Wednesday, 8 February 2017

జాతరకు ఏర్పాట్లు ముమ్మరం-ఆర్డిఓపాండురంగ

జాతరకు ఏర్పాట్లు ముమ్మరం-ఆర్డిఓపాండురంగ 
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 8   ;  రెబ్బెన మండలములోని గంగాపురి జాతర ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆసిఫాబాద్ ఆర్డివో పాండురంగా నాయక్ అన్నారు . గురువారం నుండి 3 రోజుల పాటు జరిగే ఈ  జాతరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు బుధవారం తహసీల్దార్ కార్యాలయములో సమీక్షించి మాట్లాడారు . ఆలయం చుట్టూ ప్రదేశాలను పర్యవేక్షించారు . రాక పోకలకు ఇబ్బంది కలగకుండా, త్రాగు నీటి సౌకర్యం పై ఆరా తీశారు . భక్తులకు ఎలాంటి ఇబ్బందులు  కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు . ఆర్డీఓ తో పాటు  రెబ్బెన తహశీల్ధార్ బండారి రమేష్ గౌడ్ , తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment