ఈ నెల 22న ఏఐటీయూసీ జిల్లా సమావేశం
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 20 ; ఈ నెల 22 బుధవారం రోజున జిల్లా కేంద్రంలోని ఎస్టియూ భవన్ లో ఏఐటీయూసీ జిల్లా సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబాలా ఓదెలు అన్నారు.జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సమావేశానికి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్,జిల్లా అధ్యక్షులు ఎస్.తిరుపతిలు హాజరు అవుతారని పేర్కొన్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సమావేశాన్ని నిర్వహిస్తున్నామని,కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ కార్మికుల క్రమబద్దీకరణ త్వరగ చేపట్టే విధంగా ఉద్యామాలు నిర్వహిస్తామని,దానికి సంభంధించిన ఎజెండాను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.తాత్కాలిక పెన్ డౌన్ పేరిట గత రెండు సంవత్సరాల క్రితం మూసివేసిన సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపించేందుకు ఈ సమావేశంలో కార్యచరన రూపొందించి ప్రభుత్వం తెరిపించే విధంగా తీవ్ర ఒత్తిడి తీసుకొస్తామని,సింగరేణి,ఇతర ప్రభుత్వ సంస్థలలో కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహించే కార్మికులను వెంటనే క్రమబద్దీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సమావేశానికి జిల్లా కౌన్సిల్ సభ్యులు సకాలంలో హాజరు కావాలని కోరారు.
No comments:
Post a Comment