కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 14 ; భాజపా జాతీయ రాష్ట్ర సమితిల పిలుపు మేరకు జిల్లాలోని అన్ని మండలలాల్లో నిధి సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని భాజపా కుమురం భీం అసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు జేబీ పౌడల్ అన్నారు.ఈ నిధి కార్యక్రమము కోసం ప్రతి మండల అధ్యక్షులకు నిధి సేకరణ పుస్తకాలను అందజేయడం జరిగిందన్నారు. ఈ నిధి సేకరణ కార్యక్రమాన్ని గతంలో ఎల్ కే అద్వానీ గారు ఆ జీవన్ సహాయోగ్ కోసం పార్టీ అవసరాలకు దీనిని ప్రారంభించారని అన్నారు.ఈ నిధి సేకరణకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ,నిధి ని విరాళంగా ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని మండలాల్లో, గ్రామాలల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోనాగిరి సతీష్ బాబు,అసిఫాబాద్,జైనూర్,కెరమెరి, వాంకిడి మండలాల అధ్యక్షులు బోనాగిరి సతీష్ సర్ల మురళి శ్రీమతి పసునూరి తిరుపతి కేంద్ర నిర్మల గుండా శంకర్వ్ డీ రాదిక జపర్తి మోండయ్యా గణేష్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment