కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 4 ; బెల్లంపల్లి ఏరియా లోని ఒసి 2 నుండి ఎస్ టిపిపి కోల్ యార్డ్ కు అలాగే ఖైర్గుడా ఓపెన్ కాస్ట్ నుండి ఎస్ టిపిపి జైపూర్ కు బొగ్గు తరలించుటకు నాలుగు నెలల పాటు బొగ్గు రవాణా చేయుటకు టెండర్లు ప్రకటించడం జరిగిందని బెల్లంపల్లి డిజిఎం పర్సనల్ జె చిత్త రంజన్ కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖైర్గుడా ఓపెన్ కాస్ట్ నుండి బంకర్ ఆర్ కెపి సిహెచ్ పి కి 3నెలల పాటు బొగ్గు రవాణా చేయుటకు టెండర్లు ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఈ టెండర్ కు సంబంధించిన ఫారాలు జీఎం కార్యాలయం లోని పూర్చసే డిపార్ట్మెంట్ లో లభించునని, మరిన్ని పూర్తి వివరాలకు సంప్రదించాలని కోరారు.
No comments:
Post a Comment