Monday, 27 February 2017

సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు ఎంతో అవసరం

సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు ఎంతో అవసరం 
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 27 ;  సాంకేతిక పరిజ్ఞానం ఈ ఆధునిక యుగంలో విద్యార్థులకు ఏంతో  అవసరం అని తహసిల్ధార్ రమేష్ గౌడ్ అన్నారు.సోమావారంనాడు రెబ్బెన జడ్పీ స్కూల్ విద్యార్థులు ఏర్పాటు చేసిన  సైన్స్ ఫెర్ ను ఆయన సందర్శించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే మంచి లక్షణాలు  ఏర్పడే విధంగా ,ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు.విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆయన  అన్నారు.ఈ సైన్స్ ఫేర్ లో ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత,ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment