నష్టపోయిన గిరిజన రైతులను ఆదుకోవాలి
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 3; కెరమెరి మండలం కొఠారి గ్రామా పంచాయతీ పరిధిలోని కళ్ళెగాం చెరువు నిర్మాణంలో భూములు కోల్పోయిన గిరిజన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం,అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారంరోజున కలెక్టర్ కార్యాలయంలోని ఏవో రమేష్ బాబుకు వినతిపత్రం అందజేశరు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వినర్ బోయిరే ప్రకాష్,ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆత్మకూరి ప్రశాంత్,రైతులు,సిపిఐ నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment