Wednesday, 22 February 2017

సింగరేణిలో గిరిజన కార్మికులకు గుర్తింపు తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్యం ; ఎమ్ఎల్ సి రాములు నాయక్

సింగరేణిలో గిరిజన కార్మికులకు గుర్తింపు తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్యం ; ఎమ్ఎల్ సి  రాములు నాయక్


కొమరంభీం ఆసిఫాబాద్ ఉదయం ప్రతినిధి 22; సింగరేణిలో గిరిజన కార్మికులకు గుర్తింపు తెలంగాణ ప్రభుత్వం లోనే జరుగుతున్నదని గత ప్రభుత్వాలు సింగరేణి గిరిజన కార్మికులను ఎలాంటి గుర్తు\యింపుని ఇవ్వకుండా పెడతోవను పెట్టారని ఎమ్మెల్సీ  ఆన్నారు .  రెబ్బెన మండలంలోని గోలేటిలో సింగరేణి గిరిజన నూతన భావన ప్రారంభానికి కొమరంభీం జిల్లా కలెక్టర్ చంపాలాల్, ఎంఎల్ ఏ కోవ లక్ష్మి, హాజరయ్యారు మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు అనంతరం  శిలా పలకాన్ని ఆవిష్కరించి ఏర్పాటు చేసిన సభలో సింగరేణి గిరిజనులకు సంభందించిన కల సూచికను విడుదల చేసారు. అనంతరం రాములు నాయక్ మాట్లాడుతూ గిరిజన కార్మికుల సమస్యలు ఏమైనా ఉంటె వాటిని తెలిపినచో కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు.  సింగరేణి లో 9.91%   ఉద్యోగాలు అమలు కావాల్సి ఉండగా 6శాతం మాత్రం మే అమలు చేయడాం తో గిరిజనులు నష్టపోతున్నారని సమతా తీర్పు ప్రకారం 650ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయాలన్నారు. సింగరేణి లాభాలలో  కార్మికులకు 26శాతం వాటాను గిరిజనులకు కేటాయించాలన్నారు. కొమరంభీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ మాట్లాడుతూ ఏ సంఘాలైనా సమిష్టిగా కృషి చేస్తే ఎలాంటి సమస్యలు తలెత్తవని అయన అన్నారు . ఏదైనా సమస్యలో ఉంటె ఆయన దృష్టికి తీసుకురావలనన్నారు. ఈ కార్యక్రమంలో ,ఆర్డిఓ షంనాయక్, ,సింగరేణిజిఎం రవిశంకర్, జెడ్పిటీసి బాబూరావ్,  ఏఎంసి వైస్చేర్మెన్ కుంధారపు శంకరమ్మ, సిఐ మదన్ లాల్ ,గోలేటి సర్పంచ్ తోట లక్ష్మణ్ టీఆర్ఎస్ మండలఅధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి ,ఎంపిటీసి మురళిబాయ్,టీపిజికెఎస్ నాయకులూ సదాశివ్,ఏఐటీయూ నయకులు ఎస్ తిరుపతి,  బి. భద్రు, జాదవ్,రాజయ్య, అడ్వైజర్, అరవిందనాయక్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment