Thursday, 16 February 2017

తెలంగాణ ఉద్యమాకారులను స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలి ; ఉపేందర్, రవీందర్


తెలంగాణ ఉద్యమాకారులను స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలి ; ఉపేందర్, రవీందర్

కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 16 ; తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు జరిగిన మలిదశ ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపిన వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా అదుకొవాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా ఉపాధ్యాక్షులు బోగే ఉపేందర్,జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్ లు కోరారు. గురువారం రోజున తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆద్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ చంపాలాల్ కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో విద్యార్థులు, యువకులు, ప్రజలు, అన్ని వర్గాల వారు పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని గుర్తు చేశారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారని,2009 సంవత్సరం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసే అక్రమ కేసులు పెట్టిందని అన్నారు. ముఖ్యంగా నీళ్ళు, నిధులు, నియమాకాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని,తెలంగాణ రాష్ట్రం ఏర్పాడితే విద్యార్థుల,యువకుల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రాణాలకు తెగించి పోరాటం చేశామని,ఎంతోమంది విద్యార్థులు తమ ప్రాణాలను సైతం తెలంగాణ రాష్ట్రం కోసం అర్పించారని అన్నారు. కావున తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపిన ఉద్యమాకారులను స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలని,ఉద్యమాకారులకు ఐదు ఎకారాల ప్రభుత్వ భూమి,రెండు పడుకల గదుల ఇళ్లు,ఉద్యమాకారులందరికి ప్రతి నెల 25000 ఫించన్ అలాగే ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని,ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాహబ్ ,నారాయణ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment