ఈ నెల 8 నుండి జాతీయ స్టాయిపోటీలు
సమావేశములో మాట్లాడుతున్న రవీందర్
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 4 ; ఈ నెల 8 నుండి 12 వరకు జాతీయ స్థాయి బాల్ బ్యామెంటన్ పోటీలు మండలములోని గోలేటి భీమన్న స్టేడియం లో నిర్వహించబడుతాయని తెలంగాణా రాష్ట్ర బాల బాడమెంటన్ అసోసియేషన్ ప్రధాన కార్యాదర్శి ఏ రవీందర్ తెలిపారు . ఆయన మాట్లాడుతూ దేశము నుండి బాల బాలిక జట్లు 25 రాష్ట్రాలనుండి పాల్గొంటాయని పేర్కొన్నారు . క్రీడాకారులకు ఉచిత వసతి , భోజనము ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు . న్యాయ నిర్ణేతలుగా 30 మందిని నియమించినట్లు తెలిపారు . క్రీడాకారులందరికి బెల్లంపల్లి నుండి గోలేటి వరకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు . సింగరేణి , ప్రజా ప్రతినిధుల సహకారముతో ఈ క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment