Thursday, 9 November 2017

శిక్షణ తో విధులలో నూతన ఉత్సాహం - జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

శిక్షణ తో  విధులలో నూతన ఉత్సాహం - జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 09 :  విధి నిర్వహణ లో శిక్షణ అనునది మనలో ప్రతిభ ను మెరుగుపరుచుకునే సాదనం అని, శిక్షణ వల్ల సిబ్బంది లో నూతన ఉత్సాహం విధి నిర్వహణ లో ప్రతిభ ను చూపే ఆత్మ విశ్వాసం వస్తుందని  అని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. గురువారం  జిల్లా లోని  స్థానిక  ఎస్పి క్యాంపు కార్యాలయం లో జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి  ఇజ్రాయెల్ పోలీస్ లు ప్రదర్శించే క్రావ్ మాగా అను డిఫెన్సివ్ టక్టికల్ కోర్స్ ను హైదరాబాద్ RBVRR అకాడమీ నందు TOT( ట్రైనర్ అఫ్ ట్రైనీస్ )  శిక్షణ లో  ప్రతిభ కనబరచిన పోలీసులు  M. హరీష్ ,C.మనోహర్ మరియు B. శ్రావణ్   లను జిల్లా ఎస్పి అబినందించారు. ఈ సందర్బం గా వారితో జిల్లా ఎస్పి మాట్లాడుతూ వారి యొక్క  శిక్షణ విశేషాలను అడిగి తెలుసుకొని, జిల్లా లోని మొత్తం సిబ్బంది కు కూడా  ఈ తరహాలో శిక్షణ పొందేలా   మరియు రానున్న రోజులలో నెల నెల జిల్లా నుంచి విడతల వారిగా క్రావ్ మాగా సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ  కు పంపడం జరుగుతుందని జిల్లా ఎస్పి తెలిపారు. ఈ కార్యక్రమము లో ఎస్పి సీసీ డి. శ్రీనివాస్ , ఎస్బి సీ ఐ సుధాకర్, ఇంచార్జ్ ఆర్ ఐ వామన మూర్తి , ఎఆర్ ఎస్సై రామారావు, పోలీస్ వర్కింగ్ ప్రెసిడెంట్  శ్రీరాములు ,కిరణ్ కుమార్ లు  మరియు పి.ఆర్.ఓ మనోహర్  లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment