Wednesday, 1 February 2017

ఐకేపీ విఓఏ ల సమస్యలను త్వరగా పరిష్కరించాలి ; డోంగ్రి తిరుపతి


ఐకేపీ విఓఏ ల సమస్యలను త్వరగా పరిష్కరించాలి ; డోంగ్రి  తిరుపతి 
                 

కొమరం భీం ఆసిఫాబాద్ ( వుదయం ) ఫిబ్రవరి 01 ;ఐ కె పి లో  విఓఏ లు గా  గత 15 సవత్సరాల నుండి  పనిచేస్తున్న ప్రభుత్వ రంగ  సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించకుండా సమస్యలు వలయం లో నెట్టేస్తున్నారని   ఐ కే పి విఓఏ  జిల్లా ఉపాధ్యక్షుడు డోంగ్రి తిరుపతి అన్నారు.  రెబ్బన లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశం లో  మాట్లాడారు  గత 15 సంవత్సరాలుగా   మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం చేయడంలో విఓఏ లు ప్రధాన పాత్రా పోశిస్తున్న ప్రభుత్వం తమ సమస్యలను  గుర్తుంచడం లేదన్నారు ఎన్నికల సమయం లో సి ఎం కెసిఆర్ విఓఏ లకు కనీస వేతనంగా నెలకు 5000 రూపాయిలు అందజేస్తామ ని  హామీ ఇచ్చారని అన్నారు .  సంవత్సరాలు  గడుస్తున్నా సి ఎం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదు పేర్కొన్నారు.  43 నెలలు గా బకాయి  వేతనాలు రాక ఆర్థికంగా ఇబ్బందులకు ఎదురుకుంటున్నామన్నారు  ప్రభుత్వం తమను పట్టించుకోక పోవడం తో సమస్యలు తీవ్రం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.  గతనెల 25 న ఐకేపీ విఓఏ ల జిల్లా  సమావేశానికి ఎం ఎల్ సి పురాణం సతీష్ , ఎం ఎల్ ఎ  కోవా లక్ష్మి ముఖ్య అతిథిలుగా విచ్చేసి ఐ కే పి విఓఏ ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను  పరిష్కరిస్తామని  హామీ ఇచ్చారని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం గుర్తించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.  ఈ సమావేశంలో మండల కార్యదర్శి శ్రీకాంత్ తదితర విఓఏ లు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment