అభివృద్ధికి ఏకీభవిస్తాం కాని పంట పొలాలను నాశనం చేస్తే ఉరుకోము
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ; రెబ్బన మండలం లోని పాత పులికుంట గ్రామానికి వెళ్లే 800 మీటర్ల బిటి రోడ్ వేస్తుండగా స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంటిది అని వివరాలు తెలుసుకోగా ప్రధాన రహదారి నుంచి పాత పులికుంట కు వెళ్ళేరోడ్డు మార్గంలో బిటి రోడ్ కోసం మొరం మట్టి తెచ్చి పోయవలసి ఉండగా ఆలా చేయకుండా రోడ్డు కి ఇరువైపులా ఉన్న పట్టా భూముల్లో మట్టి తీసి రోడ్డుకి పోస్తున్నారని, ఆలా మట్టి తీయడం వాళ్ళ పొలాలో పంటలు పండించడానికి అనువుగా లేదని అడిగితే చదును చేసి ఇస్తాం అన్నారు. సదరు కాంట్రాక్టర్ లాభాలు గడించాలని దురాశతో దూరం నుంచి తీసుకు రావలసిన మొరం మట్టిని పంట పొలాల్లో తీయడం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నిస్తున్నారు ఈ భాగోతం అంత అధికారుల కను సైగల్లోనే జరుగుతున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికీనా ఉన్నత అధికారులు ఈ వ్యవహారాన్ని గమనించి తమకు న్యాయం చేకూర్చాలని కోరారు. అభివృద్ధికి ఊరు మొత్తం కలిసి ఏకీభవిస్తాం కానీ రైతుల పొలాల్లో పంటలు పండకుండా చేస్తే ఉరుకోము అన్నారు.
No comments:
Post a Comment