Monday, 27 February 2017

కంపుకొడుతున్నా సింగరేణి కార్మికవాడలు

కంపుకొడుతున్నా సింగరేణి  కార్మికవాడలు
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఫిబ్రవ 27 ;  గోలేటి సింగరేణి కార్మికుల కాలనీలు దుర్ఘంధం వెదజల్లుతుండంతో కార్మికులు,వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.సింగరేణి కాలనీలోని క్వార్టర్స్ కు ఆనుకోని సెప్టిక్ కుండీలు ఉండడం వలన,వందకు పైగా సెప్టిక్ కుండీలకు పై కప్పు లేనందున తీవ్ర దుర్గంధం వెదజల్లుతుండడంతో అనారోగ్యాలకు గురి అయ్యే ప్రమాదం ఉందని కార్మికులు వాపోతున్నారు.కొన్ని కుండీలు శిథిలావస్తుకు చేరి కూలి పొయ్యాయని,సెప్టిక్ కుండీలా పైపులు లీకేజీ ఏర్పడ్డాయని కార్మికులు.ఏరియా జనరల్  మేనేజర్ రవి శంకర్ స్వచ్ఛ గోలేటి,స్వచ్ఛ గనులు వంటి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ,కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం,పట్టింపులేని తనంతో సమస్య జటిలం అవుతుంది.సెప్టిక్ కుండీల మరమత్తులు చేపట్టి పై కప్పులు ఏర్పాటు చేయాలనీ కార్మికులు కోరుతున్నారు.      

No comments:

Post a Comment