Thursday, 16 February 2017

ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 16 ;  లంబాడీల ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతిని గురువారం రోజున రెబ్బెన మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రెబ్బెన సర్కిల్ ఇన్స్పెక్టర్ మదన్ లాల్,తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్ పాల్గొని ప్రభుత్వం తరుపున అధికారికంగా నిర్వహించారు.అదే విధంగా జెండాను ఆవిష్కరించి,కొబ్బరికాయలు కొట్టారు.వారు మాట్లాడుతూ ప్రజలు అహింస మార్గాన్ని ఎంచుకోవాలి సేవాలాల్ మహారాజ్ ప్రజలకు పిలుపునిచ్చారని,మానసిక పునరుత్తేజానికి మరియు శాంతికి ,ఆధ్యాత్మికత ఒక్కటే మార్గమని సూచించిన మహానియుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్,రెబ్బెన సర్పంచ్ పెసరు వెంకటమ్మ,రెబ్బెన గ్రామ రెవెన్యూ అధికారి ఉమ్లాల్,నాయకులూ దుప్ప నాయక్,అజమేరా ఆత్మ రాం నాయక్,బిక్కు నాయాక్,బలరాం నాయక్, కులస్తులు,నాయకులూ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment