విద్య పరిరక్షణ గోడ ప్రతుల ఆవిష్కరణ
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి9 ; విద్యా పరిరక్షణను కోరుతూ గురువారంనాడు రెబ్బెన అతిధి గృహ ఆవరణ ఈ నెల జిల్లాకు రానున్న బస్సు జాత పోరాట యాత్ర పోస్టర్లను విడుదల చేశారు. విద్యరంగంలో ప్రైవేటీకరణ,కాషాయీకరణను ఉపసంహరించుకోవాలని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ అన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా ఉపాధ్యాక్షులు దేవేందర్ లు డిమాండ్ చేశారు.అనంతరం నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి,రాష్ట్రంలో టీ ఆర్ ఏస్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక విద్యారంగంలో విద్యా ప్రైవేటీకరణ కాషాయీకరణగా మారుతుందని అన్నారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును విరమించుకొని,ఉన్న విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలని,విద్యారంగంలో ప్రైవేటీకరణ,కాషాయీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో తరగతికి ఒక గది,తాగునీటి వసతి,మూత్రశాలలు,మరుగుదొడ్లు కల్పించాలని,రాష్ట్ర ప్రభుత్వం రిలయన్స్ సంస్థ విద్యాసంస్థకు స్థాపన కొరకు భూమిని ఇవ్వకూడదని,రిజర్వేషన్లు లేని ప్రవేశాల కొరకు చట్టాన్ని చేయకూడదని,విద్యారంగంలో రిలయన్స్ను గాని మరొక ప్రైవేట్ సంస్థనుగాని అనుమతించకూడదని,విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో 30% నిధులను,కేంద్ర ప్రభుత్వం జిడిపిలో 6% నిధులను కేటాయించాలని,కెజి నుండి పిజి వరకు ఉచిత విద్యను వెంటనే అమలు చేయాలని,దళితులు,ఆదివాసులు,ముస్లింలు,స్త్రీలు తదితర వెనుకబడిన వర్గాలకు చెందిన వారు సెకండరీ స్థాయిని దాటి పై చదువులు చదవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సహయక చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక మండల అధ్యక్షుడు నవీన్,ఎఐఎస్ఏఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయి కిరణ్,మండల కార్యదర్శి పర్వతి సాయి,నాయకులు సంతోష్, కార్తిక్,రమేష్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment