Monday, 13 February 2017

కుల వృత్తులను ఆదుకుంటాము

కుల వృత్తులను ఆదుకుంటాము         
           యాదవ శంఖారావంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్




కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 12 ; తెలంగాణాలో నిర్వీర్యమైన కులవృత్తులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధాక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు .ఆదివారం నాడు జిల్లాలో నిర్వహించిన యాదవ శాంఖరావం మహ సభకు అయన మరో ఇద్దరు మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డీలతో కలిసి  ముఖ్య అతిధిగ హాజరు అయ్యారు.అంతక ముందు యాదవ సంఘ నాయకులూ మంత్రులకు గుస్సాడి, డప్పు వాయిజ్యాలతో గణ స్వాగతం పలికారు.ఈ సందగర్బంగా యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు అరిగెల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన మహా సభలో మంత్రి తలాసాని మాట్లాడుతూ బిసీలు ఆర్ధికంగా ఎదిగి సమాజనికి దశ దిశ గ మారాలని అన్నారు.అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని,గత ప్రభుత్వాలూ గొల్ల కుర్మ లను నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు.కుల వృత్తులను అభివృద్ధి చేయడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ కంకణం కట్టకున్నారని అన్నారు.గొల్ల కుర్మల సంక్షేమానికి తెరాస ప్రభూత్వం ఎన్సిడిపి కింద 400 రూపాయాలా కోట్లు ముంజూరు చేయడం జరిగిందని, ఇంకా అవసరం అయితే 2 కోట్లు ఇచ్చేందుకు సిధ్దముగా ఉన్నామని అన్నారు.గొర్రెలను మన రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాల నుండి కొనుగోలు చేస్తున్నామని అన్నారు.గొర్రెలకు ఇన్సురెన్సు ప్రీమియం కూడా మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.గొర్రెల  కాపర్లు ప్రమాదవశాత్తు మృత్యు వాత పడితే ఆరు లక్షల రూపాయల ప్రమాద భీమా కల్పిస్తామన్నారు. గొర్రెల పెంపకం రూణాల కోసం గొల్ల కుర్మలు సంఘాలుగా ఏర్పడి ప్రతి ఒఇక్కారు సభ్యత్వం తీసుకోవాలని కోరారు.ప్రతి నియోజకవర్గంలో పశువుల వైద్యం కొరకు ఏప్రిల్ మాసంలో సంచార వైద్య శిబిరాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని,దీని కోసం  100 వాహనాలు కొనుగోలు చేస్తామని వెల్లడించారు. బీసీల విద్యాభివృద్ధికి రాష్ట్రంలో 119 బిసి గృహాలను నియోజకవర్గానికి ఒక్కటి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.60 సంవత్సర సీమాంద్ర పాలనలో జరగని ఆభివౄధ్ది తెలంగాణ రాష్ట్రములో రెండున్నార సంవత్సరాల కాలంలో జరుగుతుందని అన్నారు. కుల వృత్తుల పై ఆధారపడి జీవించే ప్రజల అభివృద్ధి కోసం తెరాస ప్రభుత్వం నిరంతరం వెన్నంటి ఉంటుంది. ఉద్యోగ నియామకల పై కోదండరాం దొంగల పార్టీ అయినా కాంగ్రెస్, టీడీపీ లతో చేయి కలిపి ప్రభుత్వం పై బురద జల్లుతున్నాడని, రాష్ట్రo లో అన్నీ ప్రభుత్వ శాఖల్లో ఖాలీ గా ఉన్న  పోస్టు లను తెలంగాణ పబ్లిక్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తాం. గొర్రెల పెంపకం కొసం 400 కోట్ల నిధులు కేటాయించి అమలు కోసం పూర్తి స్థాయి లో విధి విధానాలు ఏర్పాటు చేశామని, కొత్త జిల్లాల లో సిబ్బంది కొరత ఉంది త్వరలోనే పూర్తి స్థాయి లో నియామకాలు చేపట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ గత ప్రభుత్వాలూ బీసీలను పూర్తిగా అట్టడుగు వర్గానికి చేరవేశారని,బిసీ ల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని మాట్లాడారు.ఈ సభలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ,దేవాదాయ శాఖ మంత్రి ఆళ్ళ ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ యాదవ సమాజాన్ని ఉద్దరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని అన్నారు.మన తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పెంపకం ద్వారా మాంసం ఇతర దేశాలకు ఎగుమతి కావాలని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారని,పేద,బడుగు వర్గాల ప్రజల కోసం రెండు పడక గదుల ఇళ్ళను ఖచ్చితంగా నిర్మిస్తామని అన్నారు.ప్రతి నియోజకవర్గానికి 1500 ఇళ్లను ఇస్తున్నా ఘనత సీఎం కేసీఆర్ కె చెందుతుందని అన్నారు.అదే విదంగా ఆదిలాబాద్ ఎంపీ గెడం నగేష్,ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్,ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి,కోనేరు కొనప్ప,అంజన్న యాదవులు,యాదవ సంఘము జిల్లా అధ్యక్షులు అరిగెల నాగేశ్వర్ రావు యాదవ్,రాష్ట్ర మేకల పెంపకం చైర్మెన్ కే.రాజన్న యాదవ్ లు సభను ఉద్దేశించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మురళి యాదవ్,సునిత, యాదవ కులస్తులు తెరాస కార్యకర్తలు హాజరయ్యారు.

No comments:

Post a Comment