Saturday, 25 February 2017

మంచినీటి కి ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు

మంచినీటి కి ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు 
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 25 ;  రెబ్బెన మండలంలోని గోలేటి దుబ్బాగూడా గ్రామస్తులు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందికి గురౌతున్నమ్ అని శనివారం సింగరేణి రోడ్ ఫై ఖాలీ బిందెలతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు . గత పది రోజుల నుండి మంచి నీటి కి ఇబ్బందికి గురౌతున్నాం అని అన్నారు.  ఐన నాయకులు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆన్నారు. గత మూడు రోజుల క్రితం ఇలానే రోడ్ ఫై బైఠాయించి ధర్నా చేస్తే స్థానిక సర్పంచ్ తోట లక్ష్మణ్ సంఘటన స్థలనికి వచ్చి ఒక్కరోజులు నీరు అందిస్తాం అన్న హమీ తో ధర్నా ని విరమించాము కానీ మూడు రోజులు గడిచిన ఇప్పటికి మోటర్లు పనిచేయడం లేదన్నారని మహిళలు వ్యక్తం చేసారు. ఒక్క గాను ఒక్క బోరింగ్ వద్ద మహిళలు గంటల తరబడి వీచి ఉండాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత నాయకులు అధికారులు చొరవ తీసుకొని నీరానందించాలని మహిళలు కోరారు. ఈ ధర్నా ఆది లక్ష్మి ,రజిత, సాయి,రమ్య,లక్ష్మి ,నిత్మలా,రమేష్,రచన తదితరులు పాల్గోన్నారు.

No comments:

Post a Comment