విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి
ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కే.వెంకటేశ్వర్
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 27 ; రెబ్బెన మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారంనాడు వీడ్కోలు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్తులు శ్రద్ధతో చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించి,ఉన్నత శికరాలకు ఎదగాలని అన్నారు.విద్యార్థులు అధ్యాపకుల సూచనలు,వారి సలహాలను విద్యార్థులు తూచా తప్పకుండ పాటించాలని అన్నారు.ప్రభుత్వ జూనియర్ కళాశాల 2001వ సంవత్సరంలో ప్రారంభమైందని అప్పుడు అరకొరగా వస్తహుల మధ్య కాలేజీ నడిచిందని,25మంది విద్యార్థులతో మొదలు అయినా సరైన ఫలితాలు లేనప్పటికీ,అధ్యాపక బృందం కృషి వల్ల ఫలితాలు మెరుగు పడ్డాయని అభిప్రాయపడ్డారు.ఈ విద్య సంవత్సరంలో 770 మంది విద్యార్థులు ఉండగా 670మంది పరీక్షా ఫీజును చెల్లించారని ఏది కొమురంభీం జిల్లాలోనే పెద్ద సంఖ్య అని అన్నారు.వచ్చే విధ్య సంవత్సరం కల్లా కళాశాలను పక్క భవనంలోకి తరలించి మరింత నాణ్యమైన విద్యను అందజేస్తామని పేర్కొన్నారు.అదే విధంగా రెబ్బెన తహశీల్ధార్ రమేష్ గౌడ్ విద్యార్థులను ఆదేశించి ప్రసంగించారు.కొందరు సీనియర్ మరియు జూనియర్ విద్యార్థులకు కూడా మాట్లాడారు.ఈ సందర్బంగా విద్యార్థిని, విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలతో అలరింపజెసారు.జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులకు వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమంలో సిర్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ సుమన్,రెబ్బెన జడ్పీ స్కూల్ ప్రాధానోపాధ్యాయురాలు స్వర్ణలత,కళాశాల అధ్యాపక బృందం ప్రకాష్, శ్రీనివాస్,రామారావు,అమరేందర్,గంగాధర్,ప్రవీణ్,శాంతకూమారి,అతీయ ఖానామ్,మల్లేశ్వరి,మంజుల,సుమలత,నిర్మల,సంధ్య,వరలక్ష్మి,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment