మేరు కులస్థుల సమస్యలు పరిష్కరించాలని తహసీల్ధార్ కు వినతి
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 28 ; మేరు కులస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారంనాడు రెబ్బన తహసిల్ధార్ బండారి రమేష్ గౌడ్ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సంధర్బంగా మేర సంఘం మండల అధ్యక్షులు బొమ్మోనేని శ్రీధర్ కుమార్,ప్రధాన కార్యదర్శి రాయిల్లా నర్సయ్యలు మాట్లాడుతూ రెబ్బన మండలంలో సుమారు 60 కుటుంబాలు ఉన్నాయని,వారికీ జీవనం కష్టతరంగ మారిందని రెక్క అడితేనే డొక్కా ఆడే పరిస్థితి ఉందని,ప్రభుత్వం తరుపు నుంచి మేర కుల ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలని,అలాగే 50 సంవత్సరాలు దాటినా ప్రతి ఒక్కరికి పింఛన్ ఇవ్వాలని అన్నారు.కుల వృత్తి చేసుకొని జీవనం గడిపేవారికి ఉచితంగా కుట్టుమిషిన్ లు పంపిణి చెయ్యాలని డిమాండ్ చేశారు.ప్రతి కుటుంబానికి 10 లక్షల వడ్డీ లేని రుణాలను ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో నరేష్,కీర్తిమోహన్.బొమ్మినేని గిరిబాబు.రామకృష్ణ,రాపర్తి అశోక్,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment