోనాపూర్ గ్రస్తులతో కలిశారు . స్సింగరేణి కార్మికులు తమ జీవితాలను అంకితం చేస్తూ ప్రపంచానికే వెలుగులు నింపుతున్నారని   తెలిపారు . కార్మికులకు ఆండగా ఉంటామని చెప్పారు , సింగరేణి రాష్ట్రములో చాలా పెద్ద పరిశ్రమ అని , దానిని రక్షించుకోవాల్సిన భాద్యత మన అందరిపై ఉందని అన్నారు . సింగరేణి కార్మికులకు ఎన్నో సమస్యలున్నాయని తెలిపారు .  తెలంగాణా రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర ఎంతో ఘణనీయం అన్ని అన్నారు . సింగరేణి సమ్మె  తో కేంద్ర ప్రభుత్వాన్ని గదా గడలాడించారని అన్నారు .  కోల్ ఇండియా లో మాదిరిగా అలవెన్సులు లేవని తెలిపారు . కార్మికులకు మెరుగైన సేవలు అందడము లేదని పేర్కొన్నారు . సింగరేణి యాజమాన్యము , ప్రభుత్వము కార్మికులకు వైద్యము అందించడములో విఫలమైందని తెలిపారు . సింగరేణి కార్మికుల సమస్యలపై నివేదికతో ముఖ్యమంత్రి , కేంద్రమంత్రి , ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిస్కారానికి కృషి చేస్తానని అన్నారు . కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకే బొగ్గు బాయి  యాత్ర చేపట్టామని అన్నారు .ఈ కార్యక్రములో రాష్ట్ర నాయకులు గొనె శ్యామ్ సుందర్ , జిల్లా అధ్యక్షుడు జె బి పౌడెల్ , నాయకులూ బోనగిరి సతీష్ , మాజీ ఎం ఎల్ ఏ గుజ్జల రామ కృష్ణ రెడ్డి సునీల్ చోదరి ఆంజనేయులు గౌడ్ , కిషన్ గౌగ్, రాంబాబు తైతరులు ఉన్నారు .

కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి బోగే




సింగరేణిలో 15 సంవత్సరాలనుండి సింగరేణిలోపాని చేస్తున్నా కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని ఐటియూ సి జిల్లా సహాయ కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు . బెల్లంపల్లి ఏరియా కు బొగ్గు బాయిల పర్యటనకు వచ్చిన బిజెపి అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ కు వినతి పత్రాన్ని ఇచ్చ్చారు . అయన మాట్లాడుతూ సింగరేణిలో చాలీ చాలని జీతాలతో పబ్బం గడుపుతున్నామని అన్నారు . సింగరేణి కార్మికులతో పాటు పని చేస్తూ  సంస్థకు లాభాలు గడిస్తున్నామని తెలిపారు . మా సమస్యలను వెంటనే పరిస్కారానికి కృషి చేయాలని తెలిపారు .  














Wednesday, 22 February 2017

సింగరేణిలో గిరిజన కార్మికులకు గుర్తింపు తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్యం ; ఎమ్ఎల్ సి రాములు నాయక్

సింగరేణిలో గిరిజన కార్మికులకు గుర్తింపు తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్యం ; ఎమ్ఎల్ సి  రాములు నాయక్


కొమరంభీం ఆసిఫాబాద్ ఉదయం ప్రతినిధి 22; సింగరేణిలో గిరిజన కార్మికులకు గుర్తింపు తెలంగాణ ప్రభుత్వం లోనే జరుగుతున్నదని గత ప్రభుత్వాలు సింగరేణి గిరిజన కార్మికులను ఎలాంటి గుర్తు\యింపుని ఇవ్వకుండా పెడతోవను పెట్టారని ఎమ్మెల్సీ  ఆన్నారు .  రెబ్బెన మండలంలోని గోలేటిలో సింగరేణి గిరిజన నూతన భావన ప్రారంభానికి కొమరంభీం జిల్లా కలెక్టర్ చంపాలాల్, ఎంఎల్ ఏ కోవ లక్ష్మి, హాజరయ్యారు మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు అనంతరం  శిలా పలకాన్ని ఆవిష్కరించి ఏర్పాటు చేసిన సభలో సింగరేణి గిరిజనులకు సంభందించిన కల సూచికను విడుదల చేసారు. అనంతరం రాములు నాయక్ మాట్లాడుతూ గిరిజన కార్మికుల సమస్యలు ఏమైనా ఉంటె వాటిని తెలిపినచో కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు.  సింగరేణి లో 9.91%   ఉద్యోగాలు అమలు కావాల్సి ఉండగా 6శాతం మాత్రం మే అమలు చేయడాం తో గిరిజనులు నష్టపోతున్నారని సమతా తీర్పు ప్రకారం 650ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయాలన్నారు. సింగరేణి లాభాలలో  కార్మికులకు 26శాతం వాటాను గిరిజనులకు కేటాయించాలన్నారు. కొమరంభీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ మాట్లాడుతూ ఏ సంఘాలైనా సమిష్టిగా కృషి చేస్తే ఎలాంటి సమస్యలు తలెత్తవని అయన అన్నారు . ఏదైనా సమస్యలో ఉంటె ఆయన దృష్టికి తీసుకురావలనన్నారు. ఈ కార్యక్రమంలో ,ఆర్డిఓ షంనాయక్, ,సింగరేణిజిఎం రవిశంకర్, జెడ్పిటీసి బాబూరావ్,  ఏఎంసి వైస్చేర్మెన్ కుంధారపు శంకరమ్మ, సిఐ మదన్ లాల్ ,గోలేటి సర్పంచ్ తోట లక్ష్మణ్ టీఆర్ఎస్ మండలఅధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి ,ఎంపిటీసి మురళిబాయ్,టీపిజికెఎస్ నాయకులూ సదాశివ్,ఏఐటీయూ నయకులు ఎస్ తిరుపతి,  బి. భద్రు, జాదవ్,రాజయ్య, అడ్వైజర్, అరవిందనాయక్ తదితరులు పాల్గొన్నారు.

ప్రొఫెసర్ కోదండ రామ్ అరెస్ట్ అప్రజా స్వమికం ; టి వి వి జిల్లా ఉపాధ్యక్షులు

ప్రొఫెసర్ కోదండ రామ్ అరెస్ట్ అప్రజా స్వమికం ; టి వి వి  జిల్లా ఉపాధ్యక్షులు 

కొమరంభీం ఆసిఫాబాద్ ఉదయం ప్రతినిధి 22;   ప్రొఫెసర్ కోదండ రామ్ ను అర్ధరాత్రి  అరెస్ట్ చేయటం  అప్రజా స్వామిక   అని  టి వి వి జిల్లా ఉపాధ్యక్షు దేవేందర్ అన్నారు. బుధవారం రెబ్బెన లో ఏర్పాటు చేసిన సమావేశం అయన మాట్లాడారు నిరుద్యోగుల నిరసన ర్యాలీకి భయాలు దేరిన విద్యార్థులను, విద్యార్థి సంఘ నాయకులను , విద్య వంతులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య దేశం లో హేయమైన  చర్య. విద్యార్థులు విద్యవంతులు టీజె ఏ సి తెలంగాణ ఉద్యమ సమయంలో శాంతియుతంగా చేసిన ర్యాలీలు పోరాటాల ఫలితంగానే ఈ ప్రభుత్వం మంత్రులు గద్దెనెక్కి ఇప్పుడు అసాంగిక శక్తులనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.  సామజిక తెలంగాణ కోసం టీ.జె.ఏ.సి,   టి.వి. వి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధమని మండల అధ్యక్షులు వనమాల నవీన్ కుమార్ ప్రధాన కార్యదర్శి జాడి జ్ఞానేశ్వర్, మండల్ ఉపాధ్యక్షులు ఎస్ అనిల్ కుమార్ తెలిపారు. 

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అడ్డుకోలేరు....

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అడ్డుకోలేరు....
Displaying IMG_20170222_170014.jpg

అక్రమ అరెస్టులతో విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు చేపట్టే శాంతియుత నిరసనలు అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఎఐఎస్ఎఫ్ అసిఫాబాద్ నియోజకవర్గ కార్యదర్శి పూదరి సాయికిరణ్ అన్నారు.బుధవారంనాడు తెలంగాణ జేఏసీ తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీ ని అడ్డుకోవడాన్ని,ర్యాలీ లో పాల్గొన్న విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. బుధవారంనాడు రెబ్బెనలోని రోడ్లు మరియు భవనాల అతిధి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలం అయ్యిందని అన్నారు కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో అందరికి పదవులు ఉంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో ఇంత అరాచక పాలన వస్తుందని ఉహించలేదని అన్నారు. ఇందిరా పార్కు వద్ద నిరుద్యోగ నిరసన ర్యాలీ లో పాల్గొన్న కుమురం బీమ్ జిల్లా ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,జిల్లా కార్యవర్గ సభ్యులు కస్తూరి రవికుమార్ లను అరెస్ట్ చేయాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.ఈ సమావేశంలో ఎఐఎస్ఎఫ్ రెబ్బెన మండల కార్యదర్శి పర్వతి సాయికుమార్,నాయకులు పాల్గొన్నారు.

చట్ట బద్ధత కల్పించకనే విఅర్ఎస్ ఉద్యోగాలలో గంధర గోళం.

చట్ట బద్ధత కల్పించకనే విఅర్ఎస్ ఉద్యోగాలలో గంధర గోళం.   
  ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి 

Displaying 20170222_102002.jpg


కొమరంభీం ఆసిఫాబాద్ ఉదయం ప్రతినిధి 22;  టిబిజికెఎస్ వారసత్వ ఉద్యోగాల పైన చట్ట బద్ధత ఒప్పందము చేసుకోక పోవడం వలెనే విఆర్ఎస్ అమలు పరచడంలో గంధరగోళం తలెత్తిందని,దీని వలన సింగరేణి కార్మికులు తీవ్ర ఆందోళనకు గురిఅవుతున్నారని, ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యాదర్శి ఎస్.తిరుపతి ఆరోపించారు. బుధవారం నాడు గోలేటిలోని కెఎల్ మహేంద్ర భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యాం, గుర్తింపు సంఘం అయిన టిబిజీకేఎస్ లు కుమ్మక్కయ్యి.మరోసారి కార్మికులకు ద్రోహం తలపెట్టే విధంగా,మీరు సర్క్యూలర్ ఇవ్వండి,మేము అమలు కాకుండా చూస్తామని టిబిజీకేఎస్ యాజమాన్యంతో ఒప్పందము చేసుకుందని అన్నారు.ఎదో ఒక నెపంతో ఉద్యోగాలు ఆపాలని యాజమాన్యం చూస్తుందని అన్నారు. జిక్త నాలుగు సంవత్సరాలుగా టిబిజీకేఎస్ కార్మికులకు చేసింది ఏమి లేదని, కార్మికులు నిరాశ, నిస్పృహాలతో ఉన్నారని అన్నారు. గతంలొ విఆర్ఎస్ సర్క్యూలర్ వచ్చినప్పుడే ఐ.డి ఆక్ట్ 12-3 అగ్రిమెంట్ చేయాలనీ ఏఐటీయూసీ గతంలోనే డిమాండ్ చేసిందని గుర్తు చేసారు.ఈ ఒప్పందం చేసుకొని ఉంటె ఎన్ని అడ్డంకులు ఎదురైన ఏమి కాదని విఆర్ఎస్ అమలు అవుతుందని అన్నారు.చట్టాలు తెలియని నాయకులు టిబిజికెఎస్ లో ఉండడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయాని అన్నారు.అంతర్గత కుమ్ములాటలతో టిబిజికేఎస్ కార్మికుల హక్కులను నాలుగు సంవత్సరాలుగా హరించి,ఇప్పుడు మోసపూరితంగా విఆర్ఎస్ సర్కులర్ పేరిట ఎన్నికల లబ్ధి కోసమే తెరాస,టిబిజీకేఎస్  డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా వారసత్వ ఉద్యోగాల అమలు Aకోసం 12-3 అగ్రిమెంట్ చట్ట బద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.  వారసత్వ ఉద్యోగాల కోసం ఉద్యమాలు, ఆందోళనలు చేపడుతామని, అవసరం అనుకుంటే సమ్మెకు సిద్ధమేనని హెచ్చరించరు. ఈ సమావేశంలో ఆర్గనైజింగ్ కార్యదర్శులు దివాకర్ రావు,జూపాక రాజేష్,నాయకులు మారం శ్రీనివాస్,సురేష్ కోరి,గట్టు లక్ష్మణ్, లక్షేట్టి పోచమళ్ళు,రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 21 February 2017

సింగరేణి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం నేడు ప్రారంభం

సింగరేణి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం నేడు ప్రారంభం 



కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 21 ;  సింగరేణి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం నేడు ప్రారంభం  కానుందని ఈ ప్రారంభానికి ఎమ్మెల్సీలు పురాణం సతీష్ కుమార్, రాములు నాయక్ ,  ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, దుర్గం చిన్నయ్యలు ముఖ్య అతిథులుగా  హాజరవుతారని బెల్లంపెల్లి ఏరియా అధ్యక్షుడు బి. భద్రు తెలిపారు .రెబ్బెన మండలం లోని గోలేటి లో మంగళవరం విలేకరుల సమావేశం లో అయన మాట్లాడారు  ఈ సందర్బంగా జెండా ఆవిష్కరని కార్యాలయం ప్రారంభం కార్యక్రమం ఉంటుందని అనంతరం సభ కార్యక్రమాలు నిర్వహించ బడతాయన్నారు  ఈ కార్యక్రమానికి సింగరేణి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ,ఉద్యోగులుగ మేధావులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో జాదవ్ , రాజయ్య ,అడ్వైజర్ ,అరవిందనాయక్ తదితరులు పాల్గొన్నారు.

Monday, 20 February 2017

సేవ ధ్రుపదంతో భోజనం ఏర్పాట్లు

సేవ ధ్రుపదంతో భోజనం ఏర్పాట్లు 

కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 20 ; ఆసిఫాబాద్ లో ఆర్ ఆర్ ఎస్ స్వచ్ఛంద సేవ సంస్థ వారు ప్రజా ఫిర్యాదుల విభాగం రోజున కలెక్టర్ కార్యాలయంకు వచ్చే వారికి ఐదు రూపాయలకె భోజనం సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమనికి అన్నదాతగా గుండి ఏం పి టి సి రవీందర్ ఆద్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలు తమ సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చెందుకు దూర ప్రాంతాల నుండి వస్తారని వారికి భోజన సౌకర్యం కల్పిస్తున్నమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఆర్ ఎస్ సంస్థ సభ్యులు పవన్, సంతోష్, నగేష్, ప్రతాప్, నరేష్, శ్రీనివాస్, రమేష్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

మా కొలువులు మాకు కావాలి ; ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

మా కొలువులు మాకు కావాలి ; ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్

కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 20 ; ఈ నెల 22వ తేదిన హైదరాబాద్ లో తలపెట్టిన నిరుద్యోగుల నిరసన ర్యాలీకి విద్యార్థులు,యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ పిలుపునిచ్చారు. సోమవారం రోజున కాగజ్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్ర పాలకుల వలన విద్యార్థులకు,యువకులకు నష్టం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యార్థులకు,యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఉద్యమాలు నిర్వహించి ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను యువకులను విస్మరించిందని అన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను అమలు చేయాలని,రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని,ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని,ఉద్యోగ నియామకాలకు సంబంధించిన జాబ్ క్యాలండర్ రూపొందించి అమలు పరచాలని,ప్రైవేట్ రంగంలోని ఉద్యోగ నియామకాలలో స్థానిక రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని,డియస్సీ వెంటనే నిర్వహించాలని నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నమని విద్యార్థులు,యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్,మండల అధ్యక్షుడు రవివర్మ,కార్యదర్శి సంపత్ ,శివ, తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 22న ఏఐటీయూసీ జిల్లా సమావేశం

ఈ నెల 22న ఏఐటీయూసీ జిల్లా సమావేశం 

కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 20 ; ఈ నెల 22 బుధవారం రోజున జిల్లా కేంద్రంలోని ఎస్టియూ భవన్ లో ఏఐటీయూసీ జిల్లా సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబాలా ఓదెలు అన్నారు.జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సమావేశానికి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్,జిల్లా అధ్యక్షులు ఎస్.తిరుపతిలు హాజరు అవుతారని పేర్కొన్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సమావేశాన్ని నిర్వహిస్తున్నామని,కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ కార్మికుల క్రమబద్దీకరణ త్వరగ చేపట్టే విధంగా ఉద్యామాలు నిర్వహిస్తామని,దానికి సంభంధించిన ఎజెండాను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.తాత్కాలిక పెన్ డౌన్ పేరిట గత రెండు సంవత్సరాల క్రితం  మూసివేసిన సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపించేందుకు ఈ సమావేశంలో కార్యచరన రూపొందించి ప్రభుత్వం తెరిపించే  విధంగా  తీవ్ర  ఒత్తిడి తీసుకొస్తామని,సింగరేణి,ఇతర ప్రభుత్వ సంస్థలలో కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహించే కార్మికులను వెంటనే క్రమబద్దీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సమావేశానికి జిల్లా కౌన్సిల్ సభ్యులు సకాలంలో హాజరు కావాలని కోరారు.

Saturday, 18 February 2017

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 18 ; కుమ్మరా కుల వృత్తు దారులకు రానున్న బుడ్జెట్లో నిధులు కేటాయిస్తామని ముఖ్యంమత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అయన చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా కొమరంభీం జిల్లా కుమ్మరా జిల్లా అధ్యక్షుడు మల్లేష్ మాట్లాడుతూ కుమ్మరా వృత్తిని ఆధునీకరించి పారిశ్రామికి శిక్షణ ఇప్పించాలన్నారు చెరువుల మట్టిని  కుమారులకు కేటాయించాలని అన్నారు వృత్తి శిక్షణ కొరకు ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించాలన్నారు. జిల్లా కేంద్రంలో కుమారులకు భావన నిర్మాణం చేపట్టాలని కోరారు. కుమ్మరా కులస్తులకు బుడ్జెక్టులో నిధులు సామ్ కూర్చిన కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. 50సం నిండిన ప్రతి కుమారులకు 2000ల రూ పెన్షన్ ఇవ్వలని అన్నారు రాజకీయాలలో ఎమ్మెల్సీకి సీటు ని కు కేటాయించాలని  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి కుల నాయకులు   సురేష్, ఎర్ర మహేష్, మల్లేష్, రాజేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ఐకెపి రుణాలు సకాలంలో చెల్లించాలి ; విజయ్ బాస్కర్

ఐకెపి రుణాలు సకాలంలో చెల్లించాలి ; విజయ్ బాస్కర్

కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 18 ; ఇందిరాక్రాంతి పతాకం ద్వారా గత సంవత్సరం మంజూరైన  బ్యాంకు లోన్ రుణాలను  లను సకాలంలోచెల్లించి వడ్డీ మాఫీని పొందాలని శ్రీనిది జెనరల్  మేనేజర్ విజయ్ బాస్కర్  సూచించారు. రెబ్బెన లో శనివారం రోజున   రుణ లబ్ది దారుల సముదాయాలను పరిశీలించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు ద్వారా రునాలు  పొందిన  మహిళ సంఘాలు సకాలంలో రుణాలు చెల్లిస్తే ప్రభుత్వం వీరికి వడ్డీ మాఫీ చేస్తుంది అన్నారు తద్వారా మహాలను ఆర్థికంగా అభివృద్ధు చెందలన్నారు సకాలంలో రుణాలను చెల్లిస్తున్న మహిళా సంఘాలకే ప్రభుత్వం   మరల ఋణ సదుపాయం పొందవచ్చని పేర్కొన్నారు కావున మహిళా సంఘాలు రుణాలను సకాలంలో చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏ జి ఎం లక్ష్యం ఏ సి అన్నాజీ , ఎపిఎం వెంకటరామన శర్మ, తెలంగాణ పల్లె ప్రగతి క్లస్టర్ ఆఫీసర్ రాజ్ కుమార్ , డిస్ట్రిక్ట్ మేనేజర్ సంతోష్ తదితరు పాల్గొన్నారు.  

ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య

ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య 

కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 18 ; రెబ్బెన మండలం లో ని రాలపేట గ్రామంలో పాలడుగుల రాజేష్ కుమార్ (24) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య  చేసుకునట్లు ఏ ఎస్ ఐ దేవరాజ్  తెలిపారు.   తెలిపిన వివరాల ప్రకారం రాజేష్ పీజీ చివరి సంవస్తరం పరీక్షలు రాసినట్లు తెలిపారు . అందులో ఒక సబ్జెక్టు ఫెయిల్ అవ్వడం తో రీవాల్యూ వేషన్ కొరకు తండ్రి వెంకటేశ్వర్లను వరంగల్ కి పంపించినట్లు తెలిపారు. రెవెల్యూఏ వేషేన్ సమయం ముగియడం తో వచ్చే సంవత్సరం పరీక్షలు రాసుకోవాల్సింది అధికారులు సూచించినట్లు తెల్పినారు పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపానికి గురై  శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో తాడు తో ఉరి వేసుకొని మృతిచెందినట్లు తెలిపారు.  తండ్రి వెంకటేశ్వర్లు వరంగల్ నుండి ఇంటికి వచ్చే సరికి ఉరి వేసుకొని మృతిచెంది నట్లు తెలిపారు.  తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దారియాప్తు చేస్టున్నాము అని తెలిపారు.  సంఘటన స్థలానికి  పోలీసులు చేరుకొని కేసు పూర్వాపరాన్ని పరిశీలించారు.

నిరుద్యోగుల నిరసన ర్యాలీకి తరలిరండి ; ఎఐఎస్ఏఫ్ ,ఎఐవైఏఫ్

నిరుద్యోగుల నిరసన ర్యాలీకి తరలిరండి ; ఎఐఎస్ఏఫ్ ,ఎఐవైఏఫ్

కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 18 ; హైదరాబాద్ లో ఈ నెల 22వ తేదిన తలపెట్టిన నిరుద్యోగుల నిరసన ర్యాలీకి విద్యార్థులు,యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ ,ఎఐవైఏఫ్ జిల్లా ఉపాధ్యాక్షులు బోగే ఉపేందర్ లు పిలుపునిచ్చారు. శనివారం రోజున రెబ్బెనలోని అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్ర పాలకుల వలన విద్యార్థులకు,యువకులకు నష్టం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యార్థులకు,యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఉద్యమాలు నిర్వహించి ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను యువకులను విస్మరించిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను అమలు చేయాలని,రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని,ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని,ఉద్యోగ నియామకాలకు సంబంధించిన జాబ్ క్యాలండర్ రూపొందించి అమలు పరచాలని,ప్రైవేట్ రంగంలోని ఉద్యోగ నియామకాలలో స్థానిక రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని,డియస్సీ వెంటనే నిర్వహించాలని నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నమని విద్యార్థులు,యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి మండల కార్యదర్శి నర్సయ్య ,ఎఐఎస్ఏఫ్ డివిజన్ కార్యదర్శి పుదారి సాయి,నాయకులు శ్రీకాంత్,సాయి తదితరులు పాల్గొన్నారు.

Friday, 17 February 2017

గొల్ల యాదవులు అభివృద్ధి కి చర్యలు

గొల్ల యాదవులు అభివృద్ధి కి చర్యలు 
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 17 ; అభివృద్ధి కొరకు జిల్లా వ్యాప్తంగా గొల్ల యాదవ కులస్తులకు ప్రత్యేక  చర్యలు తీసుకుంటున్నట్లు   ఆర్డిఓ పాండురంగారావు అన్నారు. శుక్రవారం రెబ్బెన మండలం లోని ఎంపీడీఓ కార్యాలయం లో ఏర్పర్చిన పలు అధికారుల సమావేశం లో మాట్లాడారు. గొల్ల యాదవులు కులస్తులకు సంక్షేమ పథకాలను అవగాహనా కల్పించడం లో ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.ఒక్క కుటుంబాన్ని కి 19 గొర్రెలు, 1 పొట్టేలు అందించడం జరుగుతుందని తెలియపరు లబ్ది దారులు పూర్తి పోతాం లో 25% డబ్బులు చెల్లించవలసి ఉంటుందని సూచించారు . గొర్రెల పెంపకానికి గాను పక్క రాష్ట్రము నుంచి గొర్రెలను దిగుమతి చేసి అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ గా శ్రీనివాస్,తహసిల్దార్ రమేష్ గౌడ్ ,ఎంపిడిఓ సత్యనారాయణ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు 9 గంటల పాటు పగలు విద్యుత్ కొరకు ముమ్మర ఏర్పాట్లు

రైతులకు  9 గంటల పాటు పగలు  విద్యుత్ కొరకు ముమ్మర ఏర్పాట్లు 

కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 17 ;  ఈ వేసవి పంటను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఉదయం నుండి సాయంత్రం వరకు 9 గంటల పాటు  విధ్యుత్త్ అందిచడంలో భాగంగా రెబ్బెన విద్యుత్ ఉప కేంద్రంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి.  మండల విద్యుత్ అధికారి  మహ్మద్ ఇర్ఫాన్ ఆధ్వర్యంలో చక చక ముమ్మరంగా పనూలు జరుగుతున్నాయి.దీని కోసం భారీ ఎత్తున బ్రేకర్ లు,ఫీడర్లు పిఆర్టిలు సబ్ స్టేషన్లకు వచ్చాయి.వీటి అమర్చే పనులు కాంట్రాక్టర్ కు అప్పగించారు.పనులు వేగిరంగా అయ్యేందుకు ఏఈ ఇర్ఫాన్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. త్వరలో పనులు పూర్తి కావస్తున్నాయని అతితోందరలో రైతులకు విద్యుత్ రైతులకు ఉదయం నుండి సాయంత్రం వరకు 9 గంటల పాటు సౌకర్యాన్ని మరింత మెరుగు పరుస్తున్నామని తెలియజేసారు

గోలేటి క్రాస్ రోడ్డు వద్ద సిఐ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు

గోలేటి క్రాస్ రోడ్డు వద్ద సిఐ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు                        


కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 17 ;  వాహనదారులు విధిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని రెబ్బెన సర్కిల్ ఇన్స్పెక్టర్ మదన్ లాల్ అన్నారు.శుక్రవారంనాడు రెబ్బెన మండలంలోని గోలేటి క్రాసు రోడ్డు వద్ద ప్రత్యేక వాహనా తనిఖీ లు నిర్వహించారు.ఈ సందర్బంగా సిఐ మదన్ లాల్ మాట్లాడుతూ వాహన చోదకులు విధిగా శిరస్త్రణ ధరించాలని అన్నారు. ప్రతి ఒక్కరు వాహన చోదక అర్హత పత్రాన్ని కలిగి ఉండాలి అని అన్నారు.అదే విధంగా వాహనాలకు సంబంధించిన  దృవీకరణ పత్రాలు అయినా రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్,లైఫ్ టాక్స్ వంటి రవాణాశాఖ ఇచ్చిన పత్రాలు కలిగి ఉండాలని సూచించారు.సరైన పత్రాలు లేని వాహన యజమానులకు జరిమానా విధించారు.మైనర్ విద్యార్థులు వాహనాలు నడపకూడదని ఒక వేల నడిపినట్టైతే వారి తల్లిదండ్రులు శిక్షార్హులని హెచ్చరించారు.చోదకులు మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని  అన్నారు.సిఐ వెంట సిబ్బంది పాల్గొన్నారు.

Thursday, 16 February 2017

ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 16 ;  లంబాడీల ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతిని గురువారం రోజున రెబ్బెన మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రెబ్బెన సర్కిల్ ఇన్స్పెక్టర్ మదన్ లాల్,తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్ పాల్గొని ప్రభుత్వం తరుపున అధికారికంగా నిర్వహించారు.అదే విధంగా జెండాను ఆవిష్కరించి,కొబ్బరికాయలు కొట్టారు.వారు మాట్లాడుతూ ప్రజలు అహింస మార్గాన్ని ఎంచుకోవాలి సేవాలాల్ మహారాజ్ ప్రజలకు పిలుపునిచ్చారని,మానసిక పునరుత్తేజానికి మరియు శాంతికి ,ఆధ్యాత్మికత ఒక్కటే మార్గమని సూచించిన మహానియుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్,రెబ్బెన సర్పంచ్ పెసరు వెంకటమ్మ,రెబ్బెన గ్రామ రెవెన్యూ అధికారి ఉమ్లాల్,నాయకులూ దుప్ప నాయక్,అజమేరా ఆత్మ రాం నాయక్,బిక్కు నాయాక్,బలరాం నాయక్, కులస్తులు,నాయకులూ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమాకారులను స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలి ; ఉపేందర్, రవీందర్


