పంచాయితి ఏర్పాటు చేయాలనీ జిల్లా పాలనాధికారి వినతి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 20 : కుమురంభీం జిల్లా రెబ్బెన మండలంలోని తుంగెడ గ్రామపంచాయతీ పరిధి లో ఉన్న మాధవాయిగూడా, పోతపల్లి, జెండగుడా, పాత మాధవాయిగూడా గ్రామాలను కలిపి నూతన గ్రామపంచాయతీ గా ఏర్పాటు చేయాలని బీజేవైయం జిల్లా అధ్యక్షులు ఖండ్రే. విశాల్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందచేశారు. అనంతరం మాట్లాడుతూ ఈ గ్రామాల అభివృద్ధికి పంచాయితీగ ఏర్పాటు చేయాలనీ అన్నారు. ఈకార్యక్రమంలో , బీజేవైయం రెబ్బెన మండల అధ్యక్షులు ఇగురపు సంజీవ్ మరియు గ్రామస్తులు అలగం. శ్రీనివాస్, చౌదరి. తిరుపతి, సప్తే. దిలీప్, డోబే.శ్రీనివాస్, రమేష్, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment