నిరుద్యోగుల నిరసన ర్యాలీకి తరలిరండి ; ఎఐఎస్ఏఫ్ ,ఎఐవైఏఫ్
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 18 ; హైదరాబాద్ లో ఈ నెల 22వ తేదిన తలపెట్టిన నిరుద్యోగుల నిరసన ర్యాలీకి విద్యార్థులు,యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ ,ఎఐవైఏఫ్ జిల్లా ఉపాధ్యాక్షులు బోగే ఉపేందర్ లు పిలుపునిచ్చారు. శనివారం రోజున రెబ్బెనలోని అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్ర పాలకుల వలన విద్యార్థులకు,యువకులకు నష్టం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యార్థులకు,యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఉద్యమాలు నిర్వహించి ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను యువకులను విస్మరించిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను అమలు చేయాలని,రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని,ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని,ఉద్యోగ నియామకాలకు సంబంధించిన జాబ్ క్యాలండర్ రూపొందించి అమలు పరచాలని,ప్రైవేట్ రంగంలోని ఉద్యోగ నియామకాలలో స్థానిక రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని,డియస్సీ వెంటనే నిర్వహించాలని నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నమని విద్యార్థులు,యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి మండల కార్యదర్శి నర్సయ్య ,ఎఐఎస్ఏఫ్ డివిజన్ కార్యదర్శి పుదారి సాయి,నాయకులు శ్రీకాంత్,సాయి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment