Thursday, 16 February 2017

నులి పురుగుల నివారణ మాత్రల పంపిణి

నులి పురుగుల నివారణ మాత్రల పంపిణి
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 16 ;  జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్బంగా గురువారం రోజున రెబ్బెన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల  విద్యార్థులకు నులి పురుగు నివారణ మాత్రలు వేశారు.ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సుబ్బరాయుడు హాజరు అయ్యి విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలు అందించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు చిన్న పిల్లలకు,విద్యార్థులకు నూలిపురుగుల మాత్రలు వేయించడం వలన రక్తహీనత,సంపూర్ణ శారీరక, మానసిక అభివృద్ధికి దోహదపడుతుందని నులి పురుగుల ఓ పరాన్న జీవి అని అన్నారు. ఇది మనుషుల పేగుల్లో నుంచి పోషకాలను గ్రహిస్తాయని  ఇవి చిన్నారుల పాలిట అత్యంత ప్రమాదకరమైన ప్రాణులని, మొదట ఏలిక పాములుగా పుట్టి, నులి పురుగులుగా ఎదిగి, కొంకి పురుగులుగా మారుతాయి. ఇలా మూడు దశల్లో వ్యాప్తి చెందే  పురుగులు ఆరోగ్యాన్ని హరిస్తాయిన్నారు  ప్రతి పాఠశాలలో, అంగన్వాడి కేంద్రాలలో  తప్పని సరిగా  నులిపురుగు  మాత్రలను పిల్లలకు వేయాలని, 1 సం,, నుంచి 3 సం,,  పిల్లలకు సగం మాత్ర  వేయాలని అదేవిధంగా  3 సం,, నుంచి 19 సం,, పిల్లలకి  ఒక్క మాత్ర వేయాలని అన్నారు. భోజనం చేసిన అరగంట  తరువాత మాత్రను సప్పరించాలని అన్నారు.ప్రత్యేకంగా  శిక్షణ  పొందిన కార్యకర్తలచే  మందులు వేయించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి సుందర్రావు,రెబ్బెన ప్రభుత్వ వైద్యాధికారి సంతోష్  సింగ్,మండల విద్యాధికారి వెంకటేశ్వర స్వామి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత,వైద్య సిబ్బంది,ఉపాద్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment