Saturday, 11 February 2017

భక్త జనముతో పోటెత్తిన గంగాపూర్ జాతర

భక్త జనముతో పోటెత్తిన గంగాపూర్ జాతర 
కనుల పండువగా రథోత్సవం 

భక్త జన సంద్రంతో పోటెత్తిన గంగాపూర్

మాఘ శుద్ధ పౌర్ణమి సంధర్బంగా శుక్రవారం నాడు కుమురం భీమ్ జిల్లా రెబ్బెన మండలం గంగపూర్ లో గల శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామీ జాతర భక్తజన సంద్రోహం మధ్య ఘనంగా జరిగింది.ప్రతి ఏట నిర్వహించే ఈ జాతరకు భక్తులు భారీ సంఖ్యాలో పాల్గొన్నారు.భక్తుల సౌకర్యర్ధం ధర్మ దర్శనము,ప్రత్యేక దర్శనము, విఐపి దర్శనములు ఏర్పాటు చేశారు.

 భారీ సంఖ్యలో భక్తులు వచినందున స్వామీ వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టినది.

స్వామీ వారిని దర్శించుకునేందుకు కుమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా పాలనాధికారి చంపాలాల్ దంపతులు, ఉమ్మడి జిల్లా ఏమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్  ,అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిలకు ఆలయ కమిటి పూర్ణ కుంభలతో భారీ స్వాగతం పలికారు.మండలంలోని వివిధ వ్యాపారులు కలిసి భక్తుల సౌకార్యార్ధం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 

అదే విధంగా త్రాగునీటి సమస్య ఏర్పడకుండా వివిధ స్వచ్చంధ సంస్థలు,జిల్లా గ్రామీణ నీటి సరఫరా సంస్థ ఆధ్వర్యంలో  త్రాగు నీరు అందించారు.జిల్లా అటవీ శాఖ అద్వర్యంలో జాతర పరిసర ప్రాంతం లో మొక్కలు పెంపకం,ఆవశ్యకతను తెలుపుతూ,భక్తులకు ఉచితంగా మొక్కలు పంపిణి చేశారు.

వైద్య ఆరోగ్య శాఖ మరియు రెబ్బెన ప్రభుత్వ వైద్యాధికారి సంతోష్ సింగ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. 





వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారు.



 జాతరకు హాజరైన జిల్లా పాలనాధికారి,ఏమ్మెల్సీ,ఎమ్మెల్యే లు మాట్లాడుతూ బాలాజీ వేంకటేశ్వర స్వామి దేవాలయం చాల పురాతన చరిత్ర కలిగినదని,తెలంగాణ తిరుపతి గ గంగపూర్ బాలాజీ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు.గత సంవత్సరం ఆలయా అభివృద్దుకి కేటాయించిన నిధులను విడుదల చేసి ఆలయ అభివృద్ధిని వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సంధర్బంగా ఆలయ కమిటీ ఆద్వర్యం లో పాలనాధికారి, ఎమ్మెల్సీ,ఎమ్మెల్యేలను శాలువలు కప్ప సన్మానించారు.జాతరకు హాజరైన భక్తులు మాట్లాడుతూ సౌకర్యాలను మరింత మెరుగు పరచాలని, గంగపూర్ ను పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరారు.అదే విధాంగ రెబ్బెన నుండి గంగపూర్ వెళ్లే తారు రొడ్డును రెండు వరసలా రహదారిగా నిర్మించాలని అన్నారు.జాతరలో ఏర్పాటు చేసిన రంగులరట్నం,వివిధ ఆటలు భక్తులను ఆకట్టుకున్నాయి.జాతరలో ఏలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండ అసిఫాబాద్ డిఎస్పీ భాస్కర్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు.కాగా జాతరలో విద్యుత్తు, సీసీ కెమెరాలను సింగరేణి సంస్ధ బెల్లంపల్లి జీఎం రవిశంకర్ ఏర్పాటు చేయించారు.వీరితో పాటు అసిఫాబాద్ ఆర్డీవో జాతర ఇంచార్జి పాండురంగానాయక్,తహసిల్ధార్ రమేష్ గౌడ్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment