- మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతాలలో పోలిసులు అప్రమత్తంగా ఉండాలి ; కుమురంబీమ్ ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 26 ; మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతాలలో పోలిసులు అప్రమత్తంగా ఉండాలని కుమురంభీమ్ జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు.ఆదివారం జిల్లాలోని మండలాల సబ్ ఇన్స్పెక్టర్ లతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. సోమవారంనాడు తెలంగాణ బందుకు మావోయిస్టులు పిలుపునిచ్చిన సందర్బంగా జిల్లాలోని పోలిసులు అప్రమత్తంగా ఉండాలని అదేశించారు.పలు ప్రాంతాలలో బాంబ్ స్క్వాడ్ తో బస్ స్టాండ్ రైల్వే స్టేషను లలో మరియు అనుమానిత ప్రదేశాలలో కల్వర్ట్ లను తనిఖీ చెశారు.ఈ సందర్బముగా జిల్లా ఎస్పీ మాట్లడుతూ మవోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో నిఘా పెంచామని , సానుభూతిపరులను ముందుస్తుగా విచారిస్తున్నామని, మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.గత రెండు రొజుల క్రితం ఛత్తిస్ ఘర్ లో మావోయిస్టులు ఒక ప్రైవేటు బస్సు ను కాల్చి వేశారని, దానిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఏటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ అన్ని విధాలుగా ముందస్తు చర్యలూ తీసుకుంటున్నామని అయన తెలిపారు.ప్రాణహిత పరివాహక ప్రాంతాలతో ముందస్తు తనిఖీలు నిర్వహిస్తున్నమని ప్రజలు కుడా పోలిసులకు సహకరించాలని అయన కొరారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు వారిని అన్నీ విధాలుగా ఆదుకుంటామని,దీనిలో భాగంగానే మారుమూల ప్రాంతాలలో పోలీసులు,ప్రజలతొ మమేకమై జనమైత్రి వంటి అనేక కార్యక్రమలు చేస్తున్నామని అయన చెప్పారు.
No comments:
Post a Comment