తెలంగాణ ఉద్యమాకారులను స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలి ; ఉపేందర్, రవీందర్

కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 16 ; తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు జరిగిన మలిదశ ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపిన వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా అదుకొవాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా ఉపాధ్యాక్షులు బోగే ఉపేందర్,జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్ లు కోరారు. గురువారం రోజున తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆద్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ చంపాలాల్ కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో విద్యార్థులు, యువకులు, ప్రజలు, అన్ని వర్గాల వారు పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని గుర్తు చేశారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారని,2009 సంవత్సరం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసే అక్రమ కేసులు పెట్టిందని అన్నారు. ముఖ్యంగా నీళ్ళు, నిధులు, నియమాకాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని,తెలంగాణ రాష్ట్రం ఏర్పాడితే విద్యార్థుల,యువకుల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రాణాలకు తెగించి పోరాటం చేశామని,ఎంతోమంది విద్యార్థులు తమ ప్రాణాలను సైతం తెలంగాణ రాష్ట్రం కోసం అర్పించారని అన్నారు. కావున తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపిన ఉద్యమాకారులను స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలని,ఉద్యమాకారులకు ఐదు ఎకారాల ప్రభుత్వ భూమి,రెండు పడుకల గదుల ఇళ్లు,ఉద్యమాకారులందరికి ప్రతి నెల 25000 ఫించన్ అలాగే ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని,ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాహబ్ ,నారాయణ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

నులి పురుగుల నివారణ మాత్రల పంపిణి

నులి పురుగుల నివారణ మాత్రల పంపిణి
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 16 ;  జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్బంగా గురువారం రోజున రెబ్బెన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల  విద్యార్థులకు నులి పురుగు నివారణ మాత్రలు వేశారు.ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సుబ్బరాయుడు హాజరు అయ్యి విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలు అందించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు చిన్న పిల్లలకు,విద్యార్థులకు నూలిపురుగుల మాత్రలు వేయించడం వలన రక్తహీనత,సంపూర్ణ శారీరక, మానసిక అభివృద్ధికి దోహదపడుతుందని నులి పురుగుల ఓ పరాన్న జీవి అని అన్నారు. ఇది మనుషుల పేగుల్లో నుంచి పోషకాలను గ్రహిస్తాయని  ఇవి చిన్నారుల పాలిట అత్యంత ప్రమాదకరమైన ప్రాణులని, మొదట ఏలిక పాములుగా పుట్టి, నులి పురుగులుగా ఎదిగి, కొంకి పురుగులుగా మారుతాయి. ఇలా మూడు దశల్లో వ్యాప్తి చెందే  పురుగులు ఆరోగ్యాన్ని హరిస్తాయిన్నారు  ప్రతి పాఠశాలలో, అంగన్వాడి కేంద్రాలలో  తప్పని సరిగా  నులిపురుగు  మాత్రలను పిల్లలకు వేయాలని, 1 సం,, నుంచి 3 సం,,  పిల్లలకు సగం మాత్ర  వేయాలని అదేవిధంగా  3 సం,, నుంచి 19 సం,, పిల్లలకి  ఒక్క మాత్ర వేయాలని అన్నారు. భోజనం చేసిన అరగంట  తరువాత మాత్రను సప్పరించాలని అన్నారు.ప్రత్యేకంగా  శిక్షణ  పొందిన కార్యకర్తలచే  మందులు వేయించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి సుందర్రావు,రెబ్బెన ప్రభుత్వ వైద్యాధికారి సంతోష్  సింగ్,మండల విద్యాధికారి వెంకటేశ్వర స్వామి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత,వైద్య సిబ్బంది,ఉపాద్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

పురుగుల మందు సేవించి ఆత్మా హత్యా

పురుగుల మందు సేవించి ఆత్మా హత్యా 
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 15 ; స్నేహితులతో కలిసి మద్యం సేవించినాక దొంగన్నారని  పురుగుల మందు సేవించి  గాజి రెడ్డి అశోక (28) మంగళ వారం ప్రభుత్వ ఆసుపత్రి లో  మరణించినట్లు భార్య జ్యోతి పిర్యాదు మేరకు ఎస్ ఐ దారమ్ సురేష్ తెలిపారు. సోమవారం రాత్రి స్నేహితులతో కలిసి మద్యం సేవించి  ఇంటికి వెళ్లే సమయంలో  కందుల  మూటను దొంగతనం చేశారన్నారని మనస్తాపనతో ఇంటికి వెళ్లడని తెల్లవారు జామున ఇంట్లో  పురుగుల మందు సేవించాడని ఆసుపత్రికి తరలించిగా చికిక్చ పొందుతూ  మరణించినట్లు తెలిపారు  భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దరియాప్తు చేస్తున్నాం అన్నారు..

పదో తరగతి విద్యార్థులు ప్రతిభ పరీక్షలకు హాజరు కావాలి

పదో తరగతి విద్యార్థులు ప్రతిభ పరీక్షలకు హాజరు కావాలి 
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 15 ;   పదో తరగతి విద్యార్థులు ప్రతిభ పరీక్షలకు హాజారు కావాలని భారత విద్య ఫెడరేషన్ జిల్లా కమిటి  సభ్యలు దుర్గం రాజ్కుమార్ ,బి వినోద్ బుధవారం ఓ ప్రకటనలో కోరారు. రెబ్బెన జప్స్ పాఠశాల్లో మరియు గంగ పూర్ పాఠశాలలో ఈ నెల 17తారీకున నిర్వహిస్తున్నాం అన్నారు . పరీక్షా రుసుము 20రూ  చెల్లించాలన్నారు 100మార్కుల పరిక్ష పత్రం తో పాటు మల్టీపుల్ ఛాయిస్ ఉంటుందన్నారు కావున విద్యార్థు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.  

విద్యార్థులు శ్రద్దగా చదువుకోవాలి ; జిఎం రవి శంకర్

విద్యార్థులు శ్రద్దగా చదువుకోవాలి ; జిఎం రవి శంకర్

కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 15 ;  విద్యార్థులు శ్రద్దగా చదువు కొని ఉన్నత  స్థాయికి చేరుకోవాలని జిఎం రవి శంకర్ అన్నారు. రెబ్బెన మండలం లోని హోలీటి సింగరేణి హై స్కూల్ 34వ వార్షికోత్సవ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశం లో ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. సింగరేణి కార్మికుల భవిషత్ తో పాటు పిల్లల చదువుల పై ప్రత్యేక శ్రద్ధ వహించి వారి చదువు కోసం ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నట్లు తెలిపారు చదువు తో పాటు వివిధ క్రీడా రంగాల్లో ప్రోత్సాహం అందిస్తున్నదన్నారు అలాగే ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని యోగ  తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్య ప్రధానమైనదని విద్యతోటె అన్ని రంగాల్లో రాణించవచ్చు నాని, చిన్ననాటి నుంచే మంచి అలవాట్లు నేర్చుకొని విద్యను  శ్రద్ధగా  చదివినట్లయితే భవిష్తలో ఉన్నత శ్రేణిలకు చేరొచ్చునని అన్నారు. ఈ సందర్బంగా  విద్యార్థులు ఆట పాటలతో వివిధ సాంస్కృతిక నృత్యాలు చేసి పలుగుర్ని ఆకట్టు కున్నారు. ఈ కార్యక్రం లో డా ,సంతోష్ సింగ్ , జీఎం ఎడ్యుకేషన్ రామ్ నారాయణ, జిఎఫ్ అండ్ ఏ కృష్ణమోహన్,  డిజీఎం  పర్సనల్ జె చిత్తరంజన్ కుమార్, సేవ అధ్యక్షురాలు అనురాధ ,హెచ్ ఎం వెంకటేశ్వర్లు, ఏ ఐ టి యు సి ప్రధాన కార్యదర్శి ఎస్ తిరుపతి, టిబిజికెఎస్ నాయకులూ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.      

Tuesday, 14 February 2017

విద్యుత్ కనెక్షన్ ఇపించాలి

విద్యుత్ కనెక్షన్ ఇపించాలి 
వాంకిడి, ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 14 ; ఆసిఫాబాద్ మండలం లోని గుండి  గుడిగూడి గ్రామనికి కరెంట్ ఇపించాలని స్థానికులు విద్యుత్  అధికారులను కోరుతున్నారు గ్రామం లో 36 కుటుంబాల గిరిజనులు నివాసం ఉంటున్నారని విద్యుత్ కనెక్షన్  లేక అనేక ఇబ్బదు లు పడుతూ మున్నారని గత సంవత్సరం విద్యుత్ సిబ్బందికి కనెక్షన్ కొరకు డబ్బులు ఇచ్చినప్పటికీ మీటర్లు ఏర్పాటు చెయ్యలేదు అన్నారు విద్యుత్ కనెక్షన్ కోసం అధికారులు,సిబ్బంది చుట్టూ తిరిగిన పట్టించు కోలేదు అన్నారు కులి పని చేసె  జీవించే గిరిజనుల వద్దనుండి డబ్బులు తీసుకుని విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయకపోవడం తో ఆర్థికంగా నష్టపోయారని వెవ్వడించారు ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి తమ గ్రామానికి వెంటనే విద్యుత్ కనెక్షన్ ఇప్పించాలని కోరుతున్నారు లేని యడల ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని అన్నారు.