Tuesday, 28 February 2017

వాడి వేడిగా రెబ్బెన మండల సర్వసభ్య సమావేశం

వాడి వేడిగా రెబ్బెన మండల సర్వసభ్య సమావేశం 


కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 28 ;   రెబ్బన మండల సర్వసభ్యసమావేశం మంగళవారంనాడు ఎంపిపి కార్నాథం సంజీవకుమార్ అధ్యక్షతన  జరిగింది. ఈ సమావేశం లో పలువురు ప్రజాప్రతినిధులు సమస్యల ఫై అధికారులను ప్రశ్నించారు.ఎంపీడీఓ సత్యనారాయణసింగ్  మాట్లాడుతూ గ్రామా కార్యదర్శులు ఎవరు కూడా సహకరించడం లేదని,గ్రామా స్థాయి అధికారులు సరిగ్గా పని చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు.సక్రమంగా విధులు నిర్వహించకుంటే గ్రామా కార్యదర్శులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పలువురు  సర్పంచులు,ఎంపీటీసీ సభ్యులు మాట్లాడుతూ గ్రామా కార్యదర్శులు ఎంపీడీఓ మాటనే వినడం లేదంటే ఇంకా వారు ప్రజలకు ఏ విధంగా పనులు చేస్తారని ప్రశ్నించారు.సమయానికి నిధులు రాక గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు.మండలంలో కొంతమంది ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని వారి ఫై చర్యలు తీసుకోవాలని,ఉపాధ్యాయులు సమయపాలన పాటించే విదంగా చర్యలు చేపట్టాలని కోరారు.అధికారులు ఎవరు అందుబాటు లో ఉండడం లేదని, అందరూ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండాలని అన్నారు.తహసీల్ధార్ బండారి రమేష్ గౌడ్ మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణా ను అరికట్టాలని అన్నారు. ఏవో మంజుల మాట్లాడుతూ సబ్సిడీ పథకాలకు దరఖాస్తూలు వచ్చే వాటిని పరిశీలిస్తున్నామని అన్నారు.ఎపిఓ కల్పన మాట్లాడుతూ 300000  టేకు మొక్కలు నాటేందుకు గాను సిదంగా ఉన్నాయని అన్నారు. 50 శాతం సబ్సిడీపై గడ్డి విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని పశు వైద్యాధికారి సాగర్ తెలిపారు. ఈ సమావేశం లో ఈఓ.పిఆర్డి.కిరణ్,ఏపీఎం లు వెంకటరమణ,రాజ్ కుమార్,ఆర్ డబ్ల్యు ఎస్ జెఇ , పిఆర్.జెఇ.మండల అధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment