బెల్లంపల్లి ఏరియా లో బొగ్గు నాణ్యత వారోత్సవాలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 09 : బెల్లంపల్లి ఏరియా సింగరేణిలో గురువారంనాడు బొగ్గు నాణ్యత వారోత్సవాలు ఘనంగా జరుపుకొన్నారు. జిమ్ ఆఫీసులే ఆవరణలో జండా ఎగురవేశారు. బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కే రవిశంకర్ ఓసీపీ ఖైరుగూడలో ఉత్సవాలను ప్రారంభించి మాట్లాడుతూ నాణ్యమైన బొగ్గుయొక్క ఆవశ్యకతను విపులంగా విశదీకరించారు. బొగ్గును వెలికి తీసే సమయంలో ప్రతి కార్మికుడు బొగ్గులో మతి రాకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. నాణ్యమైన బొగ్గును వినియోగదారునికి అందించవలసి ఉన్నాడని అన్నారు. నాణ్యమైన బొగ్గు సరఫరా చేయలేకపోతే సంస్థకు కోట్లాది రూపాయల నష్టం వస్తుందన్నారు. ఖైర్గుడా గనిలో కార్మికులు మాట్లాడుతూ బొగ్గు వెలికితీతలో తీసుకొంటున్న జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జీఎం కొండయ్య, రాజమల్లు, రమేష్, కిరణ్, తదితర అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment