అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అడ్డుకోలేరు....
అక్రమ అరెస్టులతో విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు చేపట్టే శాంతియుత నిరసనలు అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఎఐఎస్ఎఫ్ అసిఫాబాద్ నియోజకవర్గ కార్యదర్శి పూదరి సాయికిరణ్ అన్నారు.బుధవారంనాడు తెలంగాణ జేఏసీ తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీ ని అడ్డుకోవడాన్ని,ర్యాలీ లో పాల్గొన్న విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. బుధవారంనాడు రెబ్బెనలోని రోడ్లు మరియు భవనాల అతిధి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలం అయ్యిందని అన్నారు కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో అందరికి పదవులు ఉంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో ఇంత అరాచక పాలన వస్తుందని ఉహించలేదని అన్నారు. ఇందిరా పార్కు వద్ద నిరుద్యోగ నిరసన ర్యాలీ లో పాల్గొన్న కుమురం బీమ్ జిల్లా ఎఐఎస్ఏఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్,జిల్లా కార్యవర్గ సభ్యులు కస్తూరి రవికుమార్ లను అరెస్ట్ చేయాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.ఈ సమావేశంలో ఎఐఎస్ఎఫ్ రెబ్బెన మండల కార్యదర్శి పర్వతి సాయికుమార్,నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment