Thursday, 9 February 2017

అంగరంగ వైభంగా గంగాపూర్ శ్రీనివాసుడి కళ్యాణం

అంగరంగ వైభంగా గంగాపూర్ శ్రీనివాసుడి కళ్యాణం   

కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవరి9   ;  రెబ్బెన : మండలంలోని గంగాపూర్ గ్రామా శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామి వారి కళ్యాణం గురువారం రోజున  అంగరంగ వైభవంగా వేదమంత్రాల నడుమ భక్త జనావాలి  మద్య జరిగింది.స్వామీ వారి కళ్యాణంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి దంపతులు,ఆసిఫాబాద్ ఆర్డీఓ పాండురంగ దంపతులు,రెబ్బెన మండల తహసీల్ధార్ బండారి రమేష్ గౌడ్ దంపతులు పాల్గొని స్వామీ వారి కళ్యాణాన్నీ అంగరంగ వైభవంగా నిర్వహించారు.కళ్యాణం మండపంలో భక్త దంపతులు స్వామి వారి ఎదుట ప్రత్యేక పూజలు,కుంకుమర్చనలు చేసారు.అదే విధంగా స్వామీ వారి కళ్యాణం సందర్బంగా వచ్చిన భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం  నిర్వహించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతు శ్రీ బాలాజీ దేవస్థానం చాలా పురాతనమైన,గొప్ప  విశిష్టత కలిగినదని  అన్నారు.గతంలో దేవస్థాన అభివృద్ధికి నిధులు కేటాంచిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం  వళ్ళ  పనులు సాగలేదని అన్నారు.వచ్చే సంవత్సరం జాతర వరకు ఆలయాన్ని మరింత అభివృద్ధి  చేస్తామని హామీ ఇచ్చారు.కళ్యాణ మండపాన్ని మరింత తీర్చి దిద్దుతామని అన్నారు.జాతరలో  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా. ఆసిఫాబాద్ డిఎస్పి భాస్కర్ ఆధ్వర్యంలో జిల్లాలోని పోలీస్ లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి ఛైర్మెన్ గంటుమేర,ఆలయ ఈఓ బాపిరెడ్డి,ఎంపిపి కార్నాథం సంజీవ్ కుమార్,మార్కెట్ ఏఎంసీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ,రెబ్బెన సిఐ మదన్లాల్,ఎస్ఐ దారం  సురేష్,భారీ సంఖ్యలో భక్తులు,వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపిటీసీలు,వివిధ పార్టీల నాయకులు  తదితరులు పూజలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment