జాతరకు ముస్తాబైన గంగాపూర్ ఆలయం
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 8 ; రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ శివారులోని బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 09 నుండి11 వరకు జాతర నిర్వ హించుచున్నారు . ఈ మేరకు అధికారులు పనులు ఏర్పాటు చేసారు. గంగాపూర్ జాతర ఏర్పాట్లను స్పెషల్ ఆఫీసర్ పాండురంగపర్యవేక్షిస్తున్నారు రెబ్బన సి ఐ మదన్ లాల్ , ఎస్.ఐ దారం సురేష్ ఆలయ ఈ .ఓ .బాపిరెడ్డి లనుపూర్తి ఐన పనులపై అడిగి తెలుసుకున్నారు ప్రతి ఎటా మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మూడు రోజుల పాటు జాతర నిర్వహించనున్నారు.ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.అదివారం కళ్యాణ మహోత్సవాన్ని జరిపేOదుకు అన్ని ఏర్పాట్లు చేసామని ఆలయ ఈ .ఓ .బాపిరెడ్డి తెలిపారు . ఈ నెల 10 న మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సాయంత్రం 5 గంటలకు రథోత్సవం నిర్వహిస్తారు . ఉత్సవ విగ్రహాలను అలంకరించి రథంఫై ఊరేగిస్తారు. భక్తుల సౌకర్యలకోసం ఆసిఫాబాద్ ,మంచిర్యాల డిపోల నుంచి ఆ ర్ . టి . సి . అధికారులు ప్రత్యేక బస్సు లను ఏర్పాటు చేస్తున్నారు .జాతరలో అలాంటి వ్యాధులు ప్రబలకుండా రెబ్బన ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యక ఏర్పాట్లు చేయనున్నట్లు వైద్యాధికారి సంతోష్ సింగ్ తెలిపారు అత్యవసర వైద్యసేవలు 108 ఆధ్వర్యం లో ఉంచుతున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment