Monday, 6 February 2017

ఆసిఫాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన

ఆసిఫాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన


కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 6 ; ఆసిఫాబాద్ జిల్లాలో ఈ రోజు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దేవాదాయ, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డిలు పర్యటిస్తున్నారు. బట్‌పెల్లిలోని 33/ 11 కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించడంతో పాటు కాగజ్‌నగర్‌లోని భట్‌పల్లిలో మరో రెండు 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ల ని ర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం వినయ్ గార్డెన్ లో రెండు వేల మంది రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈస్‌గాం నుంచి చౌవాడి వరకు నిర్మించనున్న డబుల్ లైన్ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. గన్నారం వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు.అక్కడి నుంచి చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద రెండు రాష్ట్రాలను కలిపే ప్రాణహితపై రూ. 56 కోట్ల తో నిర్మిస్తున్న భారీ వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం చింతలమానేపల్లి నుంచి హెట్టిగూడకు వేస్తున్న రోడ్డు పనులకు, బెజ్జూర్ నుంచి కౌటాలకు వేస్తున్న రెండు వరుసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సాయంత్రం 5 గంటలకు పెద్దవాగు, బొక్కివాగులపై వంతెన నిర్మాణ పనులు ప్రారంభిచ్చరు. కొత్తగూడ, బొంబాయిగూడ గ్రామాలకు వేయనున్న రోడ్డు పనులకు భూమి పూజ చేసరు.

No comments:

Post a Comment