రెబ్బెన : మండలంలోని గోలేటి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్వకంగా చేపట్టే హరితాహారం పథకంలో భాగంగా గుంటలు తవ్వకం మొదలు పెట్టారు. ఈసందర్బంగా డిప్యూటీ తహసీల్దార్ రామ్మోహన్ మాట్లాడుతూ... జులై 3న ప్రారంభమయ్యే హరితాహారం పథకంలో భాగంగా విలేజ్ ఫ్లానింగ్ అధికారుతో సమావేశమై మొక్కలు నాటడానికి గుంటలు తవ్వుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోలేటి సర్పంచ్ తోట లక్ష్మణ్, వీఆర్‌ఓ ఆశీర్వాదం , పలువురు కూలీలు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Monday, 29 June 2015
అంగన్‌వాడి కార్యకర్తల ర్యాలీ
రెబ్బెన : మండలకేంద్రమైన రెబ్బనలో అం గన్‌వాడీ కార్యకర్తలు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీ గ్రామ పంచాయతీ కార్యాలయం నుం చి ప్రారంభమై ప్రదాన వీధుల్లో కొనసాగింది. ఈ సందర్భంగా సూపర్‌వైజర్లు లక్ష్మీ, భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ... ఒకటినుంచి ఆరు సంత్సరాలలోపు పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని, ఈ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం మరియు పిల్లలు ఆడుకోవడానికి ఆటపాటలు నేర్పిస్తారని తెలిపారు. ఈ ర్యాలీలో అంగన్‌వాడీ కార్యకర్తలు, చిన్నారులు పాల్గొన్నారు.
పాఠశాలల బంద్‌ను విజయవంతం చేయండి
రెబ్బెన: విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కొరుతూ జూలై 1న విద్యాసంస్థలు బంద్‌ను తలపెట్టినట్లు ఎఐఎస్‌ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెండ్ దుర్గం రవీంద్రర్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో విలేఖరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరిలంచాలని కార్పొరేట్ విద్యాసం స్థలను ర ద్ధు చేయాలని, ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజులను నియంత్రించాలని, కేజీ టు పీజి విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థల యాజమాన్యాలు బంద్‌కు సహకరించి బంద్‌ను పాటించాలని కోరారు.
రెబ్బెనలో కూరగాయల ధరలు
రెబ్బెనలో కూరగాయల ధరలు

(కిలో..రూ.లలో)
టమాట రూ.50
వంకాయ రూ.50
బెండకాయ రూ.50
పచ్చిమిర్చి రూ.80
కాకరకాయ రూ. 70
బీరకాయ రూ.50
కాలిప్లవర్ రూ.50
క్యాబేజీ రూ.45
క్యారెట్ రూ.60
దొండకాయ రూ.40
రెబ్బెనలో పండ్ల ధరలు
రెబ్బెనలో పండ్ల ధరలు
(కిలో..రూ.లలో)
ద్రాక్ష 120
నల్లద్రాక్ష 100
దానిమ్మ 160
యాపిల్ 200
అరటి 60
కర్జుర 100
కీవీపండు 50
కొబ్బరి బొండ 30 ఒక్కదాని
Sunday, 28 June 2015
ఆంధ్రప్రభ యాప్ బాగుంది
ఆంధ్రప్రభ యాజమాన్యం నూతనంగా ప్రవేశ పెట్టిన యాప్ బాగుందని మండల కేంద్రానికి చెందిన గీతా కార్మికుడు వెంకన్న అన్నారు. ఆదివారం ఆంధ్రప్రభ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వార్తలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక సమాచారాన్ని సైతం క్షణాల్లో యాప్‌లో అప్‌లోడ్ చేయడం, స్థానిక వార్త్తలకు ప్రాధాన్యతనివ్వడం పట్ల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇళ్ల మధ్యలో ఉన్నలెవన్ కేవీ కరెంట్ లైన్ తొలంగించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మీకి వినతి పత్రం
రెబ్బెన : మండలంలోని ఇందిరా కాలనీ సబ్‌స్టేషన్ రోడ్డులో 11 కేవీ కరెంట్ లైన్ ఇళ్ల మధ్య ఉండటం ద్వారా శుక్రవారం తీగలు తెగి ఇంటిమీద పడి భారీ శబ్ధంతో మంటలు చెలరేగాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఇళ్ల మధ్యలో ఉన్న ఆ వైర్లను తొలంగించాలని కాలనీవాసులు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే కోవ లక్ష్మీకి వినతి పత్రం అందించారు. ఆమె పత్రాన్ని పరిశీలించి విద్యుత్ అధికారితో ఫోన్‌లో మాట్లాడి ఎమ్మెల్యే సొంత నిధులతో ఒక నెలలో వాటిని తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్‌కుమార్ జైశ్వాల్, అప్సర్ , బొడ్డు ప్రసాద్, జంసీద్,గోడిసేలా వెంకన్నగౌడ్, జోహార్, గుర్వారెడ్డి తదితర కాలనీవాసులు పాల్గొన్నారు .
నూతన విప్లవానికి నాంది ఆంధ్రప్రభ యాప్
రెబ్బెన : ఆంధ్రప్రభ యాప్‌తో నూతన విప్లవానికి నాంది వేసిందని గౌడ సంఘం మండల కోశాధికారి కొయ్యాల రాజాగౌడ్ అన్నారు. ఆదివారం ఆయన ఆంధ్రప్రభ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వార్తలను చూసి ఆంనందం వ్యక్తం చేశారు. స్థానిక సమాచారాన్ని సైతం క్షణాల్లో చూపించడం అభినందనీయమన్నారు. స్థానిక వార్తలకు సైతం ప్రాధాన్యత ఇవ్వడం హర్షనీయమన్నారు.
యాప్ డౌన్ లోడ్ చేసుకున్న యార్డ్ సూపెర్వైసేర్ సంజు
రెబ్బెన : ఆంధ్రప్రభ యాజమాన్యం నూతనంగా ప్రవేశ పెట్టిన యాప్ ఆకర్షితులై మండల కేంద్రానికి చెందిన బొగ్గు యార్డ్ సూపెర్వైసేర్ మోడెం సంజు గౌడ్ అన్నారు. ఆదివారం ఆంధ్రప్రభ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వార్తలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక సమాచారాన్ని సైతం వేగంగా యాప్‌లో అప్‌లోడ్ చేయడం, స్థానిక వార్త్తలకు ప్రాధాన్యతనివ్వడం పట్ల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రభ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్
రెబ్బెన : శనివారం ఆంధ్రప్రభ యాప్ ను రెబ్బెన అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ రాజ్‌కుమార్ డౌన్ లోడ్ చేసుకున్నారు. అందులోని వార్తలకు ఆకర్శితులై మాట్లాడారు. యాప్‌లో వచ్చేవార్తలు చెప్పిన వెను వెంటనే రావడంతో ప్రజలకు సమాచారం వెంటనే అందుతుందని అన్నారు. యాప్ వార్తలు సమాచారాన్ని వెనువెంటనే అందించిటం హర్షనీయం అన్నారు.
Saturday, 27 June 2015
హరితహారం పథకం పై అధికారులతో సమీక్ష
రెబ్బెన : మండల తహశీల్దార్ కార్యాలయంలో మండల అధికారులతో హరితహారం పై శనివారం సమీక్షనిర్వహించారు. ఈ సంర్భంగా మండలంలో హరితహారం గ్రామ ప్రణాళిక అధికారులకు వీడియో కాన్ఫరెన్స్‌లో తగిన సూచనలను ఇచ్చారు. ఈ సమాచారాన్ని ప్రజాప్రతినిధులకు, ప్రజలకు చేరేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రమేష్ గౌడ్ ఎం పీడీఓ ఎం.ఎ అలీమ్ ఎంపీఎం రాజ్ కుమార్, ఎం భాస్కర్ రెడ్డి, వెటర్నరీ వైద్యుడు సాగర్, ఎఈపీఆర్ శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు
హరితహారంపై అవగాహన సదస్సు
రెబ్బెన : స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో హరితాహారంపై సర్పంచ్‌లకు ఎంపీటీసీలకు అవగాహన సదస్సును శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సంజీవ్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితాహారంతో రాష్ట్రం మెత్తం పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ కార్య క్రమానికి రూపకల్పన చేశారన్నారు. ఈకార్యక్రమంలో జెడ్పీటీసీ, తహసీలార్, ఎంపీడీఓ, సీడీపీఓ, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏ,అయ్,టీ,యూ,సీ పోస్టర్లను విడుదల
రెబ్బెన మండలంలోని గోలేటిలో శనివారంనాడు KL మహేంద్ర భవనంలో ఏ,అయ్,టీ,యూ,సీ ఆధ్వర్యంలో మంచిర్యాల్ లో అక్టోబర్ 4 నుండి 6 వరకు జరిగే రాష్ట్ర మహాసభల పోస్టర్లను విడుదల చేశారు, ఏ,అయ్,టీ,యూ,సీ గోలేటి కార్యదర్శి S తిరుపతి మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలను అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్య,నర్సయ్య,శ్రీనివాస్,సత్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు
పోలీస్ స్టేషన్ లో హరితాహారం
రెబ్బెన పోలిసుల ఆధ్వర్యంలో హరితాహారం క్రింద రెబ్బెన జ్ప్సస్ స్కూల్ నుంచి విద్యార్థులతో ప్రధాన రహదారి మీద ర్యాలి నిర్వహించారు,తదనంతరం పోలీస్ స్టేషన్ లో SI CH హనూక్,సర్పంచ్ పెసరు వెంకటమ్మ,స్కూల్ HM శ్రీనివాస్,ASI మీరద్ధిన్ పోలీస్ సిబ్బంది మొక్కలను నాటారు. SI హనూక్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయంలో ముందుగా మనం మొక్కలను నాటితే అది చూసి ప్రజలు వాళ్ళ ఇళ్ళల్లో,పొలాల్లో నాటుతారని మన తెలంగాణ రాష్ట్రం హరితహారంలో పచ్చదనంగా మారాలని అయిన అన్నారు.
Friday, 26 June 2015
టిప్పర్ ఢీకొని సింగరేణి కార్మికునికి తీవ్రగాయాలు
రెబ్బన : మండలంలోని గోలేటి టౌన్‌షిప్ కు చెందిన మస్కరాజమల్లు అనే సింగరేణి కార్మికునికి గురువారం రాత్రి ఫిల్టర్ బెడ్ వద్ద కైరుగూడ వైపు వెళ్తున్న టిప్పర్ ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. రాజమల్లు నైట్‌షిఫ్ట విధుల్లో భాగంగా సైకిల్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తోటి కార్మికుల రాయమల్లును గోటేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఆసుపత్రి కితరలించారు. అనంతరం అత్యవసర చికిత్స కోసం బెల్లంపల్లి ఏరియా ఆసుప్రతికి తరలిలంచారు.
నర్సరీని పరిశీలించిన ఎంపీపీ
రెబ్బెన : మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ నర్సరీ శుక్రవారం ఎంపీపీ సంజీవ్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరితహారం లోభాగంగా 80 వేల మొక్కలు పంపిణీకి సిద్దంగా ఉన్నాయన్నారు. ప్రజలు ఇంటి ఖాళీ పరిసర ప్రాంతాల్లో , రోడ్లకు ఇరువైపుల, ఆసుపత్రులు, పాఠశాలల ఆవరణలో మొక్కలను నాటాలన్నారు. ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ బాబురావు, ఎంపీడీఓ అలీ, తహశీల్ధార్ రమేష్ గౌడ్, సింగిల్ విండో డైరక్టర్ మదనయ్య తదితరులు ఉన్నారు.
ఈజీఎస్ నర్సరీ పరిశీలన

రెబ్బన : మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈజీఎస్ నర్సరీని శుక్రవారం ఎంపీపీ సంజీవ్‌కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరితహారం లోభాగంగా నర్సరీలో 70 వేల మొక్కలు పంపిణీకి సిద్దంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ బాబురావు, ఎంపీడీఓ అలీ, తహశీల్ధార్ రమేష్ గౌడ్, సింగిల్ విండో డైరక్టర్ మదనయ్య తదితరులు ఉన్నారు.
సింగరేణి రోడ్డుపై మహిళల రాస్తారోకో
రెబ్బెన : మండలంలోని గోటేటి టౌన్‌షిప్‌లో సింగరేణి రోడ్డుపై మహిళలు రాస్తారోకో నిర్వహించారు. భగత్‌సింగ్ నగర్‌లో త్రాగునీటి కొరత అధికంగా ఉందని నీటిపంపులు కూడా సరిగా సరి చేయడం లేదని తెదేపా మహిళ జిల్లాధ్యక్షురాలు లక్ష్మీ తెలిపారు. నీటి సమస్యను సంబంధిత అధికారులు వెంటనే తీర్చాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలు ధర్నా చేయడంతో వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. సంబంధిత అధికారులు హామీ ఇవ్వడంతో మహిళలు ధర్నాను విరమించుకున్నారు.
పారిశుద్ద్యంపై అవగాహన సదస్సు
రెబ్బెన : మండల కేంద్రంలోని నారాయణపూర్ గ్రామంలో శనివారం పారిశుధ్యంపై హరితహారం పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సమావేశానికి ప్రజా ప్రతినిధులు, ప్రజలు హజరు కావాలని కోరారు.
ఆర్ట్స్‌అండ్‌సైన్స్ డిగ్రీ కళాశాలలో వృత్తి విద్యా కోర్సులు ప్రారంభం
రెబ్బన : మండల కేంద్రం లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర వృత్తి విద్యా సంస్థ గుర్తింపుతో స్వల్పకాలిక కోర్సులను ప్రారంభించినట్లు ప్రిన్సిపల్ అమీర్ ఉస్మాని తెలిపారు. టీడీపీ, వెబ్‌డిజైనింగ్, జ్యూడిషీయల్, గార్డెనర్, ట్యాలీ కోర్సులకు 3 నెలలు, ఫ్రీ ప్రైమరి టీచర్ ట్రైనింగ్ కోర్సుకు 9 నెలల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు కళాశాలలో సంప్రదించాలన్నారు.
Thursday, 25 June 2015
రెబ్బెనలో శుక్రవారం పండ్ల ధరల వివరాలు

ద్రాక్ష 120
నల్లద్రాక్ష 100
దానిమ్మ 160
యాపిల్ 200
అరటి 60
కర్జుర 100
కీవీపండు 50
ఒక్కదానికి ఆలుబుకార్ కేజీ 120
బత్తాయి 80
మామిడి 50
కొబ్బరి బొండ 30 ఒక్కదాని
నల్లద్రాక్ష 100
దానిమ్మ 160
యాపిల్ 200
అరటి 60
కర్జుర 100
కీవీపండు 50
ఒక్కదానికి ఆలుబుకార్ కేజీ 120
బత్తాయి 80
మామిడి 50
కొబ్బరి బొండ 30 ఒక్కదాని
రెబ్బెనలో శుక్రవారం కూరగాయ ధరల వివరాలు..
టమాట - రూ.50
వంకాయ - రూ.50
బెండకాయ - రూ.50
పచ్చిమిర్చి - రూ.80
కాకరకాయ - రూ. 70
బీరకాయ - రూ.50
కాలిప్లవర్ - రూ.50
క్యాబేజీ - రూ.45
క్యారెట్ - రూ.40
దొండకాయ - రూ.40
చిక్కుడు - రూ.40
గోరుచిక్కుడు రూ.30
పాలకూర - రూ.40
చుక్కకూర - రూ.40
అల్లం - రూ.80
ఎల్లిగడ్డలు - రూ.70
ఉల్లిగడ్డ - రూ.30
ఆలుగడ్డ - రూ.25
ఇండ్లపై పడిన కరెంట్ వైర్లు
రెబ్బన: మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ వెళ్లే రోడ్డువైపు గల ఇంద్రా కాలనీలో గల అప్సర్, గురువారెడ్డి, అబ్ధుల్, వైస్ ఎంపీపీ గొడిసెల రేణుకల మరియు గణేష్ పంతులు ఇండ్ల మీద విద్యుత్ వైర్లు పడ్డాయి. దీంతో భారీ ఎత్తున మంటలు చెల రేగాయి. మధ్యాహ్న సమయం కావడం వల్ల జన సంచారం లేనందున పెద్ద ప్రమాదం తప్పింది. ఈ వైర్లను తొలగించాలని ఇండ్ల మధ్య ఉన్న 11 కేవీ కరెంట్ వైర్లను తొలగించాలని అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య గురించి గతంలో ఎంపీడీవో కార్యాలయంలో ఆటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే కోవా లక్ష్మీలకు కూడా వినతిపత్రం అందజేశారు. అయినప్పటికీ విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడంతో వైర్లు తమ ఇళ్ల మీద పడ్డాయని వారు వాపోయారు. అధికారులు స్పందించి వెంటనే ఆ వైర్లను తొలగించాలని కాలని వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఖరీఫ్ పనుల్లో నిమగ్నమైన రైతులు
రెబ్బన: వర్షాకాలం ఖరీఫ్ సీజన్ మొదలవ్వడంతో మండలంలోని రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువులు, కుంటలు నిండడంతో రైతులు పొలాలను దున్నడం, పొలాల్లో విత్తనాలు విత్తడం, మొలకలు నాటడం పనుల్లో నిమగ్నమయ్యారు.
స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి
రెబ్బన: మండలంలో ఉన్న అంతర్ రాష్ట్ర రహాదారిపై వాహనాల రద్ధీ పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇవతల నుంచి అవతల వైపునకు రోడ్డును క్రాస్ చేయాలంటే ఇబ్బంది పడుతున్నామని ప్రజలు అంటున్నారు. అధికారులు స్పందించి వెంటనే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటుచేయాలని పలువురు కోరుతున్నారు
హరితహారంపై అవగాహన సదస్సు
రెబ్బన : మండల కేంద్రంలోని నంబాల గ్రామ పంచాయతీలో సర్పంచ్ గజ్జెల సుశీల మరియు సాక్షర భారత్ కోఆర్డినేటర్ గాందార్ల సాయిబాబా హరితహారం పథకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం పథకాన్ని విజయవంతం చేయాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, అలాగే ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలి
రెబ్బన: రెబ్బన మండల కేంద్రం నుంచి గంగా పూర్, లక్ష్మిపూర్, పాసిగామా, తుంగేడ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామా ప్రజలు కోరుతున్నారు. నిత్యవసరాల కోసం నిత్యం మండల కేంద్రానికి రెబ్బనకు రావడానికి ఆటోలో వెళ్లాల్సి వస్తుందని ఆధిక చార్జీలు తీసుకుంటున్నారని ఆటోలలో అధికంగా ప్రయాణికులను ఎక్కించడం వల్ల ఇబ్బంది పడుతున్నామని సంబంధిత అధికారులు స్పందించి గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి
రెబ్బన: రెబ్బన నుంచి గందాపూర్‌కు వెళ్లె తారురోడ్డు గుంతలు పడి వాహనాలు నడపడానికి ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని కొరుతున్నారు.
రెబ్బెనలో గురువారం పండ్ల ధరల వివరాలు

ద్రాక్ష 120
నల్లద్రాక్ష 100
దానిమ్మ 160
యాపిల్ 200
అరటి 60
కర్జుర 100
కీవీపండు 50
ఒక్కదానికి ఆలుబుకార్ కేజీ 120
బత్తాయి 80
మామిడి 50
కొబ్బరి బొండ 30 ఒక్కదాని
నల్లద్రాక్ష 100
దానిమ్మ 160
యాపిల్ 200
అరటి 60
కర్జుర 100
కీవీపండు 50
ఒక్కదానికి ఆలుబుకార్ కేజీ 120
బత్తాయి 80
మామిడి 50
కొబ్బరి బొండ 30 ఒక్కదాని
మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
రెబ్బెన : మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం మండల స్థాయిలో ప్రధాన ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంఏ అలీమ్ మాట్లాడుతూ పాఠశాలకు మంజూరైన మరుగుదొడ్లను ఈ నెల 30 లోపే కట్టించాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితాహారం పథకంలో భాగంగా మొక్కలు నాటాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రమేష్‌గౌడ్, ఐసీఐటీ రాంకుమార్, ఎంఈఓ మహేశ్వర్‌రెడ్డి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు
విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని దిష్టిబొమ్మ దహనం
రెబ్బెన : రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వామపక్ష విద్యార్ధి సంఘం దశల వారి ఆందోళనా కార్యక్రమంలో భాగంగా మండలంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ ఎఫ్ నాయకులు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు కస్తూరి రవి కుమార్, గోగర్ల రాజేష్, పూదరి సాయి కిరణ్, తిరుపతి, మహిపాల్ రాజు, సాయి, శివాజీ, టీవీవీ జిల్లా నాయకులు కడతల సాయి, ఆత్రం రవి, పర్వలి సాయి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వినోద్ పాల్గొన్నారు.
విత్తనాల పంపిణీ
రెబ్బెన : మండలంలో బుధవారం వ్యవసాయా సహకార కేంద్రం వద్ద విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులకు వరి, జీలుగు విత్తనాలు పంపిణీ చేశారు. జడ్పీటీసీ బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం పంపిణీ చేసే విత్తనాలను మాత్రమే వాడాలని నకిలి విత్తనాలను వాడి మోసపోవద్దని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ బాబురావు, సింగిల్ విండో చైర్మన్ రవీందర్, సర్పంచ్ పెసరు వెంకటమ్మ, ఏడీఏ శ్రీనివాస్, ఏఓ మంజుల ఏఈఓ మార్క్, వైస్ ఎంపీపీ గొడిసెల రేణుక, సింగిల్ విండో చైర్మన్ గాజుల రవి పాల్గొన్నారు.
రెబ్బనలో ఈరోజు కూరగాయల ధరలు
టమాట రూ. 50
వం కాయ రూ. 40
బిరకాయ రూ. 45
పచ్చి మిర్చి రూ. 80
గొరిచిక్కుడు కాయ రూ. 50
సిమ్లామిర్చి రూ. 80
అలచెంతకాయ రూ. 50
బెండకాయ రూ. 40
బీట్‌రూట్ రూ. 50
దొండకాయ రూ. 50
క్యారేట్ రూ. 50
కాకరకాయ రూ. 40
దొసకాయ రూ. 40
సోరకాయ రూ. 40
అలుగడ్డలు రూ. 25
ఉల్లి గడ్డలు రూ. 35
కొతిమీర రూ. 100
మునిగకాయలు రూ. 60
పాలకూర - రూ.40
చుక్కకూర - రూ.40
అల్లం - రూ.80
ఎల్లిగడ్డలు - రూ.70
ఉల్లిగడ్డ - రూ.30
ఆలుగడ్డ - రూ.25
Tuesday, 23 June 2015
వాహనాల తనీఖీ
రెబ్బెన : మండల కేంద్రంలో మంగళవారం పోలీస్టెషన్ ప్రధాన రహదారి వద్ద వాహనాలను రె బ్బెన ఎస్సై సి హెచ్ హనుఫ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లైసెన్స్‌లు లేనివారు వాహనాలు నడపరాదని వాహన పత్రాలు లేకుండ ప్రయాణం చేస్తే జరిమాన విధించడం జరుగుతుందని ఆయన అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఆయన తెలిపారు. ప్రమాదాలు జరుగకుడడానికీ ఉండాలని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
అవగాహన సదస్సు
రెబ్బెన : నంబాల గ్రామ పంచాయతీలో హరితహారంపై అవగాహన సదస్సు సర్పంచ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహిస్తున్నామని గ్రామ అధికారి, సాక్షరభారత్ కోఆర్డీ నెటర్ గాందర్ల సాయిబాబ తెలిపారు. ఈ సదస్సుకు గ్రామ అధికారులు, ప్రజలు హజరు కావాలని కోరారు.
మళ్ళీ తాబేలే గెలిచింది
అనగనగా ఒక ఎలుగుబంటి ఉండేది. ఒక శీతాకాలంలో రాత్రి నిద్రపట్టక బయట మంచులో తిరుగుతుంటే దానికొక తాబేలు కనిపించింది .

నుంచి తాబేలు తల పైకెత్తి తనను చూడడం దానికి నచ్చలేదు. 'నత్తనడకదాన ... ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నావ్? అని కాస్త ఎగతాళిగా అదిగింది.
తాబేలుకు కోపం డిప్పదాక అంటింది. 'ఏమిటా వ్యంగ్యం? అని నిలదీసింది. మాటామాటా పెరిగి ఎవరు వేగంగా పరిగెత్తగలరో పోటీ పెట్టుకుందామనుకునే దాకా వచ్చింది. సూర్యుడు క్షితిజరేఖ నుంచి బెత్తెడు దూరం పైకొచ్చాక పరుగు పోటి ప్రారంభించాలని నిర్నయించాలనుకున్నాయి. 'నువ్వు సరస్సు ఒడ్డున పరిగెత్తు. నేను సరస్సు అంచున నీళ్ళలో పరుగేత్తుతాను' అని చెప్పింది తాబేలు . 'సరస్సు నిండా మంచు ఉంది కదా! నువ్వు లోపల పరిగెట్టినట్టు నాకెలా తెలుస్తుంద'ని అడిగింది ఎలుగుబంటి. 'నేను సరస్సు అంచులోని మంచుగడ్డల్ని అక్కడక్కడా విరగొట్టి ఆ ప్రదేశాలలో తల పైకెత్తి చూస్తూ ఉంటాను. దాన్నిబట్టి నువ్వు నమ్మొచ్చు' అని జవాబిచ్చింది తాబేలు. సరేనంది ఎలుగుబంటి.
మర్నాడు అడవిలోని అన్ని జంతువులూ వచ్చాయి ఈ పోటీని చూడ్డానికి ఒడ్డున ఎలుగుబంటి నీళ్ళలో తాబేలు పరుగు ప్రారంబించాయి. తాబేలు తాను విరగ్గొట్టిన మొదటి మంచుగడ్డలో నుంచి తల బయటకి పెట్టి 'ఇదిగో ఇక్కడున్నాను ఎలుగుబంటి' అంది. అప్పటికి ఎలుగుబంటి అంది అప్పటికి ఎలుగుబంటి ఇంకా అక్కడకి చేరుకోలేదు. ఎలుగుబంటి ఆశ్చర్యపోయి వేగం పెంచింది. అయినా రెండోసారి కూడా తాబేలే ముందుంది. చివరిదాకా కూడా ఇలాగే సాగింది ఎలుగుబంటి పూర్తిగా వెనుకబడిపోయింది చివరికి ఘోరంగా ఓడిపోయింది.
ఆ అవమానం వల్లే అది శీతాకాలాలు బయటకి రాకుండా నెలల తరబడి నిద్రపోవడం అలవాటు చేసుకుందట. అది ఏమైతే మనకేంటి కాని ఆ పోటిలో తాబేలు ఎలా గెలిచిందో తెలుసా మీకు!
అన్ని జంతువులూ వెళ్ళిపోయాక ఆ సరస్సులోంచి అచ్చం దానిలాగే ఉండే అనేక తాబేళ్లు బయటికొచ్చాయి. అవన్నీ దాని బంధువులు స్నేహితులు ఎలుగుబంటి గుణపాటం నేర్పించడంలో నాకు సహకరించినందుకు మీకందరికీ కృతజ్ఞతలు అని చెప్పింది తాబేలు.

ఆ అవమానం వల్లే అది శీతాకాలాలు బయటకి రాకుండా నెలల తరబడి నిద్రపోవడం అలవాటు చేసుకుందట. అది ఏమైతే మనకేంటి కాని ఆ పోటిలో తాబేలు ఎలా గెలిచిందో తెలుసా మీకు!
అన్ని జంతువులూ వెళ్ళిపోయాక ఆ సరస్సులోంచి అచ్చం దానిలాగే ఉండే అనేక తాబేళ్లు బయటికొచ్చాయి. అవన్నీ దాని బంధువులు స్నేహితులు ఎలుగుబంటి గుణపాటం నేర్పించడంలో నాకు సహకరించినందుకు మీకందరికీ కృతజ్ఞతలు అని చెప్పింది తాబేలు.
ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ కొరుతూ తహసీల్దార్‌కు వినతి
రెబ్బెన : తహసీల్దార్ కార్యాలయంలో ఏఐఎస్‌ఎఫ్ డివిజన్ ఉపాధ్యక్షుడు బోరికర్ వినోద్ మండల తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ విద్యను పరిరక్షించి, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల దోపిడిని అరికట్టాలి. జీవో నెంబర్ 6ను సవరించి, కేజీ టూ పీజీ అమలు చేయాలని ఉపాధ్యాయుల పోస్ట్‌లను భర్తీ చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. వినతి పత్రం అందించిన వారిలో నాయకులు కస్తూరి రవికుమార్, గోగర్ల రాజేష్, ఊదారి సాయి కిరణ్, మోర్ల తిరుపతి, మహేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.
తక్కలపల్లిలో గ్రామ సభ
రెబ్బెన: రెబ్బన మం డంలోని తక్కలపల్లి లో గ్రామ సభ నిర్వహించారు. హరితహార పథకంలో గ్రామంలోఉన్న ప్రజలకు అవగాహణపై సర్పంచ్ మర్రి చిన్నయ్య మాట్లాడుతూ... ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులు చెట్లు నాటాలని, పారిశుద్ద్యం పరిశుభ్రతపైన మరుగుదొడ్లు లేని వారు మరుగుదొడ్లు నిర్మించాలని ప్రభుత్వం వీటి కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించారని, దీపం పథకంలో అర్హులైన వారికి గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్ర మంలో ప్రత్యేక అధికారి సాగర్, ఎంపీటీసీ మంగక్క, ఎఎన్‌ఎం కార్యాకర్తలు, ఆశావర్కర్లు, తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
మిషన్ కాకతీయ పనులు పూర్తి కాకపోవడంతో రైతుల ఆందోళన
రెబ్బెన: మండలంలో పలు చెరువులలో మిషన్ కాకతీయ పనులు పూర్తి కాకపోవడంతో నీరు వృధాగా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల్లో సంగం వరకు పనులు పూర్తి చేయకపోవడం చెరువులకు తూములు పెట్టకపోవడంతో గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి చేరిన నీరు వృధాగా పొతుందని రైతులు వాపొతున్నారు. సంబంధిత అధికారులు చెరువుల్లో నీరు వృధా వెళ్ళకుండా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కొరుతున్నారు.
పిడుగు పాటుతో ట్రాన్స్‌ఫార్మర్ దగ్గం
రెబ్బెన : గురువారం రాత్రి ఈదురుగాలులతో వర్షం కురియడం వల్ల రెబ్బెన మండలంలోని ఆర్‌అండ్‌బీ భవనం ఆవరణంలో ఉన్న 100డబ్ల్యూ కెపాసిటీ గల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పై పిడుగు పడింది. ఈ పిడుగు పాటు వలన ట్రాన్స్‌ఫార్మర్‌లో భారీ ఎత్తున శబ్దం వచ్చి మంటలు చెలరేగాయి. ఈ భారీ మంటలు రాత్రి నుంచి ఉదయం వరకు మండుతూనే ఉన్నాయి. దీనితో విద్యుత్ అధికారులు అప్రమత్తమై మంటలను చల్లార్చారు. రాత్రి నుంచి ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలో గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
వాటర్‌షెడ్ పరికరాల పంపిణీ
రెబ్బెన : వాటర్ షేడ్ పథకంలో భాగంగా శుక్రవారం రెబ్బెన ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎనిమిది ఆయిల్ ఇంజన్లు,స్పేర్ పం పు ఒకటి పంపిణీ చేశారు. ఇందిరా నగర్‌కు మూడు, రెబ్బెనకు ఒకటి, గంగాపూర్‌కు నాలుగు పంపిణీ చేశారు. ఈ వాటర్ షెడ్ పథకాన్ని అన్ని గ్రామ పంచాయతీలకు వర్తింప చేయాలని బోలేటి సర్పంచ్ తోట లక్ష్మణ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారునాథం సంజీవ్ కుమార్, తహసీల్దార్ రమేష్ గౌడ్, ఎంపీడీఓ ఎంఏ.హలీమ్, ఏపీఎం రాజ్ కుమార్, సహకార సంఘం చైర్మన్ రవీందర్, వట్టివాగు చైర్మన్ పెంటయ్య, రెబ్బెన సర్పంచ్ పెసరు వెంకటమ్మ, ఇతర గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన
రెబ్బెన : పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల విద్యార్థులకు శుక్రవారం పోలీస్ విధులపై అవగాహన కల్పించారు. విధులలో భాగంగా పోలీసులు ఏవిధంగా వ్యవహరిస్తారో, ఆయుధాల ఉపయోగం తదితర అంశాలను విద్యార్థులకు ఎస్సై హనుక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూములను పరిశీలించిన జేసీ సుందర్ అబ్నార్
రెబ్బెన : ప్రభుత్వం దళితులకు మూడేకరాల భూపంపిణీలో భాగంగా రెబ్బెన మండలంలో గల ప్రభుత్వ భూములను గురువారం జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ పరిశీలించారు. భూములు వ్యవసాయ పంటలకు అనువుగా ఉన్నాయో లేదో నాని ఆరా తీశారు. భూములకు సర్వే జరిపించారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్, రెబ్బెన తహసీల్దార్ రమేష్ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పెరిక యాదయ్య, గ్రౌండర్ వాటర్ ఈడీ కుమార స్వామి, మండల వ్యవసాయ అధికారి మంజూల, ఈపీఓఈపీఎస్ వెంకటీ తదితరులు ఉన్నారు.
హరితహారంపై అవగాహన సదస్సు
రెబ్బెన : రెబ్బన గ్రామ పంచాయతీలో గురువారం హరితహారంపై గురువారం మహిళ సంఘాల సభ్యులకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు, ఎఎన్‌ఎంలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పెసరు వెంకటమ్మ మాట్లాడుతూ.. ప్రభుత్వం హరితహారం ద్వారా గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రతి ఒక్కరు ఇంటి పరిసర ప్రాంతాల్లో, పోలాల గట్లపైన మొక్కలను నాటి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.హరితహారంపై తీసువలసిన జాగ్రత్తలపై పలువురు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ మధనయ్య, కార్యదర్శి రవీంధర్, వార్డు సభ్యుడు చిరంజీవి, ఉపాధ్యాయుడు సదానందం, ఫారెస్ట్‌బీట్ అధికారి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ సమావేశం
రెబ్బెన : పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిధి గృహంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు బీజేపీ మండల సమావేశం నిర్వహించడం జరుగుతుందని మండల అధ్యక్షుడు రాచకొండ రాజయ్య తెలిపారు. మండలం లోని బీజేపీ కార్యకర్తలందరూ సకాలంలో హాజరు కావాలని కోరారు.
ప్రైవేట్ మెడికల్ ఎంసెట్ ఎంట్రెన్స్ రద్దు చేయాలి
రెబ్బెన : ప్రైవేట్ మెడికల్ ఎంసెట్ ఎంట్రెన్స్ రద్దు చేయాలని ఏబీ వీపీ జి ల్లా కన్వీనర్ జుమ్మిడి రాజేష్ అన్నారు. పెంచిన మెడికల్ ఫీజులను రద్దు చేసి, ఎంసెట్ ద్వారా మాత్రమే మెడికట్ సీట్లను భర్తీ చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ఆవీడపు నరేష్, రంజి త్, హజార్ హాజరయ్యారు.
Monday, 22 June 2015
పురుగుల మందు సేవించి వివాహిత ఆత్మహత్య
రెబ్బెన : మండలంలోని ఇందిరానగర్‌కు చెందిన దుర్గం సరిత (30) అనే వివాహిత పురుగుల సేవించి ఆత్మహత్యయత్నం చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..బార్త లచ్చయ్య వేధింపులు తాళలేక సరిత పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. సరితను చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి త రలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని ఎస్సై సీహెచ్ హనుక్ తెలిపారు.
పారిశుద్ద్యం, పరిశుభ్రతపై అవగాహనా సదస్సు
రెబ్బెన : మండల కార్యాలయంలో పారిశుధ్యం, పరిశుభ్రత మీద అవగాహనా సదస్సు మంగళవారం జరిగిన సభలో మండల తహసీల్దార్ రమేష్‌గౌడ్ మాట్లాడుతూ మండల సర్పంచ్‌లు, అధికారులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, టీచర్లు గ్రామంలో ఉన్న ప్రజల మధ్య నిరంతరం తిరుగుతున్న ప్రతి ఒక్క అధికారి పారిశుద్యం మీద అవగాహన వచ్చేలా ప్రజలకు తెలపాలి. మరియు సర్పంచ్‌లు మురికి కాలువ పూడిక తీయించడం వాటర్ ట్యాంక్‌లు శుభ్రం చేసి బ్లిdచింగ్ చల్లడం ఇతర కార్యక్రమాలు చేయాలన్నారు. అలాగే హరితాహారం కింద ప్రతి ఒక్కరు ప్రతి ఊరులో చెట్లను నాటాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం పీపీ సంజీవకుమార్ జడ్పీటీసీ బాబురావు, మండల సర్పంచ్‌లు, మండల ఎంపీటీసీలు మండల వైద్యాధికారులు అంగన్‌వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు తదితర మండలాధికారులు పాల్గొన్నారు.
క్షేత్ర సహాయకుల రాష్ట్ర కమిటీ పిలుపు
రెబ్బెన : మహాత్మా గాం దీ జాతీయ గ్రామ ఉపాధి హామీ పని చేస్తున్న క్షేత్ర సహాయకుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమ్మె నోటీసులు మంగళవారం మండల ఎంపీడీఓ కార్యాలయంలో తహసీల్దార్ రమేష్‌గౌడ్‌కు అందజేశారు. వారి యొక్క కనీస వేతనాలు రూ. 5,440 నుంచి రూ.15,000 వరకు పెంచాలి. క్షేత్ర సహాయకులకు ఉద్యోగ బధ్రత కల్పిస్తూ పంచాయతీ అసిస్టెంట్ సెక్రటరీలుగా గుర్తించి, 43 శాతం ఫిట్‌మెంట్‌ను కలిగించాలి క్షేత్ర సహాయకులను పర్మినెంట్ చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కే. రహీమ్, ఉపాధ్యక్షులు డీ. శ్రీనివాస్ కోశాధికారి డీ. గణపతి, కమిటీ సభ్యులు పీ. దేవానంద్, వెంకటేష్, సుకారం త దితర సభ్యులు పాల్గొన్నారు.
కార్మికులకు ఇబ్బందులు కలుగకుండా ఓసీలకు పంపించాలి
రెబ్బెన : బెల్లంపల్లి ఏరియాలో గోలేటి 1 ఏ భూగర్భ గనిలో అదనంగా నిధులు నిర్వహిస్తున్న కార్మికులను ఇతర ఏరియాలకు పంపించకుండా గోలేటి ప్రాంతంలో ఉన్న ఓపెన్ కాస్ట్ గనులకు పంపించాలని ఏఐటీయూసీ యూనియన్ పలుమార్లు సింగరేణి యాజమాన్యాన్ని కోరగా వారు అంగీకరించడం జరిగిందని ఆ గ్రామ ఏఐటీయూసీ కార్యదర్శి ఎస్. తిరుపతి తెలిపారు. భూగర్భ గనుల నిధులను నిర్వర్తిస్తున్న కార్మికులకు ఇబ్బందులు కలుగకుండా ఉండాలని పరిసర ప్రాంత ఓసీలకు పంపించాలని అన్నారు
పనులు పూర్తి చేయని వారిపై చర్యలు తీసుకోవాలి
రెబ్బన: మిషన్ కాకతీయలో అధికార పార్టీ నాయకులు కాంట్రాక్టర్లుగా మారి పనులు కాకపోయిన బిల్లులకు సిద్దమవుతున్నాయని వర్షం పడి నీళు నిండదం ద్వారా చెరువుల పూడికతీత పనులు ఆయిపోయినదని చెప్పే ఆస్కారం ఉండడం వలన అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు మోడం సుదర్శన్‌గౌడ్ తెలిపారు. అలాగే చెరువు పూడిక మట్టిని రైతులకు తరలించడం లేదని వారి అధికార పార్టీనాయకుల రియల్‌ఎస్టేట్‌కు తరలిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అజయ్‌జ యశ్వాల్, బార్గవిగౌడ్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
Wednesday, 17 June 2015
గ్రామసభ
రెబ్బెన గ్రామ పంచాయితీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు, ఈ కార్యక్రమంలో దీపం పథకం క్రింద గ్యాస్ సిలిండర్ కొరకు దరఖాస్తులు స్వీకరించారు, సర్పంచ్ పెసరు వెంకటమ్మ మరియు ఏపిఎం రాజ్ కుమార్ మాట్లాడుతూ గ్రామా పంచాయితీలోని ప్రతి ఇంట్లో గ్యాస్ కనెక్షన్ వుండాలని దీపం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతి సెక్రెటరి రవీందర్, ఈసి శంకర్, కారోబారి తిరుపతి, మరియు వెలుగు సభ్యులు, గ్రామ ప్రజలు కార్యక్రమలో పాల్గొన్నారు.
ప్రతిభ
పుట్టుకతోనే మనిషికి ప్రతిభ ఉండదు. ప్రతిభ స్వంతంగా సాధించుకునేది కాదు. చుట్టూ వున్న మనిషి పుట్టుక మీద కాకుండా చుట్టూ వున్నా పరిస్థితి మీద ఆధారపడి వుంటుంది. పేద కుటుంబాలకు చెందిన పిల్లలందరికీ చదువుకోవడానికి పుస్తకాలు.పత్రికలు టీవి కంప్యూటర్ అందుబాటులో వుండవు ఇంటి దగ్గర చదువుకోవడానికి సహకరించే స్థాయిలో సంరక్షణ ఉండదు ఇలాంటి వారికి 40మార్కులు వచ్చి అన్నీ వుండి కార్పొరేట్ స్కూల్ లో చదివి 60మార్కులు తెచ్చుకున్న పిల్లవాడి కంటే పేద కుటుంబానికి చెందిన పిల్లవాడే ప్రతిభావంతుడు ఎందుకంటే సామాజికంగా సాంస్కృతికంగా అడ్డంకులు ఎదుర్కొని విద్య అభ్యసించేవాడే గొప్పవాడు
SKG
Tuesday, 16 June 2015
క్షేత్ర సహాయకుల రాష్ట్ర కమిటీ పిలుపు
మహాత్మా గాం దీ జాతీయ గ్రామ ఉపాధి హామీ పని చేస్తున్న క్షేత్ర సహాయకుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమ్మె నోటీసులు మంగళవారం మండల ఎంపీడీఓ కార్యాలయంలో తహసీల్దార్ రమేష్‌గౌడ్‌కు అందజేశారు. వారి యొక్క కనీస వేతనాలు రూ. 5,440 నుంచి రూ.15,000 వరకు పెంచాలి. క్షేత్ర సహాయకులకు ఉద్యోగ బధ్రత కల్పిస్తూ పంచాయతీ అసిస్టెంట్ సెక్రటరీలుగా గుర్తించి, 43 శాతం ఫిట్‌మెంట్‌ను కలిగించాలి క్షేత్ర సహాయకులను పర్మినెంట్ చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కే. రహీమ్, ఉపాధ్యక్షులు డీ. శ్రీనివాస్ కోశాధికారి డీ. గణపతి, కమిటీ సభ్యులు పీ. దేవానంద్, వెంకటేష్, తుకారం త దితర సభ్యులు పాల్గొన్నారు.
Monday, 15 June 2015
16న ప్రత్యేక సమావేశం
రెబ్బెన: మండలంలోని ప్రజా ప్రతినిధులకు, అధికారులతో మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఎంఎ అలీమ్ తెలిపారు. సమావేశంలో పారిశుద్ద్యం, ఆరోగ్యం తదితర అంశాలను చర్చించడం జరుగుతుందన్నారు. సమావేశానికి మండల స్థాయి అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అంగన్‌వాడి కార్యకర్తలు సకాలంలో హజరు కావాలని కోరారు.
Sunday, 14 June 2015
ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి
తెలంగాణ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో చేగువేరా వేడుకలు
రెబ్బెన మండలంలోని గోలేటి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఆదివారం చేగువేరా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాలులు అర్పించారు. పేదల కోసం చేగువేరా చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టివివి జిల్లా అధ్యక్షులు కె.సాయి, నాయకులు శివాజీ, పి.రవి, ఎ.రవి తదితరులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలి
రెబ్బెన మండలంలోని వంకులం గ్రామంలో అంబేద్కర్ నగర్‌లో సీసీరోడ్డు పాడైందని దీంతో రాకపోకలకు ఇబ్బందులవుతున్నాయని, సంబంధిత అధికారులు స్పందించి సీసీ రోడ్డు వేయించాలని గ్రామ ప్రజలు పేర్కొన్నారు.
పుస్తకాలు పంపిణీ చేయాలి
రెబ్బెన మండలంలో విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటికి ప్రభుత్వ పాఠశాల ల్లో పుస్తకాల పంపిణీ చేయడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షం రాకతో రైతుల్లో ఆనందం
రెబ్బెన మండలంలో ఆదివారం ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసాయి. వాతావరణం చల్లబడటంతో పొలాల్లో విత్తనాలు వేయడానికి రైతులు నాగలి పనులు ప్రారంభించారు. తొలకరి వానతో రైతులు ఆనందం వ్యక్తంచేశారు.
ఆటో ఢీకొనడంతో ఇద్దరికి గాయాలు
రెబ్బెన మండలం కేంద్రంలోని గోలేటి గౌతంనగర్‌లో అతివేగంగా వస్తున్న ఎపీ1 డబ్ల్యూ 420 నంబర్ గల ఆటో డ్రైవర్ ఏమరుపాటు, అజాగ్రత్త వలన శనివారం రాత్రి కాలనీలో ఇంటి ముందు మంచం మీద కూర్చున వారిని ఢీకొట్టింది.దీంతో మంచంపై కూర్చున్న దుర్గం జాను కు తలకు గాయాలు కాగా, అతని కూతురు అంజలి చేతికి, నడుముకు గాయాలయ్యాయి. జాను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెబ్బెన ఎస్సై హనోక్ తెలిపారు.
Saturday, 13 June 2015
నర్సరీలను పరిశీలించిన బెల్లంపల్లి రేంజ్ అధికారి
రెబ్బెన : హరితాహారంలో భాగంగా న ర్సరీలో బెల్లంపల్లి రేంజ్ అధికారి హన్మంత్ రావ్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జూలై నాటికల్లా లక్ష మొక్కలను అందించడానికి నర్సరీ మొక్కలు సిద్దంగా ఉన్నాయని, ఈ నర్సరీ మొక్కలను అందరికి పంపి ణీ చేయడానికి సిద్దంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా అధి కారి రవితేజ, డిప్యూటి రేంజ్ శ్రీనివాస్, ఎండి అథర్ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)