Thursday, 9 February 2017

వ్యాధి భారిన పడిన మేకలను పరిశీలించిన జెడి సురేష్

వ్యాధి భారిన పడిన మేకలను పరిశీలించిన జెడి సురేష్ 

 వాంకిడి ;  కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి9  ;  వాంకిడి మండలంలో కిరిడి  గ్రామానికి చెందిన దుర్గం దినాకర్ కు  చెందిన మేకలు అంతుపట్టని  వ్యాధి భారిన పడి మృతి చెందడంతో స్థానిక పశు వైధ్యాధికారి నిర్లక్ష్యంతోనే మృతి  చెందాయని ఆయన  పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం రోజు  కలెక్టర్ చంపాలాల్ కు వినతి ఇవ్వగా స్పందించిన కలెక్టర్ మేకలు మృతి చెందిన తీరును పరిశీలించాలని ఆసిఫాబాద్ పశుసంవర్ధక శాఖ జేడీ సురేష్ ను కలెక్టర్ ఆదేశించగ గురువారంనాడు ఆయన పరిశీలించడం జరిగింది.వ్యాధి భారిన పడి ప్రాణలతో ఉన్న మేకలను స్థానిక పశువైధ్యాధికారితో కలసి పరిశీలించి వ్యాధి లక్షణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.మిగిలిన మేకలకు నాణ్యమైన  వైధ్యం  అందించాలని పశు వైధ్యాకారిని జెడి సురేష్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఎం.జే వినోద్ కుమార్,సర్పంచ్ అంభరావు,ఐకేపీ గ్రామా సిబ్భంది అశోక్,బుద్దిజీ తదితరులు పాల్గొన్నారు.    

No comments:

Post a Comment