మెరుగైన వేతన ఒప్పందాన్ని సాధిస్తాం
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 4 ; వారసత్వ ఉద్యోగంలో షరతులవలన వారసత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే కార్మికులు తీవ్ర ఇబ్బంధులు ఎదురుకుంటున్నారని,వారసత్వ ఉద్యోగాలకు షరతులను ఆంక్షలను ఎత్తివేయాలని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి డిమాండ్ చేశారు.శనివారం రోజున గోలేటిలోని కేఎల్ మహేంద్ర భవన్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ షరతులు లేని ఉద్యోగాలు కల్పిస్తామని ప్రగల్భాలు పలికిన తెరాస,టిబిజికెఎస్ నాయకులూ కార్మికులను మోసం చేసారని అన్నారు.గత నాలుగు సంవత్సరాలు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో గుర్తింపు సంఘం అయిన టిబిజికెఎస్ పూర్తిగా విఫలం అయిందని అన్నారు.కార్మిక క్షేత్రంలో కార్మికుల చేత తిరస్కరించబడిన కెంగర్ల మల్లయ్య ఏఐటీయూసీ ని విమర్శించడం అర్ధరహితం అని అన్నారు.కార్మికులను భయాందోళనలకు గురిచేస్తూ బలవంతపు చేరికలు చేపడుతున్నారని,దీనికి తగిన సమయంలో కార్మికులు బుద్ధి చెప్తారని అన్నారు.అంతర్గత కుమ్ములాటలతో రెండు వర్గాలు గ విడిపోయి జైళ్ల పాలయ్యి,కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసి కార్మికుల హక్కులను తాకట్టు పెట్టారని అన్నారు.రెండు వర్గాలుగా విడిపోయింది చాలక మూడోవ వర్గంగ వెంకట్రాప్ వర్గం చేరిందని దీనితో కార్మికులకు జరిగిన న్యాయం ఏమిలేదని వీరు కార్మికుల హక్కులను రక్షించలేరని,సాధించలేరని అన్నారు.గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వారు ఎన్ని సాధించారో కార్మిక వర్గానికి తెలియజేయాలని డిమాండ్ చేశారు.కార్మికుల పోరాటాల వల్లనే,ఏఐయూటీసీ నిర్వహించిన పోరుయాత్రలకు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం,యజమాన్యం దిగివచ్చి వారసత్వ ఉద్యోగాలను ప్రకటించాయి తప్ప టిబిజికెఎస్ చేసింది ఏమిలేదని అన్నారు. కార్మికుల హక్కులు సాధించడంలో,కాపాడడంలో ఏఐటీయూసీ నిరన్తరాహారం పోరాటాలు చేస్తుందని,రాబోయే పదవ వేజు బోర్డు సమావేశాలలో కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందాన్ని సాధించి తీరుతామని ఆయన అన్నారు.ఈ సమావేశంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు బయ్యా మొగిలి,ఆర్గనైజింగ్ కార్యదర్శి జగ్గయ్య,నాయకులూ జూపాక రాజేష్,సురేష్ కోరి,మారాం శ్రీనివాస్,బంటు దుర్గ ప్రసాద్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment