రెండవ తిరుపతిగా పేరుగాంచిన గంగాపూర్ బాలాజీ
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 7 ; నిత్య కళ్యాణo పచ్చ తోరణం గ పేరుగాంచిన శ్రీ వేంకటేశ్వరస్వామి కుమ్ర o భీమ్ అసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం లోని గంగాపూర్ గ్రామ శివారులో గల గుట్ట పై కొలువై ఉన్నాడని భక్తుల ప్రగాఢనమ్మకం . మాఘశుద్ధ పౌర్ణమి నాడు తిరుపతిలో కొలువైన భగవానుడు గంగాపూర్ కి వస్తాడని తిరుపతి లో కొన్ని గడియలు పాటు దేవస్థాన సింహద్వారాలు మూసివేస్తారని పురాణాల ప్రకారం భక్తుల ప్రగాఢ నమ్మకం.శ్రీ వేంకటేశ్వరస్వామి సతీసమేతంగా కొలువై ఉండడంతో పాటు శివాలయం ,హనుమంతుని విగ్రహలు కొలువై ఉన్నాయి కావున ఇట్టి దేవాలయం ను రెండవ తిరుపతిగా ప్రజలు భావిస్తారు. ఈ దేవాలయం 13వ శతాబ్దానికి ముందు వెలిసినది అని చారిత్రక ఆధారాల ప్రకారం గంగాపూర్ గ్రామానికి చెందిన ముమ్మడి పొతాజి విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు అతడికి శ్రీ వెంకటేశ్వరా స్వామి ఫై అమితమైన భక్తి కలిగి ఉండేది దీనితో ప్రతి ఏటా అతను తిరుమల తిరుపతి దేవస్థానానికి కాలిబాటన వెళ్లి మొక్కులు తీర్చుకునేవాడు. అతని వయస్సు ఫై బడడం తో స్వామి వారి వద్దకు వెళ్లే పరిస్థితి లేక పోవడం తో మనస్థాపానికి గురయ్యాడు దీనితో స్వయంగా శ్రీ వెంకటేశ్వరా స్వామి కనిపించి నీవు చింత చెందవలసిన అవసరం లేదని గంగాపూర్ శివారులోని గుట్టపై ప్రకృతి ఒడిలో దర్శనం ఇచ్చి వెలిసాడు అప్పటినుండి ప్రతి సంవ్సతరం మాఘశుద్ధ పౌర్ణమి కి మూడు రోజులపాటు జాతర ఘనంగా నిర్వహిస్తారు మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో రెండవ రోజును భక్తులు పవిత్ర దినంగా భావిస్తారు కొత్తగా ఏర్పాటైన కుమరంభీమ్ జిల్లాలో అతిపెద్ద జాతరగా జరగనుంది. గంగాపూర్ జాతరలో మరో ప్రత్యేక త రథోత్సవం కార్యక్రమం జాతరలో రెండో రోజున శ్రీవెంకటేశ్వర స్వామి సతిసమేతంగా రథోత్సవం నిర్వహించగా లక్షలాది భక్తులు పాల్గొంటారు . ఈ జాతరకు ఆసిఫాబాద్ మరియు మంచిర్యాల డిపోల నుండి బస్సు సౌకర్యం కలదు ఏప్పుడు లేని విదంగా జాతరను వైభవంగా నిర్వహించేందుకు జిల్లా పాలనాధికారి చంపాలాల్ ,ఎం ఎల్ సి పురాణం సతీష్ ,మ్మెల్యే కోవా లక్ష్మి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఏర్పాట్లు చేయాలనీ అదేశించారు. ఈ నెల 9నుండి 11వ తేదీ వరకు జరిగే జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
No comments:
Post a Comment