చట్ట బద్ధత కల్పించకనే విఅర్ఎస్ ఉద్యోగాలలో గంధర గోళం.
ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి
కొమరంభీం ఆసిఫాబాద్ ఉదయం ప్రతినిధి 22; టిబిజికెఎస్ వారసత్వ ఉద్యోగాల పైన చట్ట బద్ధత ఒప్పందము చేసుకోక పోవడం వలెనే విఆర్ఎస్ అమలు పరచడంలో గంధరగోళం తలెత్తిందని,దీని వలన సింగరేణి కార్మికులు తీవ్ర ఆందోళనకు గురిఅవుతున్నారని, ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యాదర్శి ఎస్.తిరుపతి ఆరోపించారు. బుధవారం నాడు గోలేటిలోని కెఎల్ మహేంద్ర భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యాం, గుర్తింపు సంఘం అయిన టిబిజీకేఎస్ లు కుమ్మక్కయ్యి.మరోసారి కార్మికులకు ద్రోహం తలపెట్టే విధంగా,మీరు సర్క్యూలర్ ఇవ్వండి,మేము అమలు కాకుండా చూస్తామని టిబిజీకేఎస్ యాజమాన్యంతో ఒప్పందము చేసుకుందని అన్నారు.ఎదో ఒక నెపంతో ఉద్యోగాలు ఆపాలని యాజమాన్యం చూస్తుందని అన్నారు. జిక్త నాలుగు సంవత్సరాలుగా టిబిజీకేఎస్ కార్మికులకు చేసింది ఏమి లేదని, కార్మికులు నిరాశ, నిస్పృహాలతో ఉన్నారని అన్నారు. గతంలొ విఆర్ఎస్ సర్క్యూలర్ వచ్చినప్పుడే ఐ.డి ఆక్ట్ 12-3 అగ్రిమెంట్ చేయాలనీ ఏఐటీయూసీ గతంలోనే డిమాండ్ చేసిందని గుర్తు చేసారు.ఈ ఒప్పందం చేసుకొని ఉంటె ఎన్ని అడ్డంకులు ఎదురైన ఏమి కాదని విఆర్ఎస్ అమలు అవుతుందని అన్నారు.చట్టాలు తెలియని నాయకులు టిబిజికెఎస్ లో ఉండడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయాని అన్నారు.అంతర్గత కుమ్ములాటలతో టిబిజికేఎస్ కార్మికుల హక్కులను నాలుగు సంవత్సరాలుగా హరించి,ఇప్పుడు మోసపూరితంగా విఆర్ఎస్ సర్కులర్ పేరిట ఎన్నికల లబ్ధి కోసమే తెరాస,టిబిజీకేఎస్ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా వారసత్వ ఉద్యోగాల అమలు Aకోసం 12-3 అగ్రిమెంట్ చట్ట బద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. వారసత్వ ఉద్యోగాల కోసం ఉద్యమాలు, ఆందోళనలు చేపడుతామని, అవసరం అనుకుంటే సమ్మెకు సిద్ధమేనని హెచ్చరించరు. ఈ సమావేశంలో ఆర్గనైజింగ్ కార్యదర్శులు దివాకర్ రావు,జూపాక రాజేష్,నాయకులు మారం శ్రీనివాస్,సురేష్ కోరి,గట్టు లక్ష్మణ్, లక్షేట్టి పోచమళ్ళు,రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment