Sunday, 26 February 2017

కాంట్రాక్టు కార్మికులా సమస్యలు పరిష్కారించక పోతే సమ్మెకు సిద్ధం ; ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్

కాంట్రాక్టు కార్మికులా సమస్యలు పరిష్కారించక పోతే సమ్మెకు సిద్ధం 
                                                     ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్

కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 26 ; సింగరేణి మరియు ఓపెన్ కాస్ట్ ఓబీ లలో  ఒప్పంద పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఒప్పంద కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని,లేక పోతే మార్చి రెండువ తేదీ తర్వాత సమ్మెకు సిద్ధం అవుతామని  ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. ఆదివారం నాడు ఒప్పంద కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ మండలంలోని చిర్రకుంట గ్రామంలో నిర్వహించిన ఓబీ కాంట్రాక్టు వర్కర్స్ మరియు సింగరేణి ఒప్పంద కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.సింగరేణి లో అస్సలు ఒప్పంద కార్మికులే లేరని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ అనడం చాల బాధాకరం అని ఆయన  అన్నారు.అదే విధంగా హైపవర్ కమిట వేతనాలు అమలు చేయాలనీ,బోనస్ చట్టం ప్రకారమా ఒప్పంద కార్మికులకు 8.33శాతం బోనస్ చెల్లించాలని,కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ కార్మికుల వెంటనే క్రమబద్దీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.ఓపెన్ కాస్ట్ లలో స్థానిక నిరుద్యోగ యువతకు  అధిక ప్రాధాన్యం ఇవ్వాలని,ఒప్పంద కార్మికులకు సింగరేణి యూనియన్ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాలని కోరారు.ఈ సమావేశం లో జేఏసీ  నాయకులూ అల్లూరి లోకేష్,శ్రీనివాస్,అషాక్,తిరుపతి,నాగయ్య,ఏషయ్య,శేఖర్,ఒప్పంద కార్మికులు,తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment