Saturday, 4 February 2017

విద్యార్థులకు చట్టాలపై అవగాహన

విద్యార్థులకు చట్టాలపై అవగాహన

  కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 4  ;  కోంరంభీం ఆసీఫాబాద్ జిల్లా కేంద్రంలో ని మాత్రుశ్రీ కళాశాలలో శనివారం చట్టాలపై ఆర్.టిఐ కంపెజెనెర్ ట్రైనర్   ఎం.డి సాధిక్ హుసేన్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎం.డి సాధిక్ హుసేన్ మాట్లాడుతూ  సమాచార హక్కు చట్టం తో పాటు వివిధ చట్టాలపై విద్యార్థులకు అవగాహన ఉండలని అయన అన్నారు. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని దానిని అందరు వినియోగించుకోవాలని అదే సమాచార హక్కు చట్టమని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరి వినియోగించుకోవచ్చని సూచించారు.  విద్యార్థులకు మౌలిక చట్టాలపై అవగాహన ఉంటె ఫై చదువులకు దోహద పడుతుందని పేర్కొన్నారు. ఇలా చట్టాలపై అవగానే కల్పిస్తే విద్యార్థులు పెడదారిన పడకుండా  సన్మార్గంలో నడుచుకుంటూ ఫై స్థాయిలకు చేరుకుంటారని అన్నారు. అందుచే అవగాహన కార్యక్రమాలను చేపడుతూ విద్యార్థులలో మేద స్థాయిని పెంపొందిస్తున్నామని  తెలిపారు .  ఈ సమావేశం లో ఉపాధ్యాయుల బృందం , విద్యార్థులు తదితరులుఉన్నారు.

No comments:

Post a Comment