Tuesday, 14 November 2017

ఘనంగా చా చా నెహ్రు జన్మదినోత్సవాలు 

ఘనంగా చా చా నెహ్రు జన్మదినోత్సవాలు 


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) నవంబర్ 14 :   భారత్ తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా బాలల  దినోత్సవాన్నిమరియు  బాలల హక్కుల వారోత్సవాలు మంగళవారం స్థానిక ఐసిడిఎస్ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పాలనాధికారి ఎం చంపాలాల్ హాజరై జ్యోతి ప్రజలన చేశారు అనంతరం  మాట్లాడుతూ బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు బాలల దినోత్సవ కార్యక్రమాన్ని ఐసిడిఎస్  లో  జరుపుకోవడం చాలా సంతోషకరం అన్నారు చిన్నపిల్లలు దేవుని ప్రతిరూపాలుని కల్లాకపటం తెలియని వారన్నారు పిల్లల సంక్షేమం మరియు వారికీ చదువు, మంచి నడవడిక నేర్పింఛి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. కాగజ్ నగర్, కోసిని ,బజార్ వాడి, బురదగూడ, గ్రామాలకు చెందిన అంగన్వాడీ పిల్లలు  నెహ్రు, అల్లూరి సీతారామరాజు, భరతమాత వేషధారణలతో అలరించారు. అనంతరం బహుమతి ప్రదానం  కార్యక్రమంలో డి ఆర్ డి ఏ  ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకర్, ఐ సి డి ఎస్  ప్రాజెక్ట్ డైరెక్టర్ సావిత్రి , జిల్లా బాలల పరిరక్షణాధికారి రమేష్, సీడీపీఓ లు, సూపెర్వైసార్లు , అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment