ఘణం గా ముగిసినిన గంగాపూర్ జాతర
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 11 ; రెబ్బెన మండలం గంగాపూర్ లో గత మూడు రోజులుగా కొనసాగుతున్న జాతర శనివారం తో ముగిసింది .జాతర సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆసిఫాబాద్ డి ఎస్ పి భాస్కర్ ఆధ్వర్యం లో శనివారం ముగిసింది. మాఘ శుద్ధ పౌర్ణమి సంధర్బంగా మొదటి రోజున వెంకటేశ్వర స్వామి కళ్యాణం రెండవ రోజున రథోత్సవ కార్యక్రమం చివరి రోజున భక్తులు స్వామి వారిని దర్శించు కొని ప్రత్యేక పూజ లు చేయించి ముడుపులు చెల్లించారు. శుక్రవారం నాడు కుమురం భీమ్ జిల్లా రెబ్బెన మండలం గంగపూర్ లో గల శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామీ జాతర భక్తజన సంద్రోహం మధ్య ఘనంగా జరిగింది.ప్రతి ఏట నిర్వహించే ఈ జాతరకు భక్తులు భారీ సంఖ్యాలో పాల్గొన్నారు.భక్తుల సౌకర్యర్ధం ధర్మ దర్శనము,ప్రత్యేక దర్శనము, విఐపి దర్శనములు ఏర్పాటు చేశారు. అదే విధంగా త్రాగునీటి సమస్య ఏర్పడకుండా వివిధ స్వచ్చంధ సంస్థలు,జిల్లా గ్రామీణ నీటి సరఫరా సంస్థ ఆధ్వర్యంలో త్రాగు నీరు అందించారు.జిల్లా అటవీ శాఖ అద్వర్యంలో జాతర పరిసర ప్రాంతం లో మొక్కలు పెంపకం,ఆవశ్యకతను తెలుపుతూ,భక్తులకు ఉచితంగా మొక్కలు పంపిణి చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మరియు రెబ్బెన ప్రభుత్వ వైద్యాధికారి సంతోష్ సింగ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారు. జాతరలో ఏర్పాటు చేసిన రంగులరట్నం,వివిధ ఆటలు భక్తులను ఆకట్టుకున్నాయి.జాతరలో ఏలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండ అసిఫాబాద్ డిఎస్పీ భాస్కర్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు.కాగా జాతరలో విద్యుత్తు, సీసీ కెమెరాలను సింగరేణి సంస్ధ బెల్లంపల్లి జీఎం రవిశంకర్ ఏర్పాటు చేయించారు.వీరితో పాటు అసిఫాబాద్ ఆర్డీవో జాతర ఇంచార్జి పాండురంగానాయక్,తహసిల్ధార్ రమేష్ గౌడ్, ఏ మ్ సి వైస్ చాకీర్మెన్ కందరపు శంకరమ్మ పాల్గొన్నారు.
No comments:
Post a Comment