ఆరోగ్యకేంద్రం అభివృద్ధికి అందరూ సహకరించాలి
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 13; రెబ్బెన ప్రాథమిక ఆరోగ్యకేంద్రం అభివృద్ధికి అధికారులలు,నాయకులూ,వ్యాపారులు అందరు సకరించాలని ఎం పి పి సంజీవ్ కుమార్,జెట్ పి టీ సి బాపూరావు అన్నారు. స్థానిక ఆరోగ్యకేంద్రం లో సోమవారం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి డాక్టర్ సంతోష్ సింగ్ ఎనిమిది లక్షల 80వేల రూపాయలతో మరమత్తులు చేయించి కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా సేవలు అందించడానికి అభివృద్ధి చేశాం అన్నారు. దీనికి గాను సంబంధిత శాఖనుండి రెండు లక్షల రూపాయలు జమ అయ్యాయని అన్నారు, మండలం లోని అందరు సమకూర్చినట్లయితే ఆరోగ్య కేంద్రం లో మరింత సేవలు అందించడానికి వీలుగా ఉంటుంది అన్నారు, దీనికి గాను ఎం పి పి సంజీవ్ కుమార్ 35వేలు విరాళం అందచేశారు, మండల కో అప్సన్ సబ్బుడు జాకీర్ ఉస్మాని 29వేలు రూపాయలు,టి ఆర్ స్ నాయకులూ సోమశేఖర్ 10వేలు రూపాయలు, గొల్లేటి ఎం పి టి సి వనజ 5వేలు రూపాయలు విరాళం అందచెశారు. డాక్టర్ సంతోష్ సింగ్ చిన్ననాటి మిత్రులు తిరుపతి,సురేందర్ రాజ్, కిషన్ గౌడ్,రజినీకాంత్ రెడ్డి, సాగర్ తదితర మిత్రులు 50వేలు రూపాయల చెక్కుని విరాళంగా అందచేశారు. అలాగే టి ఆర్ స్ నాయకులూ నవీన్ కుమార్ 11వేల 11వందల 11రూపాయలు,జి చక్రపాణి 11వేలు రూపాయలు, తోట సుధాకర్ 20 వేలు రూపాయలు త్వరలోనే అందచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎం పి డి ఓ సత్యనారాయణ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment