Wednesday, 22 February 2017

ప్రొఫెసర్ కోదండ రామ్ అరెస్ట్ అప్రజా స్వమికం ; టి వి వి జిల్లా ఉపాధ్యక్షులు

ప్రొఫెసర్ కోదండ రామ్ అరెస్ట్ అప్రజా స్వమికం ; టి వి వి  జిల్లా ఉపాధ్యక్షులు 

కొమరంభీం ఆసిఫాబాద్ ఉదయం ప్రతినిధి 22;   ప్రొఫెసర్ కోదండ రామ్ ను అర్ధరాత్రి  అరెస్ట్ చేయటం  అప్రజా స్వామిక   అని  టి వి వి జిల్లా ఉపాధ్యక్షు దేవేందర్ అన్నారు. బుధవారం రెబ్బెన లో ఏర్పాటు చేసిన సమావేశం అయన మాట్లాడారు నిరుద్యోగుల నిరసన ర్యాలీకి భయాలు దేరిన విద్యార్థులను, విద్యార్థి సంఘ నాయకులను , విద్య వంతులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య దేశం లో హేయమైన  చర్య. విద్యార్థులు విద్యవంతులు టీజె ఏ సి తెలంగాణ ఉద్యమ సమయంలో శాంతియుతంగా చేసిన ర్యాలీలు పోరాటాల ఫలితంగానే ఈ ప్రభుత్వం మంత్రులు గద్దెనెక్కి ఇప్పుడు అసాంగిక శక్తులనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.  సామజిక తెలంగాణ కోసం టీ.జె.ఏ.సి,   టి.వి. వి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధమని మండల అధ్యక్షులు వనమాల నవీన్ కుమార్ ప్రధాన కార్యదర్శి జాడి జ్ఞానేశ్వర్, మండల్ ఉపాధ్యక్షులు ఎస్ అనిల్ కుమార్ తెలిపారు. 

No comments:

Post a Comment