విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలి
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి 7 ; నూతనంగా ఏర్పడిన కుమురం భీం జిల్లాలో మొట్టమొదటి సరిగా జరుగుతున్న గంగాపూర్ జాతర సందర్భంగా జిల్లాలోని విద్యాసంస్థలకు ఒక రోజు సెలవు ప్రకటించాలని ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ ఒక ప్రకటనలో కోరారు.మంగళవారం రోజున రెబ్బెనలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ది కలిగిన గంగాపూర్ జాతరకు జిల్లా నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి భక్తులు హజరవుతారని కావున జిల్లాలోని విద్యాసంస్థలకు నెల 10వ తేదిన సెలవు ప్రకటించాలని జిల్లా అధికారులను కోరారు..ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఏఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు కస్తూరి రవి,డివిజన్ కార్యదర్శి పూదరి సాయి,మండల అధ్యక్షుడు మహిపాల్,మండల కార్యదర్శి పర్వతి సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment