Saturday, 18 February 2017

ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య

ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య 

కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 18 ; రెబ్బెన మండలం లో ని రాలపేట గ్రామంలో పాలడుగుల రాజేష్ కుమార్ (24) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య  చేసుకునట్లు ఏ ఎస్ ఐ దేవరాజ్  తెలిపారు.   తెలిపిన వివరాల ప్రకారం రాజేష్ పీజీ చివరి సంవస్తరం పరీక్షలు రాసినట్లు తెలిపారు . అందులో ఒక సబ్జెక్టు ఫెయిల్ అవ్వడం తో రీవాల్యూ వేషన్ కొరకు తండ్రి వెంకటేశ్వర్లను వరంగల్ కి పంపించినట్లు తెలిపారు. రెవెల్యూఏ వేషేన్ సమయం ముగియడం తో వచ్చే సంవత్సరం పరీక్షలు రాసుకోవాల్సింది అధికారులు సూచించినట్లు తెల్పినారు పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపానికి గురై  శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో తాడు తో ఉరి వేసుకొని మృతిచెందినట్లు తెలిపారు.  తండ్రి వెంకటేశ్వర్లు వరంగల్ నుండి ఇంటికి వచ్చే సరికి ఉరి వేసుకొని మృతిచెంది నట్లు తెలిపారు.  తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దారియాప్తు చేస్టున్నాము అని తెలిపారు.  సంఘటన స్థలానికి  పోలీసులు చేరుకొని కేసు పూర్వాపరాన్ని పరిశీలించారు.

No comments:

Post a Comment