సేవ ధ్రుపదంతో భోజనం ఏర్పాట్లు
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 20 ; ఆసిఫాబాద్ లో ఆర్ ఆర్ ఎస్ స్వచ్ఛంద సేవ సంస్థ వారు ప్రజా ఫిర్యాదుల విభాగం రోజున కలెక్టర్ కార్యాలయంకు వచ్చే వారికి ఐదు రూపాయలకె భోజనం సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమనికి అన్నదాతగా గుండి ఏం పి టి సి రవీందర్ ఆద్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలు తమ సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చెందుకు దూర ప్రాంతాల నుండి వస్తారని వారికి భోజన సౌకర్యం కల్పిస్తున్నమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఆర్ ఎస్ సంస్థ సభ్యులు పవన్, సంతోష్, నగేష్, ప్రతాప్, నరేష్, శ్రీనివాస్, రమేష్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment